Vande Bharat Express: ప్రపంచంలో అత్యంత ఖరీదైన Bullet train కు కూడా ఇంత ప్రచారం జరగలేదేమో అనిపిస్తుంది మన దేశంలో నడిచే వందేభారత్ ట్రైన్ ను చూస్తుంటే. వందే భారత్ ట్రైన్ ను ఎప్పుడైతే మోడీ ప్రారంభించాడో అప్పటి నుండి దేశవ్యాప్తంగా ఈ రైలు గురించే చర్చించుకోవడం ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్- విశాఖపట్నం మధ్య నడుస్తున్న ఈ ట్రైన్ గురించి సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్ -విశాఖపట్నం మధ్య నడిచే Vande Bharat Express రైలు ప్రయాణం సమయం 8 గంటల 30 నిమిషాలు అంట. టికెట్ ధర Ticket price, చైర్ కార్కు రూ.1720 ఉండగా, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు రూ.3170 ధర ఉంది. కేంద్ర ప్రభుత్వం దీనిని సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ సామాన్య ప్రజలు మాత్రం దీన్ని ఎక్కే ఆలోచనలో లేరని తెలుస్తోంది. కారణం టికెట్ ధరలు భారంగా ఉండటమేనని అంటున్నారు సగటు భారతీయుడు.
Vande Bharat Express: టికెట్ ధరలు చూస్తే
సామాన్యుల కోసం వందేభారత్ రైలు అని చెప్పి టికెట్ ధరలేమో సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేశారని అంటున్నారు. ఒక రెండు మూడు గంటలు ఆలస్యం అయినా పర్లేదు రెగ్యులర్ రైలుకి రూ.400 ఖర్చు పెట్టి స్లీపర్ బుక్ Sleeper Book, చేసుకొని వెళ్తామని కామెంట్లు చేస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకు భారత ప్రభుత్వం (కాంగ్రెస్ మరియు కాంగ్రేసేతర) ప్రవేశ పెట్టిన ఇన్ని 100 రైళ్లకు ఇంత ప్రచారం ఎప్పుడూ జరగలేదనేది అక్షర సత్యం. కానీ వందేభారత్ ట్రైన్ వచ్చిన తర్వాత అసలు దేశంలో రైలునే ఇంత వరకూ చూడలేదనే విధంగా ప్రచార ఆర్భాటం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
వాస్తవానికి ఇప్పుడు దేశంలో నడిచే రైలులో ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలే ప్రయాణం చేస్తున్నారు. వారు ప్రయాణించేటప్పుడు కిక్కిరిసి తొక్కుకుంటూ రైలులో ప్రయాణం చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం పేద ప్రజలకు ఖరీదైన రైళ్లు అవసరం లేదని, ఉన్న రైళ్లకు జనరల్ బోగీలు పెంచితే చాలని చెబుతున్నారు. అదే పేదలకు మేలు చేసినట్టు అవుతుందని భావిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వందే భారత్ ట్రైన్ పట్టాలపైకి ఎక్కిన తర్వాత సాధారణ రైళ్లు ఆలస్యంగా ప్రయాణం చేస్తున్నాయట. కారణం వందే భారత్ రైలు వచ్చే పట్టాలపై మిగిలిన రైళ్లను స్టేషన్లలో గంటల కొద్దీ ఆపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Vande Bharat Express ని 18 నెలల్లో తయారు చేశారంట. భారత్‌లో ఇప్పుడు 8వ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడుస్తుంది. 699 కి.మీ దూరం కేవలం 8.5 గంటల్లో చేరుకుంటుందని చెప్పారు. ఈ మకర సంక్రాంతి రోజున తెలుగు రాష్ట్రాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన మరపురాని బహుమతి అని బిజేపీ అభిమానులు అంటున్నారు. ఈ ట్రైన్ గంటలకు 180 కి.మీ వేగంతో పోతునప్పటికీ అంత వేగంలోనూ మంచినీళ్ల గ్లాసు కూడా తొనగలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇక వందేభారత్ ట్రైన్ తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతుండగా దానిని చూడటానికి అది ఆగే స్టేషన్లలో ప్రజలు తండోపతండాలుగా చేరుకుంటున్నారు. ఆ ట్రైన్‌ను చూసి సెల్ఫీలు దిగుతున్నారు. రెండు రోజుల కిందట ఒక వ్యక్తి ట్రైన్‌లోకి ఎక్కి సెల్ఫీలు తీస్తుండగా ట్రైన్ ముందుకు కదిలింది. ఇక దిగడానికి వీలు పడలేదు. ఇంతలో అధికారులు (Tc) వచ్చి ప్రశ్నించగా ఆ వ్యక్తి సెల్ఫీ కోసం ట్రైన్ ఎక్కానని చెప్పి బిక్కమొఖం వేశాడు. ఈ ట్రైన్లో తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు ప్రయాణం చేసి అనుభూతి పొందారు.
TV ఛానెళ్లు వందేభారత్ ట్రైన్‌పై కథలు కథలుగా స్టోరీలు ఇస్తున్నాయి. అందులో ప్రయాణం చేసిన అనుభవాలను తెలుసుకుంటున్నాయి. Vande Bharat ట్రైన్లో ఇతర ట్రైన్లకు ఉండే సౌకర్యాలు కంటే ఎక్కువగా మెరుగ్గా ఉండటంతో ఆ ట్రైన్లో ప్రయాణం చేయాలని ప్రతి ప్రయాణికుడు ఆశ పడుతున్నాడు. భారత టెక్నాలజీతో పట్టాలపై వాయువేగంతో దూసుకుపోతున్న ఈ వందేభారత్ ట్రైన్ ఎక్కాలంటే ధనవంతులకు సాధ్యం తప్ప, సామాన్య మానవుడికి కష్టమేనని అంటున్నారు కొందరు.