uses of cloveలవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్థం పంటి నొప్పి(teeth pain)ని తగ్గిస్తుంది. అంతేకాకుండా పంటి నొప్పితో పాటు నోటి దుర్వాసనను కూడా నివాసరిస్తోంది. దగ్గు(cough)కు సహజమైన మందు లవంగం అని చెప్పవచ్చు. దగ్గుకు, శ్వాస సంబంధింత సమస్యలకు కూడా లవంగం చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. మనం తినే ఆహారంలో రోజూ లవంగం (uses of clove)ఒకటి తీసుకుంటే మంచిది. వాంతులు, కడుపులో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనెను తీసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది. తేనె, కొన్ని లవంగాల నూనె (clove oil)ను గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు తాగితే జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు.

ఏ వంటకంలోనైనా ఈ లవంగాల్ని వేసుకోవచ్చు. వంటకాలకు మంచి సువాసన రుచినీ కూడా ఇస్తుంది. వాతావరణం మార్పు వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మందులా పనిచేస్తుంది. తులసీ, పుదీనా, లవంగాలు, యాలకుల మిశ్రమం టీలా చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది. లవంగాలను పొడి చేసి నీళ్ళలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్ తగ్గి ఉపశమనం కలుగుతుంది. మనం ప్రతి రోజూ తాగేటీలో లవంగం వేసుకొని తాగితే కడపుబ్బరం తగ్గుతుంది. 10 లేక 12 లవంగాలను తీసుకొని వాటికి పసుపు, చక్కర కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తాగితే శరీరానికి మంచిది. క్రమం తప్పకుండా ఆహారంలో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆయాసం నుండి ఉపశమనం లభిస్తుంది.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి