Vastu for Almirah: అలమరలు, వార్డు రోబ్‌లు ప్రతి గదిలో ఏర్పరచుకోవడం మన ఇళ్ళల్లో సర్వ సాధారణం తప్పనిసరి. ఎందుకంటే మనం వస్తువులన్నీ ఎక్కువ శాతం వాటిల్లోనే పెడతాం కాబట్టి. ముఖ్యంగా గృహిణులకు ఇవి ఉండాల్సిందే. లేక పోతే సామాన్లు, బట్టలు, పేపర్లు చెప్పులు గదులలో చిందరవందరగా పడి ఇంటి అందానికి తద్వారా ఇంటి ప్రశాంతతకు భంగము కలుగుతుంది. కనుక అలమరలు వార్డు రోబ్‌లు చాలా ముఖ్యం.
Almirah Vastu Position: వాస్తు ప్రకారం అలమర ఏ దిక్కున పెట్టాలి?
అలమరలు,వార్డు రోబ్‌లను సాధారణంగా సాధ్యమైనంత వరకు దక్షిణ పడమర అనగా నైరుతి ఆగ్నేయ స్థానంలో ఏర్పరచిన అధిక బరువు ఆ దిక్కులందు ఉంచనట్టు అవుతుంది. తూర్పు, ఉత్తర దిక్కులందు ఏర్పరచినట్లయితే ఏ విధమైన తప్పులేదు కానీ అలమర క్రింది భాగం క్రింద ప్లోరింగ్‌కు తగలకుండా కనీసం 4 అంగుళములు ఖాళీ వుంచునట్టు ఏర్పరచుకోవాలి. వీలైనంత వరకు వీటిని కూడా సరిసంఖ్యలో నిర్మించుకోవడం మంచిది. అదే విధంగా వార్డు రోబ్‌లను, షెల్ఫులను అటకలు, సబ్జాలు దక్షిణ పశ్చిమ భాగంలో ఏర్పరచుకోవాలి.


Almirah Vastu Position: బీరువాలను, కేష్ లాకర్లను విధిగా నైరుతి మూల దక్షిణ పడమర గోడలకు తగిలేవిధంగా ఏర్పరుచుకోవాలి. కానీ కొందరు ఈశాన్యం దిక్కున ఉంచుతున్నారు. దాని వల్ల వాస్తు దోషములు అనగా మితిమీరిన ధనవ్యయం, అశాంతి ఏర్పడతాయి. ఆ విధంగా చేసినందువల్ల ఈశాన్య మూలయందు ద్వారము ఏర్పరచుకోవడానికి వీలులేక ఈశాన్యం మూత ఏర్పడి వాస్తు దోషములు కలుగును. పటంలో చూపిన వివిధ రకాలైన ఇంటి ప్లానులలో అలమరలు, బీరువాలు, ఫ్రిజల్‌లు, టివి సెట్లు చూపడమైనది. ఎవరైనా ఆ నమూనా ఇల్లు నిర్మించదలచిన వారు ప్లానులో చూపిన విధంగా ఏర్పరచుకొన్న ఆ ఇంటిలో ఏర్పరచుకొన్న ఆ ఇంటిలో ఏ విధమైన వాస్త లోపం ఏర్పడదు.