Uppena Pre Release Event : మెగస్టార్ చిరంజీవి ముద్దుల మేనల్లుడు పంజా వైష్టవ్ తేజ్ హీరోగా తీసిన తొలి తెలుగు చిత్రం ఉప్పెన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్(Uppena Pre Release Event )శనివారం గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగస్టార్ చిరంజీవి హాజరయ్యారు. బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రీ మూవీస్ బ్యానర్‌పై వస్తున్న ఉప్పెన(Uppena Movie) మూవీకి పాటలు ద్వారా ప్రజల నుంచి మెగా అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. నీ కల్లు నీలి సముద్రం అనే పాట గతేడాది ఆడియో విడుదల చేయగా ఆ పాట యావత్తు సినిమా అభిమానులను సైతం మత్రముగ్దులను చేసింది.
నా మెగా మేనమామలకు రుణపడి ఉంటాను!
సీనియర్ దర్శకుడు సుకుమార్ శిష్యుడిగా పిలువబడే బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా కుటుంబం నుంచి వైష్ణవ్ తేజ్‌ను హీరోను తెలుగు సినీ పరిశ్రమకు చేసిన మొట్టమొదటి చిత్రం ఇది. ఈ సందర్భంగా హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. తన తొలి చిత్రం ఉప్పెన(Uppena Movie) అని, తన జీవితంలో మరిచిపోలేని సమయం ఇది అని పేర్కొన్నారు. తొలుత తన మేనమామలు మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. మెగా కుటంబంలో తాను పుట్టడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని ఉద్వేగంతో తెలియజేశారు. తనకు నటన నేర్పింది, తనను ప్రజలకు చూపించిన ఉప్పెన సినిమా పాటలను ప్రతిఒక్కరూ ఆదరించారని, అలాగే దర్శకుడు బుచ్చిబాబుకు ప్రత్యేకంగా రుణపడి ఉంటానని తెలిపారు. సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని, తనకు తొలి సినిమా షూటింగ్లో అన్ని నేర్చుకునేందుకు సహకరించిన ఉప్పెన చిత్రం యూనిట్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాన్నారు.
ఉప్పెన సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన తమిళ అగ్ర హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ..తనకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన బుచ్చిబాబుకు ధ్యాక్స్ అని సినిమా చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరూ థియోటర్లలో చూడాలని తెలిపారు. తనను ఆదరిస్తున్న తెలుగు, తమిళ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
ఉప్పెన ఒక ఏమోషనల్ స్టోరీ!
మెగస్టార్ చిరంజీవి మాట్లాడూతూ.. కరోనా కష్ట కాలం ముగిసిన తర్వాత ఈ ఉప్పెన వేడుకును చూస్తుంటే కొత్త వెలుగులోకి వచ్చినట్టు ఉందని తెలిపారు. కరోనా కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. అసలు మళ్లీ సినిమాలు తీస్తామో, లేదో అనే ఆందోళన పడిన పరిస్థితులు ఉన్నాయన్నారు. థియోటర్లలో ఎప్పుడెప్పుడు సినిమాను చూడాలా? అని ప్రేక్షకలు ఎదురు చూడటం, మళ్లీ సినీ పరిశ్రమలో పనులు ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. తన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తీస్తున్న మొదటి చిత్రం ఉప్పెన అని అన్నారు. ఈ సినిమాను నిజంగా దర్శకుడు బుచ్చిబాబు అద్భుతంగా తీశారని పేర్కొన్నారు. తన కుటుంబంలో నుంచి ఇంత మంచి సినిమాకు హీరోగా పరిచయం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే ప్రేక్షక దేవుళ్లు తమని ఆదరిస్తున్నారని, మీ చల్లని దీవెనలతోనే మేము ఇక్కడ నిలబడ్డామని, కాబట్టి ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తానని అన్నారు.
శంకర్‌దాదా సినిమాలో చూసినప్పుడే హీరో అవుతాడనుకున్నా!
తన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తాను తీసిన శంకర్‌దాదా సినిమాలో వీల్ చైర్లో మతిస్థిమితం లేని కుర్రాడు పాత్రలో నటించాడని, అప్పుడే అతనికి మంచి భవిష్యత్ ఉందని గ్రహించానని అన్నారు. తన కళ్లల్లో ఏదో తెలియని ఆకట్టుకునే ప్రేమ ఉందని, మా కుటుంబానికి వైష్ణవ్ తేజ్ చాలా ప్రత్యేకమని అన్నారు. ఈ సినిమా తీసిన మైత్రీ మూవీస్ బ్యానర్‌కు, బుచ్చిబాబుకు, విజయ్‌సేతుపతికి, హీరోయిన్ కృతి సెట్టీకి, చిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఫిబ్రవరి 12న విడుదలవుతున్న ఈ ఉప్పెన సినిమా(Uppena Movie) ఒక ఏమోషన్ హృదయానికి తాకుతుందని అన్నారు. సంగీతం అందించిన దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మొదటి హీరోనని, తన సంగీతంతో ఈ సినిమా స్థాయిని పెంచేశారని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ థియోటర్లలో ఉప్పెన సినిమా(Uppena Movie)ను ఫిబ్రవరి 12వ తేదీన చూడాలని కోరారు.
[envira-gallery id=”2107″]
Movie: Uppena
cast: Panja Vaishnav Tej, Vijay Sethupathi, Kruthi Shetti
written & directed by Buchhi babu Sana
Music director: Devi Sri prasad
Editor: Naveen Nooli
Art Director: Mounika Ramakrishna
Fights: Venkat
Choreography: Brinda, Prem Rakshit
VFX Supervisor: Yugandhar
Executive Producer: Anil Y, Ashok B
CEO: Cherry
Presented by: Sukumar
Producers: Naveen Yerneni, Y Ravi Shankar
Banners: Mythri Movie Makers, Sukumar Writings
Audio: Aditya Music
Uppena Release date: February 12th
ఇది చదవండి:బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన మాజీ విలేఖరి అరెస్టు
ఇది చదవండి:కార్పొరేట్ సంస్థల సేవకుడు మోడీ!
ఇది చదవండి:ఇంక్యూబేషన్ సెంటర్లతో ఉద్యోగావకాశాలు: గవర్నర్
ఇది చదవండి:నిగ్గదీసి అడగటానికి నీకెందుకు భయం?
ఇది చదవండి:10న నల్గొండకు సీఎం కేసీఆర్
ఇది చదవండి: సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించిన ఎస్పీ రవీంద్రబాబు