Veda Vyasa: చీక‌టిని తొల‌గించే శ‌క్తి గురువు వేద‌వ్యాసుడు Guru Purnima గురించి చెప్పిన నీతి సూత్రం ఇదే!

Veda Vyasa | ఏక‌రాశిగా ఉన్న వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించి వ్యాసుడు Veda Vyasaడిగా పేరొందారు. అష్టాద‌శ పుర‌ణాల‌ను, 18 ఉప పురాణాల‌ను, విజ్ఞాన స‌ర్వ‌స్వ‌మైన మ‌హాభార‌తాన్ని, బ్ర‌హ్మ‌సూత్రాల‌ను, భ‌క్తి, జ్ఞాన మార్గాల‌ను ఉప‌దేశించే భాగ‌వ‌తాన్ని స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డంలోనే మాన‌వ జీవితం vikasam ఉంద‌ని vyasudu బోధించారు. వ్యాసాయ విష్ణు రూపాయ‌..అని పేరొంది. గురుప‌రంప‌రలో ప్ర‌ముఖుడిగా కీర్తి గ‌డించారు. స‌ప్త చిరంజీవుల‌లో ఈయ‌న కూడా ఒక‌రు.

గురుపౌర్ణ‌మి అర్థం ఏమిటి?

వేద వ్యాసుడు జ‌న్మించిన ఆషాఢ శుద్ధ పౌర్ణ‌మినే వ్యాస పౌర్ణ‌మిగా గురు పౌర్ణ‌మిగా జ‌రుపుకోవ‌డం సంప్ర‌దాయంగా వ‌స్తోంది. సక‌ల సంప్ర‌దాయంలో Guru Purnimaగా విశేష ప్రాధాన్యం ఉంది. త‌మి విద్యాబుద్దులు నేర్పిన గురువును దైవంగా భావిస్తూ వ్యాస పౌర్ణ‌మి రోజున వారికి పూజ‌లు నిర్వ‌హించేవారు. Bakti మార్గంలో నేటికీ ఈ విధానం కొన‌సాగుతోంది. ఆధ్యాత్మిక గురువుల‌ను, మంత్రోప‌దేశం గావించిన పెద్ద‌ల‌ను గురుపౌర్ణ‌మి సంద‌ర్భంగా ప్ర‌త్యేకించి సత్క‌రించి గురువుపై త‌మ భ‌క్తి ప్ర‌ప‌త్తిల‌ను చాటుకుంటారు.

గు అంటే చీక‌టి, రు అంటే తొల‌గించువాడ‌ని అర్థం. అంటే గురు శ‌బ్ధానికి అంధ‌కారం తొలగించువాడ‌ని అర్థం ఉంది. ఇందులో సార్థ‌క్యం ఏమిటి? శిష్యుని ఆత్మ‌వ‌స్తువు గురువులో ఉన్న‌దానికి భిన్న‌మైన‌దానది కాదు. కాని శిష్యునిలోని అజ్ఞానం, క‌ర్మ‌ఫ‌లం సంస్కారాల‌తో ఆచ‌రించి ఉండ‌టం వ‌ల్ల అత‌నికి ఆత్మ‌తేజోద‌ర్శ‌నం జ‌ర‌గ‌దు. జ్ఞానోప‌దేశం, సాధ‌న‌, మార్గ‌ద‌ర్శ‌క‌త్వం, అందుకు కావాల్సిన స‌హాయ‌మును అందించేవాడే Guruvu. ఈ క్రియ‌ల్లో స‌మ‌ర్థుడైన గురువు ఆత్మ‌ను ఆవ‌రించిన‌, మ‌నో బుద్దుల‌ను ఆవ‌రించిన అంధ‌కారాన్ని తొల‌గించి గురువు అనే శ‌బ్ధానికి అర్హుడు అవుతున్నాడు. ఇందుకు శిష్యుని స్వ‌యం కృషి, స‌హ‌కారం, నిగ్ర‌హం, ధ‌ర్మం, ప్ర‌వ‌ర్త‌న తోడైతే ఆ గురుశిష్యుల వ‌ల్ల స‌మాజానికి మేలు క‌లుగుతుంది.

ఋషిపీఠం: గురుపౌర్ణ‌మి శుభాకాంక్ష‌లు

వ్యాసం వ‌సిష్ట‌న‌ప్తారం శ‌క్తేః పౌత్ర‌మ‌క‌ల్మ‌షం!
ప‌రాశ‌రాత్మ‌జం వందే శుక‌తాతం త‌పోనిథిమ్‌!
కృష్ణ‌ద్వైపాయంన వ్యాసం స‌ర్వ‌లోక‌హితేర‌తం!
వేదాబ్జ‌భాస్క‌రం వందే శ‌మాది నిల‌యం మునిమ్‌!!
వ‌సిష్ణుని ముని మ‌నుమ‌డూ, శ‌క్తి మ‌హర్షి మ‌న‌మ‌డూ,
ప‌రాశరుని పుత్రుడూ, శుక మ‌హ‌ర్షి తండ్రి అయిన త‌పోనిధి
వ్యాసునికి వంద‌నం. స‌ర్వ‌లోక హితాన్ని కోరేవాడు. వేదాల‌నే
క‌మ‌లాల‌ను విక‌సింప‌జేసిన సూర్యుడూ, అంత‌రింద్రియ బ‌హిరింద్రియాది
శుభ‌గుణాల‌ను నిల‌య‌మైన వాడూ అయిన కృష్ణ‌ద్వైపాయ‌నుడ‌నే వ్యాస‌మునికి వంద‌నం.

