meter tampering: గాజువాక: అసలే పెట్రోల్, డీజిల్ బంక్ల వెంట చూస్తుంటేనే వాహనదారులకు ముచ్చెమటలు పడుతున్న రోజులయ్యాయి. ప్రభుత్వాల పుణ్యమా అని పెట్రోలు, డీజిల్ ధరలు రూ.100 మార్క్ దాటి నెలలు గడుస్తుంది. ఇది ఆసరాగా చేసుకుంటున్న కొన్ని పెట్రోల్ బంకుల వారు వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలను రోజుకు ఒకటైనా చూస్తూనే ఉన్నాం. విశాఖ పట్టణం నగరంలో కూడా ఇదే జరుగుతోందని ఒక వాహనదారుడు హెచ్పి పెట్రోల్ బంక్లో డీజిల్ పంప్ ట్యాపరింగ్(meter tampering) జరుగుతుందని ఆరోపిస్తూ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
నగరంలోని ఉన్న పలు పెట్రోల్ బంక్లలో మంగళవారం విజిలెన్స్ అదికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు గాజువాక బి.సి రోడ్డు వద్ద ఉన్న హెచ్.పి పెట్రోల్ బంక్లో డీజిల్ పంప్ ట్యాపరింగ్ జరిగిందంటూ ఆరోపిస్తూ ఒక వ్యక్తి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ జి.స్వరూప రాణి నేరుగా ఆ పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుని తన సిబ్బందితో తనిఖీలు చేపట్టారు.


అయితే బంక్లో ఉన్న పంప్లకు ఎటువంటి ట్యాపరింగ్ జరగలేదని గుర్తించిన అధికారులు బంక్లో పెట్రోల్, డీజిల్ శాంపిల్స్లను సేకరించి నాణ్యత పరీక్షలకు పంపిస్తామని వెల్లడించారు. ఆమె వెంట విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ తిరుపతిరావు, సివిల్ సప్లయ్ ఎ.ఎన్ ఓ మూర్తి, తూనికల శాఖ అధికారి రామచంద్రయ్య తదితరులు ఉన్నారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!