Uttarakhand Train Run in reverse: Uttarakhand : సాధారణంగా ట్రైన్ ముందుకే వెళుతుంది కదా!. ఒక వేళ బోగిని మార్చుకోవాలన్నా, వచ్చిన దారినే మళ్లీ తిరిగి వెళ్లాలన్నా ముందున్న రైలు ఇంజిన్‌ను వేరు చేసి మరో పట్టాల ద్వారా బోగీలను తగిలించుకుని వెళుతుంది తప్ప ఎప్పుడూ వాహనాల్లాగా వెనక్కి వెళ్లిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు మాత్రం అది నిజం చేసింది ఓ ట్రైన్. అదెక్కడనుకున్నారు మన భారతదేశంలోనే అట. ఉన్నప్పాటున వెనక్కి వెళ్లిపోతున్న ట్రైన్‌ను పరిశీలించిన ప్రయాణికులు గుండెలు అరచేతిలో పెట్టుకున్నారట.
ఉత్తరఖాండ్ రాష్ట్రంలో ఓ ట్రైన్ వెళుతుండగా పట్టాలపైకి గేదెలు వచ్చాయట. వాటిని దూరంగా చూసిన ట్రైన్ డ్రైవర్ పాపం వాటిని ఎందుకు ఢీకొట్టాలిలే అని చిన్నగా బ్రేక్ వేశాడట. అయితే ఉన్నట్టుండి బ్రేక్ వేసిన తర్వాత ట్రైన్ ముందుకు వెళ్లకుండా డైరెక్టుగా రివర్స్‌లో వెనక్కి వెళుతుందట. ట్రైన్ డ్రైవర్ ఎంత ప్రయత్నించినా అసలు ట్రైన్ ఆగకుండా ఆమాంతం దాదాపు 35 కిలోమీటర్ల పొడవు రివర్స్‌లోనే వెనక్కి ప్రయాణించిందట. దీనికి కారణం ఇంజిన్‌లో ఏదో సాంకేతిక లోపం అంట. 35 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత మెళ్లగా ట్రైన్ నిలిచిపోవడంతో అందులో ప్రయాణం చేస్తున్న ఫ్యాసింజర్లు, డ్రైవర్, తదితర సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారట. అంత వేగంగా వెనక్కి వెళుతున్న ట్రైన్లో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారట.

Uttarakhand Train Run in reverse : ట్రైన్ 35 కిలోమీటర్ల వరకు వెనక్కి వెళ్లిన తర్వాత ప్రయాణికులను మెల్లగా దింపి బస్సుల ద్వారా వారిని తరలించారట. ఈ విషయంపై ఉన్నతాధికారులు సీరియస్సై పాపం ఆ ట్రైన్ డ్రైవర్‌ను తీసివేశారట. గేదెలను కాపాడదామనుకున్న ఆ ట్రైన్ డ్రైవర్‌కు ఆ జన్ శతాబ్ధి ట్రైన్ చుక్కలు చూపించడంతో పాటు అధికారులతో మొట్టికాయలు వేపించింది. ఇంకా నయం .. ట్రైన్ రివర్స్‌లో వెళుతున్న సమయంలో అటుగా ఏ ట్రైనూ ఎదురుగా రాకపోవడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. లేకుంటేనా ఎంత ఘోరం జరిగేదో. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతుందట.
వీడియో చూడాలంటే లింక్ క్లిక్ చేయండి : Uttarakhand Train Run in reverse
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!