గురు పూర్ణ‌మి నాడు ప‌ఠించ‌వ‌ల్సిన శ్లోకం

వ్యాసాయ విష్ణు రూపాయ‌
వ్యాస‌రూపాయ విష్ణ‌వే
న‌మో వైబ్ర‌హ్మ‌నిధ‌యే
వాసిష్టాయ న‌మో న‌మః
లోకానికంత‌టికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబ‌ట్టి Veda Vyasaని జ‌న్మ‌తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమ‌ను గురు పూర్ణ‌మంగా జ‌రుపుకోవ‌డం ఆచార‌మైంది.

భార‌తంలో వ్యాసుని పాత్ర‌

వ్యాసుడు జ‌న్మించిన వెంట‌నే త‌ల్లి అనుమ‌తితో త‌పోవ‌నానికి వెళ‌తాడు. ఆ త‌రువాత స‌త్య‌వ‌తీ శంత‌నుల వివాహం జ‌రిగింది. వివాహ‌కాలంలో దాశ‌రాజ విధించిన ష‌ర‌తుకార‌ణంగా Bhishma ఆమ‌ర‌ణాంతం బ్ర‌హ్మ‌చ‌ర్య వ్ర‌తం అవ‌లంభిస్తాన‌ని భీష‌ణ ప్ర‌తిజ్ఞ చేశాడు. శంత‌నుని మ‌ర‌ణం త‌ర్వాత వారి కుమారులైన చిత్రాంగ‌ధుడు బ‌ల‌గ‌ర్వంతో గంధ‌ర్వుని చేతిలో మ‌ర‌ణం చెందాడు. విచిత్ర వీరుడు సుఖ‌లాల‌స‌తో అకాల మ‌ర‌ణం చెందాడు. భ‌ర‌త‌వంశం వార‌సుల‌ను కోల్పోయిన త‌రుణంలో స‌త్య‌వ‌తీ భ‌ర‌త‌వంశ పున‌రుద్ధ‌ర‌ణ కొర‌కు త‌న పుత్రుడైన వ్యాసుని మ‌న‌న మాత్రంచే త‌న వ‌ద్ద‌కు ర‌ప్పించింది.

భ‌ర‌త‌వంశాన్ని నిలుప‌మ‌ని Veda Vyasaనికి ఆదేశించింది. త‌ల్లి ఆదేశాన్న‌నుస‌రించి వ్యాసుడు అంబిక‌కు దృత‌రాష్ణుని, అంబాలిక‌కు పాండురాజుని మ‌రియు Dashiకు విదురుని ప్ర‌సాదించి తిరిగి త‌పోవ‌నానికి వెళ‌తాడు. ఆ త‌రువాత వ్యాసుడు గాంధారి గ‌ర్భ‌స్రావం స‌మ‌యంలో ప్ర‌వేశించి గాంధాల మృత పిండ నూత‌న ఒక్క నేతికుండ‌ల‌లో పెట్టి వాటిని ప‌రిర‌క్షించే విధానాన్ని చెప్పి తిరిగి త‌న‌దారిన తాను వెళ‌తాడు. ఆ త‌రువాత పెను దుష్ఫ‌రిణామాలు సూచించి వాటిని ఆమె త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌ని త‌పోవ‌నానికి వెళ్లి ప్ర‌శాంత జీవితం గడ‌ప‌మ‌ని సూచించి తిరిగి త‌న దారిన తాను వెళ‌తాడు.

ఆ త‌రువాత ల‌క్క ఇంటి ద‌హ‌నం త‌ర్వాత హిడింబాసురుని మ‌ర‌ణాంత‌రం హిడింభి భ‌విష్య సూచ‌న‌పై శాలిహోత్రుడు నివసించిన ఆశ్ర‌మ‌ప్రాంతంలో పాండ‌వులు నివ‌సించే స‌మ‌యంలో వ్యాసుడు పాండ‌వుల చెంత‌కు వ‌చ్చి ఊర‌ట క‌లిగించాడు. ఆ ఆశ్ర‌మం మ‌హ‌త‌యం చెప్పి అక్క‌డ స‌ర‌స్సులో water త్రాగిన వారికి ఆక‌లి ద‌ప్పులు ఉండ‌వ‌ని, అక్క‌డ వృక్షం కింద నివ‌సించే వారికి శైత్య‌, వాత‌, వ‌ర్ష‌, ఆత‌ప భ‌య‌ములుండ‌వ‌ని స‌ల‌హా అందించాడు. భీముని వివాహ‌మాడ కోరిన హిడింబ‌ను కోడ‌లిగా చేసుకోవ‌డానికి సంశ‌యిస్తున్న kuntideviకి హిడింబ ప‌తివ్ర‌త అని ఆమెను కోడ‌లిగా చేసుకోవ‌డం శుభ‌ప్ర‌ద‌మ‌ని ఆమె సంతానం ద్వారా పాండ‌వుల‌కు స‌హాయ‌మంద‌గ‌ల‌ద‌ని సూచించి త‌న‌దారిన తాను వెళ‌తాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *