
Vijay Mallya Life History|vijay mallya biography| ఒక్క తప్పు లండన్‌కు పారిపోయేలా చేసింది అది 2016 సంవత్సరం. కర్ణాటక హైకోర్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అతని మీద కేసు వేసింది.ఏమని అంటే? విజమాల్యా అనే అతను మా దగ్గర అక్షరాల రూ.6,000 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు అది వడ్డీతో కలిపి రూ.9,000 వేల కోట్ల రూపాలయు అయ్యింది. ఇప్పటి వరకూ కూడా అతని నుండి మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. కాబట్టి అతని నుండి రావాల్సిన డబ్బులు ఇప్పించాల్సిందిగా కోరుతూ కర్ణాటక హైకోర్టులో ఎస్బీఐ కేసు వేసింది.
అప్పుడు హైకోర్టు పోలీసులను విజయమాల్యా(Vijay Mallya)ను అరెస్టు చేయమని ఆదేశాలు జారీ చేసింది. కానీ ట్విస్ట్ ఏమిటంటే? విజయమాల్యా ఈ కేసుకు ఆరు రోజుల ముందే ఎవ్వరికీ తెలియకుండా లండన్‌కు వెళ్లిపోయాడు. అయితే ఇండియా పోలీసులు అతన్ని డైరెక్ట్‌గా వెళ్లి అరెస్టు తీసుకొచ్చే పర్మిషన్ లేదు. ఇప్పుడు పోలీసులు ఏం చేయాలి. అసలు విజయమాల్యా అనే అతను ఎవరు? బ్యాంకుల నుండి రూ.6,000 వేల కోట్ల రూపాయలు ఎందుకు అప్పు తీసుకున్నాడు. తిరిగి ఎందుకు చెల్లించలేకపోయాడు. అతని నుండి డబ్బులు రాబట్టడానికి బ్యాంకులు ఏం చేస్తున్నాయి? అనే విషయాల గురించి విజయమాల్య పై ప్రత్యేక స్టోరీ.
దేశంలో ప్రతిఒక్కరికీ కింగ్‌ఫిషర్ బీరు(KingFisher Beer) గురించి కొంతైనా తెలిసే ఉంటుంది.మన దేశంలో అత్యధికంగా మందు ప్రియులు, యువత ఎక్కువగా ఇష్టపడేది 50 శాతం కింగ్‌ఫిషర్ బీరే.అయితే ఆ కింగ్ ఫిషర్ బీరును యూనిటైడ్ బ్రీవేర్స్ అనే కంపెనీ తయారు చేస్తుంది. ఈ కంపెనీకి హెడ్ విజయమాల్య. 1983 సంవత్సరం అంటే విజయమాల్యాకు 28 సంవత్సరాలు ఉన్న వయసు లో యూనిటైడ్ బ్రీవేర్స్ కంపెనీకి విజయమాల్యా(Vijay Mallya) ఓనర్‌గా జాయిన్ అయ్యాడు.తాను ఓనర్ అయిన తర్వాత కంపెనీకి మంచి విజయంతో పాటు లాభాలు తీసుకొచ్చాడు. మెక్‌డోవెల్, బర్జర్పెయింట్స్,కిసాన్, మంగుళూరు కెమికల్స్ ఫెర్డిలైజర్స్ లాంటి ఎన్నో కంపెనీలు కొని,ఆ కంపెనీలన్నింటినీ యూనిటైడ్ బ్రీవేర్స్ విలీనం చేశాడు. 1999 కల్లా అంటే తను బాధ్యతలు చేపట్టి 15 సంవత్సరాలకే కంపెనీకి 64 శాతం లాభాలను పెంచాడు.
