vaccination for 15-18 age group: పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ ప్ర‌క్రియ ఎలా అంటే?

vaccination for 15-18 age group దేశంలో 15 నుంచి 18 సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌ల‌కు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే కార్య‌క్ర‌మం సోమ‌వారం (03.01.2022) ప్రారంభ‌మయ్యింది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేసింది. కోవిన్ యాప్‌, వెబ్‌సైట్ల‌లో పిల్ల‌ల టీకా కోసం రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం కోవాగ్జిన్‌కు మాత్ర‌మే పిల్ల‌ల‌కు ఇచ్చేందుకు అనుమతి ఉంది.

అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లోనూ 15 నుంచి 18 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌స్సు గ‌ల విద్యార్థిని, విద్యార్థుల‌కు కోవిడ్ వ్యాక్సిన్ (vaccination for 15-18 age group)అందించేందుకు ప్ర‌భుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఆయా జిల్లాల్లోని అంద‌రూ మండ‌ల విద్యాశాఖా అధికారులు, అన్ని ఉన్న‌త పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయులు వారి ప‌రిధిలో గ‌ల 15 సంవ‌త్స‌రాల విద్యార్థుల‌కు అంద‌రికి కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు ఆయా పాఠ‌శాల‌లో త‌గు ఏర్పాట్లు చేస్తున్నారు.

రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ (vaccination)ఇలా!

-పెద్ద‌ల వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ చేసిన‌ట్టుగానే పిల్ల‌ల‌కు రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ కూడా ఉంటుంది.

-ఆరోగ్య సేతు లేదా కోవిడ్‌ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

-త‌రువాత మొబైల్ నెంబ‌ర్‌తో లాగిన్ అవ్వాలి.

-ఒటిపి కోసం ఆప్ష‌న్ ఎంచుకోవాలి.

-మీ మొబైల్‌కు వ‌చ్చిన ఓటిపిని ఎంట‌ర్ చేసి వెరిఫై బ‌ట‌న్ ప్రెస్ చేయాలి.

-రిజిస్ట్రేష‌న్ పేజీలో టీకా తీసుకునే వారి పేరు, పుట్టిన తేది, జెండ‌ర్ వంటి వివ‌రాలు న‌మోదు చేయాలి.

-టీకా ఎప్పుడు తీసుకోవ‌ల‌నుకుంటున్నారో ఆ తేదీని ఎంచుకోవ్సాలి ఉంటుంది.

-రిజిస్ట్రేష‌న్ పూర్తి అయ్యాక మీ మొబైల్ నెంబ‌ర్‌కు క‌న్ఫ‌ర్మ్ మెసేజ్ వ‌స్తుంది.

-ద‌గ్గ‌ర‌లో ఉన్న వ్యాక్సినేష‌న్ సెంట‌ర్‌కు వెళ్లి కూడా రిజిస్ట్రేష‌న్ చేసుకునే వీలుంది.

Share link

Leave a Comment