Village Jurnalist : దేశం ఒక వైపు 75 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకుంటుంటే ఈ నాటికి కనీస వేతనం లేకుండా పనిచేస్తున్న ఒకే ఒక వర్గం గ్రామీణ పాత్రికేయ వర్గం, రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో వేలాది మంది విలేఖరులు అర్ధాకలితో జీవితాలను గడుపుతున్నారు. కార్పెంటర్, టైలర్, ప్లంబర్, తాపీ పనివారు ఇలా ప్రతి ఒక్కరూ తమతమ వేతనాలను వారే నిర్ణయించుకుంటున్నారు. కానీ ఒక్క గ్రామీణ విలేఖరి మాత్రం నేటికి కనీస వేతనం లేకుండా పనిచేస్తున్నాడు. లైన్ అకౌంట్ పేరుతో పెద్ద పత్రికలకు ఇచ్చే వెయ్యి, రెండు వేలు కూడా గత ఏడాది కాలంగా రావడం లేదని విలేఖర్లు ఆవేదనతో చెప్పలేక చెబుతున్నారు.
కరోనా కారణంగా పత్రికా యాజమాన్యాలు జిల్లా పేపర్ తీసివేసి మెయిన్ పేపర్ లోనే నియోజకవర్గానికి ఒక పేజీ ఇస్తుండటంతో మండల కేంద్రాల్లో పనిచేసే విలేఖరులకు లైన్ అకౌంట్ కూడా(Village Jurnalist) రావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామీణ విలేఖరులు ఎలా జీవించాలన్న అంశాన్ని ప్రభుత్వం కానీ, పత్రికా యాజమాన్యాలు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు.
గ్రామీణ పాత్రికేయుడు ఇంటికి వెళితే తినడానికి కూడా అన్నం ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అన్ని వర్గాల ప్రజలకు వరాలిస్తున్న తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పాత్రికేయుల విషయంలో మాత్రం ఏమాత్రమూ స్పందించడం లేదు. గత పాలకులు కూడా పాత్రికేయుల పట్ల సానుకూలంగా లేని పరిస్థితి ఉంది. కొత్త ప్రభుత్వాలు వస్తే తమకు మేలు జరుగుతుందన్న పాత్రికేయుల ఆశ అడియాశగానే మిగిలిపోతుంది. ఇక ప్రాంతీయ పత్రికల నిర్వాహకులు పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్టయ్యింది.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి ప్రకటనలు కూడా రావడం లేదు.వార, పక్ష, మాస పత్రికలకు నిరాసే మిగులుతుంది. ప్రకటనలు ఇవ్వకపోగా ఉన్న అక్రిడేషన్లు సైతం పునరుద్ధరింకుండా వాయిదాలు వేస్తున్నారు. ఎవరికి భారం కాకుండా స్వయం ఉపాధిగా సొంతంగా పత్రికలను నిర్వహిస్తూ ప్రభుత్వం పథకాలను ఎప్పటికప్పుడు మారుమూల ప్రజలకు తెలియజేసే ప్రాంతీయ పథకాలను ఎప్పటికప్పుడు మారుమూల ప్రజలకు తెలియజేసే ప్రాంతీయ పత్రికల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూడటం పట్ల ప్రాంతీయ పత్రికల సంపాదకులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
-మండల కేంద్రాలలో పనిచేస్తున్న గ్రామీణ విలేఖరులకు నెలకు కనీసం రూ.20 వేలు వేతనం ఇవ్వాలి.
-ప్రాంతీయ పత్రికలకు నెలకు కనీసం రెండు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలి.
-పాత్రికేయుల అక్రిడేషన్ లను వెంటనే పునరుద్ధరించాలి.
-పట్టణ, గ్రామీణ విలేఖరులనే బేధం లేకుండా అందరికీ పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలి.
-పాత్రికేయుల కుటుంబాలకు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలి.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!