విజయమాల్యాకు కొత్త బిజినెస్‌లో దిగడమంటే చాలా ఇష్టం. అందుకే దేశంలో ఉన్న ఎన్నో కంపెనీలను సొంతం చేసుకొని వాటిని సక్సెస్ పుల్గా నడిపాడు. విజయమాల్యా(Vijay Mallya) కేవలం ఆల్కాహాల్ కంపెనీలే కాకుండా ఫుడ్ కంపెనీలు, ఫెర్టిలైజర్ కంపెనీలు, ఎలక్ట్రికల్ కంపెనీలను, న్యూస్ పేపర్ కంపెనీలను కూడా నడిపాడు. 2005 సంవత్సరం వరకు అతను చేసే బిజినెస్‌లకు ఎలాంటి డోకా లేదు. ఏ బిజినెస్‌లోకి అడుగు పెట్టిన విజయమాల్యాకు లాభాలే వచ్చాయి.
విజయమాల్యా అప్పులకు
కారణం ఇదే?
కానీ 2005లో మాత్రం అతను ఓ తప్పుడు మార్గం ఎంచుకున్నాడు.ఆ మార్గం కాస్త విజయమాల్యా జీవితాన్నే తలకిందులు చేసింది. 2005లో అతను ఎయిర్‌లెన్స్ కంపెనీలోకి అడుగు పెట్టాలని ఆలోచన చేశాడు. ఎయిర్ లైన్ బిజినెస్ మీద అతనికి మక్కువ పెరిగింది.వెంటనే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరుతో ఒక కంపెనీని ప్రారంభించాడు. కంపెనీ ప్రారంభంలో 4 విమానాలను కొని వాటిని ముంబై నుండి ఢిల్లీ మార్గంలో నడిపాడు. తర్వాత ఏడాదికే మరికొన్ని విమనాలు కొన్ని వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేద్దామనుకున్నాడు.
వెంటనే ఇంటర్నేషనల్ ఫైట్స్‌ను నడపటం ప్రారంభించాడు. అప్పట్లో కింగ్ఫిజర్ ఎయిర్‌లైన్స్‌కు మంచి పేరు ఉండేది. ఎందుకంటే? ఇంత వరకూ ఎయిర్‌లైన్స్‌లో ఏ కంపెనీ చేయనటువంటి సకల సదుపాయాలను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ (KingFisher Airlines) కంపెనీ మాత్రమే అందించేది. తక్కువ రేట్లకు లగ్జరీ సీట్లను ప్రయాణికులకు అందించేది. అలాంటి కంపెనీని విజయమాల్యా(Vijay Mallya) రన్ చేస్తున్నాడు. ఇలా సజావుగా సాగుతున్న సమయంలో కింగ్‌ఫిషర్ సంవత్సరం సంవత్సరం నష్టాల బాటలోకి నెట్టివేయబడింది.
అంతకంతకూ పెరిగిన నష్టం!
2006 సంవత్సరంలో రూ.340 కోట్ల నష్టం, 2007లో 706 కోట్ల నష్టం, 2008 సంవత్సరంలో రూ.230 కోట్ల నష్టం చవిచూడాల్సి వచ్చింది. అదే సమయంలో ఒక్క కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్(KingFisher Airlines) ఒక్కటే కాకుండా దేశంలో మరికొన్ని ఎయిర్‌లైన్సు కంపెనీలు నష్టాల బాట పట్టాయి. అదే సమయంలో విజయమాల్యా 2008 సంవత్సరంలో ఒక తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. అదేమిటంటే? నష్టాల్లో ఉన్న మరో ఎయిర్‌డెక్కన్ కంపెనీని కొన్నాడు. ఆ కంపెనీని తన సొంత కంపెనీ అయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో విలీనం చేశాడు.
అప్పుడు తన కంపెనీ వద్ద ఉన్న విమానాల సంఖ్య అమాంతం పెరిగింది. దాని వల్ల నష్టాలు ఇంకా ఎక్కువ అయ్యాయి. అదే సమయంలో ఇందనం రేట్లు భాగా పెరగడం వల్ల నష్టాలు ఇంకా ఎక్కువ అయ్యాయి. దీంతో కొన్ని ఎయిర్‌లైన్స్ కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయి. నష్టాలు పెరగడం వల్ల విజయమాల్యా(Vijay Mallya) గట్టెక్కట్టానికి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్రాండ్‌ను షూరిటీగా పెట్టి విజయమాల్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద లోన్లు తీసుకోవడం ప్రారంభించాడు.
కంపెనీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా రాలేదు. అయినా కూడా ఎస్బిఐ విజయమాల్యాకు లోన్లు ఇస్తూనే ఉంది. కారణం కంపెనీ ఎప్పటికైనా లాభాల్లోకి వస్తుందనే నమ్మకంతో. ఇక 2012 సంవత్సరంలో విజయమాల్యా కంపెనీలకు మరింత దరిద్రం చుట్టుకుంది. ఒక పక్క ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇండియన్ ఎయిర్‌లైన్స్ కంపెనీలన్నీ నష్టాల్లోకి వెళ్లాయి. కొన్ని ఎయిర్‌లైన్స్ కంపెనీలైతే మూతపడ్డాయి. మిగతా కంపెనీల వద్ద పెట్టుబడి పెట్టే వారు ఉండటం వల్ల ఏదో ఒక విధంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కానీ కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌కు పెద్ద ఇన్వెష్టర్లు లేరు. అప్పటికే బ్యాంకుల వద్ద చాలా పెద్ద మొత్తంలో అప్పులు తీసుకుంది. డబ్బులు లేక కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి మొదలైంది. దీంతో ఉద్యోగులు ధర్నాకు దిగారు. అప్పుడు విజయమాల్యా(Vijay Mallya) వారికి ఎలాగోలా సర్థిచెప్పి మళ్లీ వ్యాపారాన్ని ప్రారంభించాడు.
ఉద్యోగుకులకు జీతాలు చెల్లించలేక!
తాను ఓనర్‌గా ఉన్న యూనిటైడ్ బ్రీవేర్స్ కంపెనీలో కొన్ని షేర్లను అమ్మి ఆ వచ్చిన డబ్బులను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో పెట్టాటు.అయినా కూడా ఆ డబ్బు సరిపోలేదు. ఎవరైనా విదేశాలకు చెందిన పెట్టుబడి పేట్టేవారు దొరుకుతారేమోనని వెతుకులాడాడు. కానీ కింగ్‌ఫిషర్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. మీము ఇక అప్పులు ఇవ్వలేమని బ్యాంకులు కూడా చేతులెత్తే సాయి. ఇంధన ధరలు తగ్గించాలని అప్పట్లో ప్రభుత్వానికి విజయ్‌మాల్యా(Vijay Mallya) లేఖలు రాసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. నష్టాల్లో ఉన్న తన కంపెనీని కాపాడాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు.
కానీ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. ఒక వైపు ఎయిర్‌లైన్స్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. కంపెనీ అద్దెకు తీసుకున్న స్థలానికి అద్దె డబ్బులు చెల్లించలేదు. అందువల్ల ప్రభుత్వం విజయ్మల్యాకు ప్రభుత్వం ఇచ్చిన లీజు కాంట్రాక్టు రద్దు అయ్యింది.దీంతో కింగ్‌ఫిషర్ కంపెనీ(KingFisher Airlines)ని కొనసాగించడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో అన్ని దార్లు మూసుకుపోయాయి. 2014 సంవత్సరం కల్లా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కంపెనీ మూతపడింది. అదే సమయంలో మరికొన్ని ఎయిర్‌లైన్స్ కంపెనీలు కూడా మూతపడ్డాయి.ఒక వైపు బ్యాంకులకు వడ్డీతో సహా ఇవ్వాల్సిన రూ.6,000 కోట్ల డబ్బులను ఇవ్వలేదు. మరోవైపు ఉద్యోగులకు రూ.3000 కోట్ల డబ్బులు జీతాలు ఇవ్వలేదు.
బిలీనీయర్ నుంచి మిలీయనర్గా పతనం!
