Venus Planet: శుక్ర‌గ్ర‌హంపై నివాసమా? మ‌నం ఎలా ఉంటాం?

Venus Planet: బుధగ్ర‌హం కాక‌పోతే సూర్యుడికి మ‌రి కాస్త దూరంలో ఉన్న శుక్ర‌గ్ర‌హం మాన‌వ నివాస యోగ్య‌త ప‌రిశీలిద్ధాం. సూర్యుడికి ద‌గ్గ‌ర‌గా ఉంది కాబ‌ట్టి కొంచెం పెద్ద గ్ర‌హం కాబ‌ట్టి, సూర్య‌కాంతిని అతిగా ప్ర‌తిబింబించి ఆకాశంలో చ‌క్క‌గా మెరుస్తుంది. సూర్య‌చంద్రుల త‌ర్వాత ఆకాశంలో అత్యంత ప్ర‌కాశ‌వంత‌మైన వ‌స్తువు ఇదే.

Venus Planet: శుక్ర‌గ్ర‌హంపై నివాసమా?

సూర్యోద‌యానికి కొంచెం ముందుగాను, సూర్యాస్త‌మ‌యానికి కొంచెం త‌రువాత‌, దీని ప్ర‌కాశం గ‌రిష్ట స్థాయికి చేరుతుంది. అందుకే దీన్ని ప‌గ‌టి చుక్క అని, వేగు చుక్క అని అంటుం టారు. అంత‌రిక్షంలో మెరిసే అందాల‌రాశి కాబ‌ట్టి ప్రాచీన గ్రీకులు త‌మ సౌంద‌ర్య దేవ‌త అయిన వీన‌స్ పేరు దీనికి పెట్టుకున్నారు.

అయితే సీసాన్ని క‌రిగించ‌గ‌ల మహోగ్ర ఉష్ణోగ్ర‌త‌తో, ఎముక‌లు పిండి చేసే వాయుపీడ‌ నంతో, గంధ‌కికామ్ల వ‌ర్షాల‌తో ఆ లోకం భ‌యంక‌రంగా ఉంటుంద‌ట‌. ప‌రిమాణంలో, అంత‌రంగ నిర్మాణంలో భూమికి, శుక్ర‌గ్ర‌హానికి మ‌ధ్య చాలా పోలిక ఉంది. అందుకే దాన్ని సోద‌రీ గ్ర‌హం అన్నారు. శుక్ర‌గ్ర‌హం సూర్యుడి చుట్టూ ఒక ప్ర‌ద‌క్షిన చెయ్య‌డానికి ప‌ట్టే కాలం 224.7 (భూమి) రోజులు.

శుక్ర గ్ర‌హం

అయితే Venus Planet తో ఒక విచిత్రం ఏమిటంటే దీన్ని ఆత్మ‌భ్ర‌మ‌ణ కాలం చాలా త‌క్కువ‌. శుక్ర‌గ్ర‌హం మీద ఒక రోజు భూమి మీద 243 రోజుల‌తో స‌మానం. అంటే శుక్ర‌గ్ర‌హం మీద ఒక సంవ‌త్స‌రం గ‌డిస్తే అక్క‌డ ఒక్క రోజు కూడా పూర్తి కాద‌న్న‌మాట‌. విడ్డూరంగా ఉంది క‌దూ!. మ‌రో గ్ర‌హానికి మ‌కాం మార్చబోతున్న‌ప్పుడు మ‌నం గ‌మ‌నించాల్సిన మొట్ట మొద‌టి ల‌క్ష‌ణం ఆ గ్ర‌హం మీద గురుత్వం.

భూమి గురుత్వం క‌న్నా గురుత్వం మ‌రీ త‌క్కువ ఉన్న చోట్ల మ‌నిషి కండ‌రాల‌, అస్థ‌కి వ్య‌వ‌స్థ మీద చెడు ప‌రిణామాలు క‌నిపిస్తాయి. కండ‌రాలు ప‌ల‌చ‌బ‌డ‌తాయి. అది జ‌ర‌గ‌ కుండా ఉండేందుకు వ్యోమ‌గాములు అంత‌రిక్ష‌యానంలో ఉన్న‌ప్పుడు నియ‌మ‌బ‌ద్ధంగా వ్యాయామం చేస్తుంటారు.

శుక్ర‌గ్ర‌హంపై భ‌యంక‌ర‌మైన వాతావ‌ర‌ణం

ఇది కాకుండా ఎముక‌ల్లో decalcification (కాల్షియం త‌రిగిపోవ‌డం) అనే ప్ర‌క్రియ వ‌ల్ల ఎముక‌లు కూడా బ‌ల‌హీనం అవుతాయి. కానీ శుక్ర‌గ్ర‌హం మీద ఈ బాద‌ర‌బందీ ఉండ‌దు. ఎందుకంటే శుక్ర‌గ్ర‌హం ఉప‌రి త‌లం మీద గురుత్వం భూమి గురుత్వంలో 0.9 వంతు మాత్ర‌మే. అంటే భూమికి, శుక్ర‌గ్ర‌హానికి మ‌ధ్య ష‌టిల్ స‌ర్వీస్ న‌డిపే శాల్తీల ఎముక‌ల‌కి, కండ‌ల‌కి ప్ర‌మాదం లేద‌న్న‌మాట‌!.

