upma recipe | ఉప్మా తక్కువ సమయంలో చేసుకోదగిన రుచికరమైన అల్పాహారము. ఈ ఉప్మాను బియ్యం రవ్వతో, అటుకులతో, సేమ్యాలతో, గోధుమ నూకతో చేసుకోవచ్చు. ఉప్పు మరియు మావు(రవ్వ) అను రెండు తమిళ పదాల నుంచి దీని పేరు ఉప్మావు అని వచ్చింది. దీనిని తెలుగులో ఉప్మా అని ఉప్పిడి అని కూడా పిలుస్తారు. మన ఇంట్లో ఉప్మా తయారు చేయడం సాధారణంగా గృహిణులకు అందరికీ వచ్చిందే. కానీ కొంత మందికి మాత్రం కాస్త ఇబ్బందే. అలాంటి వారు upma recipe ఇంట్లో చేయడానికి ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలియజేస్తున్నాము.
కావాల్సిన పదార్థాలు
గోధుమానుక – కప్పు
నీరు – రెండు కప్పులు
ఉప్పు – తగినంత
పచ్చి మిరపకాయలు – తగినన్ని
అల్లం , కరివేపాకు, పోపు సామాన్లు
తయారు చేయు విధానం
బూరెలు మూకుడు పొయ్యి మీద పెట్టి, నెయ్యివేసి, జీడి పప్పు దోరగా వేయించి తీసుకోవాలి. ఆ నెయ్యిలోనే గోధము నూక ఒక కప్పు వేసి వేయించిన తర్వాత దానిని వేరు పళ్లెంలోకి తీసుకోవాలి. బూరెల మూకుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టి, పోపుకి తగిన నెయ్యి వేసి మరిగాక, ఆవాలు, మినపప్పు వేసి, ఆవాలు చిటపటలాడక జీలకర్రవేసి ఆపైన తరిగి ఉంచుకున్న అల్లం పచ్చి మిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి పోపు కమ్మని వాసన వచ్చిన తర్వాత రెండు కప్పుల నీరు పోసి తగినంత Salt వేయాలి.
నీరు మరిగిన తర్వాత వేయించిన గోధుమ నూక వేసి కలియబెట్టాలి. మూతపెట్టి 5 నిమిషాలు ఉంచాలి. రవ్వ మెత్తబడిన తర్వాత కిందకు దించి, వేయించిన జీడిపప్పు ఒక చెక్క నిమ్మకాయ రసం పిండి బాగా కలియబెట్టి వేరే పళ్లెంలోకి దిమ్మరించుకోవాలి.
Upmaలో రకాలు
టొమాటో ఉప్మా, సేమ్యా ఉప్మా, అటుకుల ఉప్మా, మజ్జిక ఉప్మా, బొరుగుల ఉప్మా, సగ్గుబియ్యము ఉప్మా, పులుసు ఉప్మా, పెసరపప్పు ఉప్మా.
Tips
ఉప్మాలో నెయ్యి ఎక్కువ వేయకపోతే ముద్దలాగా అంటుకుంటుంది. ఉప్మా వుండలు ఉండలుగా తయారు కాకుండా నూకును నీటిలో వేసే ముందు వేపుకోవాలి. ఉప్మాలో ఎవరికి ఇష్టమైన మసాలా దినుసులు వేసుకొని ఉడుకుతున్న నీటిలో వేసుకోవచ్చును.
upma recipe: బియ్యపు రవ్వ ఉప్మా తయారీ!


కావాల్సిన పదార్థాలు
బియ్యపు రవ్వ – ఒక కప్పు
పచ్చి మిరపకాయలు – మూడు
పల్లీలు – రెండు చెంచాలు
శనగపప్పు – రెండు చెంచాలు
ఆవాలు, జీలకర్ర – చెంచాడు
ఎండు మిర్చి – మూడు
కల్యమాకు – ఒక రెక్క
నూనె – సరిపడా
ఉప్పు – రుచికి తగినంత
తయారు చేసే పద్దతి
మూకుట్లో నూనె వేసి వేడయ్యాక శనగపప్పు, పల్లీలు, తాలింపు గింజలు, కల్యమాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల Water పోసి మరిగాక రవ్వను అందులో పోసి గడ్డ కట్టకుండా కలుపుకోవాలి. తర్వాత సన్నని సెగ మీద కొద్దిసేపు ఉంచి దించుకుంటే చాలు. వేడి వేడి బియ్యపు ఉప్మా రెడీ!.