Us president Kamala Harris ప్రపంచం: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అధికార బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు బదలాయించారు. ఈ నిర్ణయం తాత్కాలికమే నని అధికార వర్గాలు వెల్లడించాయి. అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రతిఏటా పెద్ద పేగుకు సంబంధించి కొలనోస్కోపి పరీక్షను నిర్వహిస్తారు.ఈ సమయంలో మత్తు మందు ఇస్తారు. ఆయనకు పరీక్షలు పూర్తయ్యి కోలుకునేంత వరకు కమలా హరిస్ అధ్యక్షురాలిగా (Us president Kamala Harris )కొనసాగుతారు.
కమలా హారిస్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్టు వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. దీంతో అమెరికా హారిస్ పదవిని చేపటి్టన తొలి మహిళగా కమలా హారిస్ రికార్డు సాధించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి మత్తు మందుతో పరీక్షలు చేసిన సమయంలో బాధ్యతలను తాత్కాలికంగా ఉపాధ్యక్షులకు బదిలీ చేస్తారు. గతంలో బుష్‌కు కొలనోస్కోపి పరీక్షలు చేసిన సమయంలో 2002,2007లో బాధ్యతలను ఉపాధ్యక్షుడికి బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!