vijayawada news: ద‌స‌రాకు విజ‌య‌వాడ‌ను చుట్టేసి రావొచ్చు హెలికాప్ట‌ర్‌లో..

Andhra Pradesh
Share link

vijayawada news విజ‌య‌వాడ : ద‌స‌రా ఉత్స‌వాల ఏర్పాట్ల‌ను కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ జె. నివాస్‌, విజ‌య‌వాడ సీపీ బ‌త్తిన శ్రీ‌నివాసులు ప‌రిశీలించారు. శ‌నీశ్వ‌ర‌ల‌యం నుండి మ‌హా మండ‌పం వ‌ర‌కూ క్యూలైన్లు, స్నాన‌పు ఘాట్‌ల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ఈ నెల 7న అన‌గా రేప‌టి నుంచి 15వ తేదీ వ‌ర‌కు ఇంద్ర కీలాద్రి పై ద‌స‌రా ఉత్స‌వాలు( vijayawada news ) జ‌ర‌గ‌నున్నాయి.

కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ భక్తుల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా అన్ని ఏర్పాట్లు చేశామ‌న్నారు. గ‌తేడాది మాదిరిగానే రోజ‌కు 10,000 వేల మందికి టైం స్లాట్ ప్ర‌కారం భ‌క్తుల‌కు అనుమ‌తి ఉంటుంద‌న్నారు. కోవిడ్ ప్ర‌భావం నేప‌థ్యంలో భ‌క్తులు నిల‌బ‌డే క్యూలైన్ల‌లో ఎక్కువ ప్ర‌దేశాల‌లో శానిటైజ‌ర్స్ పాయింట్లు ఏర్పాటు చేశామ‌న్నారు.

హెలిప్యాడ్ రైడ్ ఏర్పాటు..

ఈ సారి ఉత్స‌వాల‌లో హెలిప్యాడ్ రైడ్‌ను అందుబాటులోకి తెచ్చామ‌న్నారు. ఉత్స‌వాల‌కు వ‌చ్చే భ‌క్తులు విజ‌య‌వాడ ను హెలిప్యాడ్ ద్వారా వీక్షించొచ్చ‌న్నారు. సీపీ బ‌త్తిన శ్రీ‌నివా సులు మాట్లాడుతూ భ‌క్తుల‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామ‌ న్నారు. బందోబ‌స్తులో భాగంగా నాలుగు అంచెల భ‌ద్ర‌త ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ సారి క‌రోనా కార‌ణంగా అన్న‌దాన కార్య‌క్ర‌మాలు లేవ‌న్నారు. భ‌క్తుల‌కు పొట్ల‌లా రూపంలో అన్న ప్రసాదం అంద‌జేస్తామ‌న్నారు. మూల న‌క్ష‌త్రం రోజూ అద‌న‌పు సిబ్బందిని ఏర్పాటు చేసి భ‌క్తుల‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పిస్తామ‌న్నారు.

See also  Aarogyasri ప‌రిధిలో 50 శాతం బెడ్లు అందుబాటులో...Minister Vellampalli Srinivasa Rao

Leave a Reply

Your email address will not be published.