2010 సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో బిలీయనర్గా ఉన్న మాల్యా 2014లో మిలీయనర్గా పడిపోయాడు. దీంతో కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌కు నష్టం రావడం వల్ల ఎస్బీఐ బ్యాంకు 2014 నుండి 2016 సంవత్సరం వరకు విజయ్ మాల్యా తీసుకున్న డబ్బులు చెల్లిస్తాడేమోనని ఎదురుచూశాయి. అప్పటి వరకూ బ్యాంకు ద్వారా తీసుకున్న డబ్బులను చెల్లించకపోవడంతో లీగల్‌గా సిద్ధమయ్యాయి. మాల్యా బ్యాంకుల వద్ద నుండి తీసుకున్న రూ.6,000 వేల కోట్ల డబ్బులు 2016 సంవత్సరం కల్లా వడ్డీతో కలిపి రూ.9,000 వేల కోట్ల రూపాయలు అయ్యింది. అందుకే ఎస్బిఐ 2016లో విజయ్‌మాల్యాపై కేసు పెట్టింది.
కానీ కేసుకు ఆరు రోజుల ముందే విజయ్‌మాల్యా ఎవ్వరికీ తెలియకుండా లండన్ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి భారత్ ప్రభుత్వం విజయ్‌మాల్యా(Vijay Mallya)ను లండన్ నుంచి భారత్‌కు రప్పించి అతను తీసుకున్న డబ్బులను వసూలు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ మాల్యా మాత్రం లండన్‌లోనే ఉండి తనపై ఉన్న కేసులను పరిష్కరించుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ నుంచి విజయ్‌మాల్యాకు, భారత్ ప్రభుత్వానికి మధ్య కొన్ని లొసుగులు జరిగాయి. అవేమిటంటే.
బ్యాంకులు కేసు పెట్టిన వెంటనే విజయ్‌మాల్యా ఈ విధంగా మాట్లాడాడు. ‘నేను గత 30 సంవత్సరాలుగా ఆల్కాలిక్ కంపెనీని నడుపుతున్నాను.ఈ ముప్సై సంవత్సరాల్లో నా కంపెనీ ఎన్నో కోట్ల రూపాయలను ప్రభుత్వానికి పన్ను రూపంలో కట్టింది.అదే విధంగా నా ఎయిర్‌లైన్స్ కంపెనీ కూడా ప్రభుత్వానికి కోట్ల రూపాయలలో పన్ను కట్టింది. ఇవాళ నా ఎయిర్‌లైన్స్ బిజినెస్ విఫలమైంది. అయినా కూడా ప్రభుత్వం నన్ను ఆదుకోలేదు.ఇప్పుడేమో నేను డబ్బులు కట్టకుండా పారిపోయానని నాపైన ముద్ర వేస్తుంది. మీడియా కూడా నన్ను అలాగే చిత్రీకరిస్తున్నాయి. ఈ దేశంలో ఎన్నో కంపెనీలు వ్యాపారం పరంగా విఫలమయ్యాయి. వాటి వల్ల ప్రభుత్వానికి ఎన్నో లక్షల కోట్ల నష్టం వచ్చింది.భూషన్స్టీల్ రూ.25,000 వేల కోట్ల రూపాయలు బ్యాంకుల వద్ద అప్పుగా డబ్బులు తీసుకుంటే అందులో రూ.15,000 కోట్ల రూపాయలు చెల్లించాలని సెటిల్మెంట్ చేసుకున్నారు.
రుచిసేల్ కంపెనీ రూ.9,500 కోట్ల రూపాయలు బ్యాంకులకు అప్పు ఉంటే రూ.4,500 కోట్ల రూపాయలతో సెటిల్ చేసుకున్నారు. వాళ్లందర్నీ వదిలేసి నన్ను మాత్రమే పట్టి పీడుస్తున్నారు. అయినా పర్వాలేదు. నేను తీసుకున్న రూ.6,000 వేల కోట్ల రూపాయలు అప్పును తీర్చివేస్తాను. ఒన్‌టైం సెటిల్మెంట్ చేసుకుందాం.వడ్డీని మాత్రం అస్సలు కట్టలేను. ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.300 కోట్ల రూపాయలు కూడా ఇస్తాను. నాపై ఉన్న కేసులన్నీ విత్‌డ్రా చేసుకోండి. నేను ఇండియాకు వస్తే న్యాయస్థానంలో నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. కేసులను సంవత్సరాలకొద్దీ సాగదీస్తారు. అందుకే నేను ఇండియాకు రావడం లేదు. నేనేమీ డబ్బులని దొంగిలించలేదు. ఒక బిజినెస్‌మ్యాన్‌గా ఫెయిల్అయ్యాను.కానీ నా మీద భారత్ ప్రభుత్వం ఒక దొంగగా ముద్ర వేశారు.’
