Vangaveeti Radha

Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జ‌న‌సేన పార్టీలోకి వంగ‌వీటి రాధా!

Share link

Vangaveeti Radha | ఏపీలోని విజ‌య‌వాడ రాజ‌కీయాలు కీల‌క మ‌లుపు తిర‌గ‌బోతున్నాయి. ఒక‌ప్పుడు విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర‌వేసుకుని ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌జ‌ల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిన దివంగ‌త నేత వంగ‌వీటి మోహ‌న్ రంగా అంటే ఇప్ప‌టికీ తెలియ‌ని యువ‌కుడు ఉండ‌డు. అయితే తండ్రి మ‌ర‌ణం అనంత‌రం త‌న కుమారుడు వంగ‌వీటి రాధా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా కూడా తండ్రికి ఉన్న అభిమానులు రాధాను కూడా స‌పోర్టు చేశారు. అయితే వంగ‌వీటి రాధాకు రాజ‌కీయాల్లో అనుకున్న‌త స్థాయి, హోదా రాలేదు. రాజ‌కీయాల్లో స‌రైన స్థానం లేక‌పోవ‌డంతో వంగ‌వీటి రాధా ప‌బ్లిక్‌లో పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం TDP పార్టీలో కొన‌సాగుతున్న రాధా పార్టీ కార్య‌క్ర‌మాల్లో కూడా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

రాధాను క‌లిసిన నాదెండ్ల‌

అయితే తాజాగా Vangaveeti Radhaను జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ ఛైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ భేటీ అయ్యారు. ఆదివారం స్థానిక NBVK భ‌వ‌న్‌లో జ‌న‌సేన జ‌న‌వాణి కార్య‌క్ర‌మం ఉంది. ఈ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించేందుకు అక్క‌డికి వెళ్లిన మ‌నోహ‌ర్ ప‌క్క‌నే ఉన్న వంగ‌వీటి రాధా కార్యాల‌యానికి కూడా వెళ్లారు. నాదెండ్ల‌తో వంగ‌వీటి రాధా ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు చ‌ర్చించిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ భేటీ AP రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ప్ర‌స్తుతం టిడిపిలో ఉన్న Vangaveeti Radha గ‌త కొంత కాలంగా పార్టీ మారుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. జూలై 4వ తేదీన త‌న తండ్రి దివంగ‌త నేత వంగ‌వీటి మోహ‌న రంగా జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న జ‌న‌సేన తీర్థం పుచ్చుకుంటున్నార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే రోజు విజ‌య‌వాడ బంద‌ర్ రోడ్డుల్లోని రంగా విగ్ర‌హానికి JANASENA అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పూల‌మాల‌లు వేసి నివాళ్ల‌ర్పిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అప్పుడే ప‌వ‌న్ స‌మ‌క్షంలో వంగ‌వీటి రాధా జ‌న‌సేన పార్టీ కండువా క‌ప్పుకుంటార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ విష‌యాన్ని మాత్రం అటు Radha అభిమానులు కానీ, జ‌న‌సేన శ్రేణులు కానీ ఖండించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ ఏకంగా వంగ‌వీటి ఇంటికి వెళ్ల‌డం అనుమానాల‌కు తావిస్తోంది. ఇక జూలై 4వ తేదీన విజ‌య‌వాడ‌లో ఏం జ‌ర‌గ‌నుందో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.

vijayawada news: ద‌స‌రాకు విజ‌య‌వాడ‌ను చుట్టేసి రావొచ్చు హెలికాప్ట‌ర్‌లో..

vijayawada news విజ‌య‌వాడ : ద‌స‌రా ఉత్స‌వాల ఏర్పాట్ల‌ను కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ జె. నివాస్‌, విజ‌య‌వాడ సీపీ బ‌త్తిన శ్రీ‌నివాసులు ప‌రిశీలించారు. శ‌నీశ్వ‌ర‌ల‌యం నుండి మ‌హా Read more

NIA: Nursing స్టూడెంట్ను Maoistల్లో చేర్పించారా? మూడేళ్న త‌ర్వాత న్యాయ‌వాది ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

NIA | రాష్ట్ర రాజ‌ధాని హైదారాబాద్‌లో ప‌లువురు లాయ‌ర్లు, సామాజిక కార్య‌క‌ర్త‌ల ఇళ్ల‌ల్లో ఎన్ఐఏ గురువారం సోదాలు చేసింది. గ‌తంలో క‌నిపించ‌కుండా పోయిన న‌ర్సింగ్ విద్యార్థిని రాధ Read more

Today Business News: ఇక ఛార్జీలు వ‌సూలు చేసే ప‌నిలో ప‌డ్డ ఎల‌న్ మ‌స్క్ | బిజినెస్ న్యూస్‌

Today Business News : ఈ రోజు ఇండియాలో బిజినెస్ న్యూస్ ఇలా ఉన్నాయి. Today Business Newsలో భాగంగా ఎల‌న్ మ‌స్క్ ట్విట్ట‌ర్ ద్వారా ఛార్జీలు Read more

News today AP: తెలుగు రాష్ట్రాల్లో బ్లేడ్ ఘ‌ట‌న | రోడ్డు ప్ర‌మాదంలో 4 మృతి | మ‌రిన్ని తెలుగు వార్త‌ల కోసం చూడండి!

News today AP | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని సోమ‌వారం వార్త‌లు కింద ఇవ్వ‌డం జ‌రిగింది. ఇందులో భాగంగా అమ‌లాపురంకు మ‌రో పేరు పెట్టాల‌ని ముద్ర‌గ‌డ లేఖ‌, బ్లేడ్‌తో య‌వకుడి Read more

Leave a Comment

Your email address will not be published.