vijayanagaram news | నిద్రిస్తున్న విద్యార్థులను పాము కాటు వేసిన సంఘటన విజయనగరం జిల్లా కురుపాం జ్యోతిబాపులే బిసి వెల్ఫేర్ రెసిడెన్షియల్ (Jyotiba Phule bc welfare) బాలుర పాఠశాలలో చోటు చేసుకుంది. ముగ్గురు విద్యార్థులను ఒకేసారి పాము కాటు వేసినట్టు తెలుస్తోంది. 8వ తరగతి చదువుతున్న ఈ ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పాముకు కాటు(snake bite)కు గురైన విద్యార్థులు మంతిని రజింత్, ఈదుబుల్లి వంశీ, వంగపండు నవీన్‌గా అధికారులు వెల్లడించారు. విద్యార్థులను విశాఖ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది.
విద్యార్థిని చితకబాదిన టీచర్
ఓ విద్యార్థిని విచక్షణరహితంగా టీచర్ చితక బాదిన సంఘటన గుంటూరు జిల్లా బెల్లం కొండ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో వెలుగు చూసింది. బాధిత విద్యార్థి చేతులు, తొడలపై టీచర్ విచక్షణ రహితంగా చితకబాదినట్టు తెలుస్తోంది. టీచర్‌పై రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు వడిత్య శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!