బ్యాంకులు మాత్రం అసలు మొత్తాన్ని తీసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే?విజయ్‌మాల్యా(Vijay Mallya)కు దాదాపు 15 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని అంచనా.మాల్యాకు ఇండియాలో కొన్ని ఆస్తులు మాత్రమే ఉన్నాయి. మిగతావి యుకేలో ఉన్నాయి. కావున ఆ ఆస్తుల ద్వారా డబ్బులు తీసుకోవాలని బ్యాంకులు ఆలోచిస్తున్నాయి. 2016 నుంచి 2020 సంవత్సరం వచ్చింది. కానీ ఇప్పటి వరకూ బ్యాంకులకు రావాల్సిన డబ్బులు రాలేదు.
అసలు నేను చేసిన నేరం ఏమిటి?
విజయ్‌మాల్యా(Vijay Mallya) కూడా ఇండియాకు రాలేదు. ఇప్పటికే మాల్యా చెబుతున్న మాట ఏమిటంటే..బ్యాంకుల నుండి తీసుకున్న అసలు మొత్తం చెల్లిస్తాను అంటున్నాడు. కానీ బ్యాంకులు మాత్రం ఆ ఒప్పందానికి ససేమిరా అంటున్నాయి. మాల్యా నుండి వడ్డీతో సహా వసూలు చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. ఇతర దేశాల్లో కంపెనీలకు నష్టం వాటిల్లితే అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఆ కంపెనీలను ఆదుకుంటాయి. కానీ భారత్‌లో మాత్రం నాపై ఎందుకు ఇన్ని కేసులు పెట్టారు. నేను డబ్బులు ఇస్తానని చెప్పినా నా ఆస్తులను వేలం వేయాలని చూస్తున్నారు. నాతో పాటే ఎన్నో ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఫెయిలయ్యాయి. ఇప్పుడు జెడ్ ఎయిర్‌లైన్స్ కంపెనీ కూడా ఫెయిల్ అయ్యింది.
కానీ నా ఒక్కడిపై మాత్రమే ‘దొంగ’ అని ముద్ర వేశారు. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.’ అంతెందుకు ఇప్పుడు ప్రభుత్వం నడిపించే ఎయిర్‌లైన్స్ కూడా నష్టాల్లో నడుస్తుంది. దానికి ప్రభుత్వం ప్రజల నుండి వసూలు చేసిన డబ్బులను అడ్డం పెట్టింది. అంటూ తన ట్విట్టర్లో ఇటీవల ట్విట్ చేశారు విజయ్‌మాల్యా. ఇప్పటికే తన కంపెనీకి ఓనర్‌గానే ఉన్నాడు. తాను చెప్పిందే ఆ కంపెనీలో వేదం. బ్యాంకులు విజయ్‌మాల్యా(Vijay Mallya)ను ఎలాగైనా ఇండియాకు తీసుకురావాలని, డబ్బులు మొత్తం వసూలు చేయాలని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంది. కింగ్‌ఫిషర్(KingFisher) బీర్ కంపెనీ ఇప్పటికే నడుస్తూనే ఉంది. విజయ్‌మాల్యా చెప్పేది ఒక్కటే..’నాకు భారత్న్యాయస్థానంపై నమ్మకం లేదు. అందుకే నేను ఇండియాకు రాకుండా నన్ను నేను నిజాయతీపరుడునని నిరూపించుకోవాలనుకుంటున్నాను. నేను దొంగను కాదు. నేను ఒక ఫెయిల్యూర్అయిన బిజినెస్‌మ్యాన్‌ను మాత్రమే.’ అంటూ తనదైన శైలిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. విజయ్‌మాల్యా.