Vakeel Saab Pre Release Event | వకీల్ సాబ్ వచ్చేస్తున్నాడు!
Vakeel Saab Pre Release Event : పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్(Vakeel Saab) ప్రీ రిలీజ్ ఇవెంట్ అభిమానులు సమక్షంలో పెద్ద ఎత్తున జరిగింది.ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు, నటీనటులు మాట్లాడారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్(Vakeel Saab) చిత్రంలో పవన్ కళ్యాన్ , శ్రుతిహాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. కీలక పాత్రల్లో నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్ నటించారు.

వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ తీయబోయే వీరమల్లు డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ..ఫ్యాన్స్‌లందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరాయా..! అంటూ మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్‌ను తీసిన వకీల్ సాబ్ సూపర్ హిట్ కాబోతుందన్నారు. ఏ ఏం రత్నం గారు మాట్లాడుతూ.కోవిడ్ చాలా అధికంగా ఉందని, జాగ్రత్తగా మాస్కులు వేసుకొని వకీల్ సాబ్ సినిమా చూడాలని కోరారు. పవన్ కళ్యాణ్‌తో మూడో సినిమా తీస్తున్నానన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఇది మొదటి సినిమా విడుదల కాబోతుందన్నారు. పవన్ కళ్యణ్ రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ సమయం కేటాయించడం అద్భుతమన్నారు. ఒక స్త్రీ జరిగిన అవమానంపై పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్లా పరిష్కరించడానికి వస్తున్నారన్నారు.

సామాజిక నాయకురాలు పద్మావతి గురించి ఒక వీడియో చూపించారు. ఆమె ఎలా జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఎంత మంది పేద విద్యార్థులను చదవించారనే, అనేక విజయాలపై ఆమెపై వీడియో ప్రదర్శించారు. అనంతరం పద్మావతిని ఈ వేడుకలో సన్మానించారు. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరి శంకర్ మట్లాడుతూ..ఇది చాలా రోజుల తర్వాత వచ్చిన పండుగ అని తెలిపారు. పవన్ కళ్యాణ్ సినిమాలు మళ్లీ వస్తునందకు ధన్యవాదాలు అన్నారు. ఇప్పటికే కరోనా వల్ల చిత్ర పరిశ్రమ కుదేలైందని పవన్ కళ్యాణ్ సినిమాలతో మళ్లీ ఊపందుకుంటుందన్నారు. పవన్ కళ్యాణ్‌ను సినిమా ఎప్పటికీ వదలదని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుభవాలను తెలియజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీరాం వేణుకు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ..మగువ సాంగ్ ను తన తల్లికి డెడికేట్ చేస్తున్నామన్నారు. ఈ సినిమా వల్ల తనకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. సినిమా ను తన తల్లితో తప్పకుండా చూస్తానని తెలిపారు. దిల్ రాజు తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. రామజోగయ్య శాస్త్రీ మగువ పాటకు ప్రాణం పోశారన్నారు. బండ్ల గణేష్ ఇక మాములాగా మాట్లాడలేదు ఈ వేడుకలో. పవన్ కళ్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని ఎంతో మంది చరిత్ర కారులు, విప్లవ కారులతో పోల్చుతూ పొగడారు. బండ్ల గణేష్ మాటలకు ఈవెంట్ కరత్వాల ధ్వనులతో దద్దరిలిపోయింది.

ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వకీల్ సాబ్ ఫంక్షన్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ, అభిమానులకు, ఆడపడుచులకు, పెద్దలకు ప్రతి ఒక్కరికీ పేరుపేరున హృదయపూర్వక నమస్కారాలు చెప్పారు. ఈవెంట్లో మాట్లాడటం చాలా లేట్ అయ్యిందన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో మాట్లాడినంత ఇక్కడ మాట్లాడలేనని తెలిపారు. తన 25 సంవత్సరాల సినిమా జీవిత చరిత్రలో దిల్‌రాజ్ లాంటి వారితో సినిమా తీయడం సంతోషకరమన్నారు. వకీల్ సాబ్ సినిమా మంచి విజయం సాధించనుందన్నారు. తాను చిన్న స్థాయి నుంచి వచ్చే వ్యక్తులను ప్రోత్సహిస్తానన్నారు. దర్శకుడు శ్రీరాం వేణు అదే విధంగా మధ్యతరగతి స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారన్నారు. చక్కటి దర్శకుడు వద్ద నాకు నటించడం రావడం నా అదృష్టమన్నారు. తాను నటుడు అవ్వాలని కోరుకోలేదని తెలిపారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్‌ను అభిమానులు సిఎం, సిఎం అంటూ నినాదాలు చేశారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!