video resume

video resume: వీడియో రెజ్యూమ్ లో పాటించాల్సిన టిప్స్‌ తెలుసుకోండి!

Spread the love

video resumeకంప్యూట‌ర్స్ కంటే స్మార్ట్‌ఫోన్‌ల‌కే గిరాకీ పెరిగిన‌ట్టు.. ప్ర‌స్తుతం రెజ్యుమ్ స్థానాన్ని వీడియో రెజ్యూమ్‌లు భ‌ర్తీ చేస్తున్నాయి. అవును ఇప్పుడున్న కాంపిటీష‌న్ వ‌రల్డ్‌లో వీడియో రెజ్యూమ్స్‌ను బ‌డా బ‌డా కంపెనీలు ప్రిపేర్ చేస్తున్నాయి. ఇంత‌కీ వీడియో రెజ్యూమ్స్ షూట్ చేసే స‌మ‌యంలో ఎలాగా బిహేవ్‌(ప్ర‌వ‌ర్త‌న‌) చేయాలో (video resume)తెల్సుకుందాం.

ఫారిన్ కంపెనీ(foreign company)లు వీడియో రెజ్యూమ్స్‌కే అధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌డానికి కార‌ణం విద్యార్థి లేదా ఉద్యోగి ప్రెజంటేష‌న్ స్కిల్స్ అందులోనే క‌నిపిస్తాయి. కేవ‌లం మూడు నిమిషాల్లో అత‌ని మాట‌తీరు, బాడీ లాంగ్వేజ్‌, ఇంగ్లీష్ భాష‌లో క‌మ్యూనికేష‌న్‌, విద్యార్హ‌త‌లు, అనుభ‌వం, ఇట్టే అర్థ‌మ‌వుతుంది. దీంతో కంపెనీల‌కు వీడియో రెజ్యూమ్స్ వ‌ల్ల ఉద్యోగుల్ని ఎంపిక చేసే ప్ర‌క్రియ సుల‌వవుతుంది.

వీడియో రెజ్యూమ్స్ ఎలా రూపొందించాలి, అస‌లు ఎలా ఉంటాయి అని తెలుసుకునేందుకు నెట్‌లో వీడియో రెజ్యూమ్స్ చూడాలి. మొద‌ట ఎలా మాట్లాడాలో పేప‌రుపై రాసుకోవాలి. రాసిన విష‌యాన్ని గుర్తుంచుకుని ప‌దే ప‌దే గ‌ట్టిగా అద్దం ముందు ప్రాక్టీసు చేసుకోవాలి. వీడియో షూట్ చేసే ముందు డ‌ల్ లైటింగ్ లేకుండా చూసుకోవాలి. ఆక‌ర్షణీయంగా క‌నిపించేట్లు వీడియోను సెట్ చేసుకోవాలి. కెమెరాకు ఎదురుగా ఉండాలి. దిక్కులు చూడ‌టం, పైకి, కింద‌కి చూడ‌టం వంటివి చేయ‌కూడ‌దు. చుట్టు ప్ర‌క్క‌ల ఎలాంటి శ‌బ్ధాలు లేకుండా జాగ్ర‌త్త‌ప‌డాలి.

ఫేస్ టు ఫేస్ ఇంట‌ర్వ్యూ(interview) చేస్తున్న‌ట్టు భావించి తొలుత మీ పేరు చెప్పి వీడియో రెజ్యూమ్ ను స్టార్ట్ చేయాలి. ప్రొఫెష‌న‌ల్‌గా డ్రెస‌ప్ కావాలి. గుండెలోంచి మాట‌లు రావాలి, అంతేగాని స్క్రిప్ట్ అప్ప‌జెప్పిన‌ట్టు ఉండ‌కూడ‌దు. ఉంటే స్లో, లేకుంటే ఫాస్ట్‌గా మాట్లాడ‌కూడ‌దు. సాధార‌ణ వేగం ఉండాలి.

సొంత అభిప్రాయాలు, సెల్ఫ్ డ‌బ్బా కంటే ప్రొఫెష‌న‌ల్ విష‌యాలు ఏం నేర్చుకున్నారో సూటిగా చెప్పాలి. విదార్హ‌త‌ల‌తో పాటు మీ రంగంలో ఉన్న అనుభ‌వాన్ని ఖ‌చ్చితంగా చెప్పాలి. మిమ్మ‌ల్ని వాళ్ల కంపెనీలో తీసుకుంటే స‌మ‌ర్థంగా ప‌నిచేస్తార‌నే విష‌యాన్ని కాన్ఫిడెంట్‌గా చెప్పాలి. చివ‌ర‌కు స్మైలింగ్ ఫేస్‌తో రిక్రూట‌ర్‌కు థ్యాంక్స్ చెప్పాలి. అన్నింటి కంటే ముఖ్య‌మైన విష‌యం మూడు నిమిషాల్లో వీడియో రెజ్యూమ్ కంప్లీట్ కావాలి. అంత‌లోపే మీ క్రియోటివిటీ, ప్ర‌తిభ‌, సామ‌ర్థ్యం నిరూపించుకోవాల‌న్న‌మాట‌.

Starting New Job tips: హుషారుగా ప‌ని చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు!

Starting New Job tips ప్ర‌స్తుతం ఉన్న పోటీ ప్ర‌పంచంలో ఉద్యోగ మార్పు స‌ర్వ‌సాధార‌ణ‌మైన‌ది. అది జీతం స‌రిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్ల‌నో, ప‌ని ఒత్తిడి పెర‌గ‌డం వ‌ల్ల‌నో, Read more

five students death in Ap: చంద‌ర్ల‌పాడులో విషాదం – మున్నేరు వాగులో ఐదుగురు విద్యార్థులు గ‌ల్లంతు

five students death in Ap నందిగామ: పండుగ ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న స‌మ‌యంలో కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని నందిగామ నియోజ‌క‌వ‌ర్గం చంద‌ర్ల‌పాడు మండ‌లం Read more

Students Attendance Apps: బ‌డికి రాక‌పోయారో వాలంటీర్ వ‌స్తారు!

Students Attendance Apps: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ స్కూలుకు వెళ్లే విద్యార్థుల ప‌ట్ల ఇక కీల‌క నిర్ణ‌యాలు అమ‌ల్లోకి రానున్నాయి. అందులో భాగంగా..బ‌డికి వెళ్ల‌కుంటే వాలంటీర్ ఇంటికి వ‌స్తాడు.. Read more

Covid Pasitive: చిత్తూరు జిల్లా పాఠ‌శాల‌ల్లో కోవిడ్ క‌ల‌క‌లం ఉపాధ్యాయుల‌కు, విద్యార్థుల‌కు కోవిడ్ పాజిటివ్‌

Covid Pasitive: చిత్తూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాఠ‌శాల‌లు పునః ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 17 మంది ఉపాధ్యాయుల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. వీరితో పాటు 10 Read more

Leave a Comment

Your email address will not be published.