Venus Planet తో ఒక పెద్ద చిక్కు అక్క‌డి భ‌యంక‌ర‌మైన వాతావ‌ర‌ణం. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త స‌గ‌టున 500 డిగ్రీల సెంటిగ్రేడు దాటుతుంది. ఇంత‌క‌న్నా ముఖ్యంగా అక్క‌డి వాతావ‌ర‌ణ పీడ‌నం భూమి మీద విలువ‌కి తొంబై రెట్లు ఉంటుంది. అంటే కిలోమీట‌రు లోతు నీళ్ల‌లో ఎంత పీడ‌నం ఉంటుందో అంత‌న అన్న మాట‌!.

బుధ‌గ్ర‌హం క‌న్నా శుక్ర‌గ్ర‌హం సూర్యుడి నుంచి మ‌రింత దూరంగా ఉంది క‌దా? మ‌రి బుధ‌గ్ర‌హం ఉష్ణోగ్ర‌త క‌న్నా అక్క‌డ ఉష్ణోగ్ర‌త ఎక్కువ ఉందేమిటి? అని సందేహం రావ‌చ్చు. ఒక గ్ర‌హం మీద‌, ఫ‌లానా చోట ఉష్ణోగ్ర‌త అనేది కేవ‌లం సూర్యుడి నుండి గ్ర‌హం దూరం మీద మాత్ర‌మే ఆధార‌ప‌డ‌దు. ఇంకా ఎన్నో కార‌ణాల మీద ఆధార‌ప‌డుతుంది.

గ్ర‌హం మీద వాతావ‌ర‌ణం, ఆ వాతావ‌ర‌ణంలో వాయువుల మిశ్ర‌మం, సూర్యుడి దిక్కుగా గ్ర‌హం వాలు, ఆ గ్ర‌హం మీద ఆ ప్ర‌దేశం ఎత్తు, జ‌లాశ‌యాల సాన్నిహిత్యం ఇలా ఎన్నో ఉంటాయి. శుక్ర‌గ్ర‌హం మీద ద‌ట్ట‌మైన వాతావ‌ర‌ణం ఉండ‌టంత‌, పైగా ఆ వాతావ‌ర‌ణం కార్బ‌న్ డైఆక్సైడ్‌తో నిండ‌టంతో, అక్క‌డ ఉష్ణోగ్ర‌త ప్ర‌త్యేకంగా ఎక్కువ‌గా ఉంటుంది.

గ్ర‌హంపై వాతావ‌ర‌ణం ఇలా!

కార్బ‌న్ డైఆక్సైడ్ హ‌రిత గృహ వాయువు అని, అది సూర్యుడి నుండి వ‌చ్చే వేడిని ప‌ట్టుకుని, వాతావ‌రణాన్ని వేడెక్కిస్తుంద‌ని, అందువ‌ల్లే భూమి మీద ఈ రోజుల్లో అంద‌రూ చెప్పుకుం టున్న ధ‌రాతాప‌నం జ‌రుగుతోంద‌ని మ‌నికి తెలుసు. శుక్ర‌గ్ర‌హం మీద వాతావ‌ర‌ణం ఎంత విప‌రీతంగా ఉంటోంది. తెలియాలంటే ఆ గ్ర‌హాన్ని చుట్ట‌పుచూపుగా చూడ‌బోయిన వ్యోమ‌నౌక‌లికి ఎలాంటి ఆతిథ్యం దొరికిందో చెప్పాలి.

గ్ర‌హం

శుక్ర‌గ్ర‌హం అన్వేష‌ణ మీద వెనెరా 5, 6,7,8 మొద‌లైన ప్రోబ్‌లు బ‌య‌లుదేరాయి. వీటిలో వెనెరా 5,6 లు Venus Planet వాతావ‌ర‌ణంలో 18 కిలోమీట‌ర్ల ఎత్తులోనే అప్ప‌డంలా చితికిపోయాయి. వెనెరా 7,8లు నేల మీద వాలినా, గంట‌లోనే ప‌ని చేయ‌కుండా పోయాయి. అక్క‌డి మ‌బ్బులు నీటిని కాక‌, స‌ల్ప్యూరిక్ ఆమ్ల ధార‌ల‌ని వ‌ర్షిస్తాయి. ఈ ఇబ్బందులు దృష్ట్యా శుక్ర‌గ్ర‌హం మీద కూడా మ‌నిషి డేరాలు వేసే అవ‌కాశం త‌క్కువే అని అర్థ‌మ‌వుతుంది.

Share link

Leave a Comment