vaccine drive

vaccine drive:త్వ‌ర‌గా పూర్తి చేయండి వ్యాక్సినేష‌న్: మంత్రి హ‌రీష్ రావు

Spread the love

vaccine driveహైద‌రాబాద్: రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రికీ రెండు డోసులు వ్యాక్సిన్ త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు అన్ని జిల్లాల వైద్యాధికారుల‌ను ఆదేశించారు. ఒక్క మ‌నిషి కూడా మిగుల కుండా ప్ర‌తి ఒక్కిరిక‌కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాల‌ని సూచించారు. బుధ‌వారం బీఆర్కే భ‌వ‌న్‌లో అన్ని జిల్లాల(vaccine drive) వైద్యాధికారుల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

రాష్ట్రంలో ప్ర‌తి గ్రామం ఏదీ వ‌ద‌ల‌కుండా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా చేప‌ట్టాల‌న్నారు. వంద‌కు వంద‌శాతం మొద‌టి డోస్‌, రెండో డోస్ పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ప‌ట్ట‌ణాల్లో జ‌నాభా ఎక్కువ ఉండే రూర‌ల్‌లో ప‌నిచేస్తున్న వైద్య సిబ్బందిని పెట్టుకుని వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాల‌న్నారు. ఏ జిల్లా కూడా వ్యాక్సినేష‌న్‌లో వెనుక ప‌డ‌కూడ‌ద‌న్నారు. వికారాబాద్ జిల్లాల్లో వ్యాక్సిన్ ప్ర‌క్రియ వేగంగా సాగుతోంద‌ని, ఇదే తీరులో అన్ని జిల్లాలు ముందుకు సాగాల‌న్నారు. ప్ర‌తి డీఎం అండ్ హెచ్ఓ ఫీల్డ్‌లో ఉండి వ్యాక్సినేష‌న్ డ్రైవ్ నిర్వ‌హించాల‌న్నారు. జిల్లా క‌లెక్ట‌ర్‌తో పాటు అన్ని శాఖ‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం చేయాల‌ని సూచించారు.

వారంత త‌ర్వాత క‌లెక్ట‌ర్ల‌తో ఈ విష‌యంలో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హిస్తామ‌న్నారు. ఇప్ప‌టికే అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నెంబ‌ర్ వ‌న్‌గా ఉండేలా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దార‌ని, అదే స్ఫూర్తితో వ్యాక్సినేష‌న్‌లో రాష్ట్రం దేశానికి ఆద‌ర్శంగా ఉండేలా ప‌నిచేయాల‌న్నారు. టీమ్ వర్క్‌తో ఇది సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. ఈ టెలీకాన్ఫ‌రెన్స్‌లో ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రిజ్వీ పాల్గొన్నారు.

vaccination: క‌రోనా వైర‌స్ పోరులో మ‌రో మైలు రాయిని అధిగ‌మించిన భార‌త్

vaccination న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిపై జ‌రుగుతున్న పోరులో భార‌త్ మ‌రో మైలు రాయిని అధిగ‌మిం చింది. క‌రోనా వైర‌స్‌ను నివారించే టీకాల పంపిణీలో అత్యంత వేగంగా Read more

Health news today: మ‌ళ్లీ క‌ఠిన ఆంక్ష‌లు సైరెన్ మోగిస్తున్న క‌రోనా..రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేసిన కేంద్రం!

Health news today: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విజృంభించ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ ఆయా Read more

Vaccination : తెలంగాణ‌లో ఇంటి వ‌ద్ద‌కే వ్యాక్సినేష‌న్ | Pulse Polio మాదిరిగా CM Kcr ఆలోచ‌న‌!

Vaccination : తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంపై సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. దేశంలోనే ఆద‌ర్శ‌వంతంగా ఈ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌నే ఆలోచ‌న‌తో Read more

TRS Plenary Meeting: ప‌ద‌వులు రాగానే గంజిలో ఈగ‌ల్లాగా ఎగిరిప‌డుతున్నారు

TRS Plenary Meeting: హైద‌రాబాద్ : 'ఇవాళ కొంత మంది ఎగిరెగిరి ప‌డుతున‌నారు.. టి- కాంగ్రెస్‌, టి- బిజెపి..కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? మీకు ప‌ద‌వులు వ‌చ్చాయంటే Read more

Leave a Comment

Your email address will not be published.