Unnado Ledo Teliyadu devudu Song | GMC Television యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదలైన ఉన్నాడో లేడో తెలియదు దేవుడు..సాంగ్ వింటే మాత్రం మనం ఈ భూమ్మీద ఎలా జీవిస్తున్నాము, మన ప్రవర్తన ఎలాఉందో అర్థమవుతుంది. ఇప్పటి వరకు దేవుళ్లపై వచ్చిన పాటలు వినే ఉంటారు. ఇప్పుడు సాయం చేసే మనిషే దేవుడు అనే విధంగా ఈ పాటను రూపొందించారు. గొప్ప మానవతా ధృక్పథం ఉన్న Charan Arjun ఆధ్వర్యంలో ఈ పాట రూపుదిద్దుకోవడంతో పాటు మ్యూజిక్, సింగర్ అన్నీ తానై పాడిన పాట ఇది.
ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది కూడా. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే ఈ పాటను ప్రజలు ఆదరిస్తున్నారు. చరణ్ అర్జున్ మరొక గొప్ప పాటను అందించారని కామెంట్లు పెడుతున్నారు. కనిపించని దేవుళ్లకు మొక్కే కన్నా సాయం చేసే వారికి మొక్కే చేతులు మిన్నా అని ఈ పాట ద్వారా నిరూపించారు. ఒక అర్థవంతమైన జీవితానికి ఉపయోగపడే మంచి లక్షణాలను ఈ పాట ద్వారా చూపించారు. ఈ పాట చూసిన వారు ప్రస్తుత సమాజంలో మార్పు రావాలని పాట చూసిన వారు కామెంట్లు పెడుతున్నారు.
Unnado Ledo Teliyadu devudu Song
చరణ్ అర్జున్ యూట్యూబ్ ఛానెల్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని అనాల్సిన పనిలేదు. తాను పాడిన పాటలే ప్రేక్షకుల ఆదరణలు పొంది అభిమానులుగా మారారు. ఈ లోకంలో జరిగే యదార్థత కోణాన్ని ప్రజలకు తెలియజేస్తూ పాట రూపంలో అందించడంలో చరణ్ అర్జున్ ఎప్పుడూ ముందే ఉంటారు. చరణ్ పాడిన పాటలు ద్వారా ఎంతో మందిలో మార్పుకూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ పాటలో సాయం చేయడంలో ఉన్న గొప్పతనం గురించి పూర్తి వాస్తవిక కథల ద్వారా పాటను చూపించారు. మనం చేసిన సాయమే మళ్లీ మనకు ఎదురు రావడం నిజంగా అదృష్టంగా చెప్పవచ్చు.
ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సహాయం చేసే పాత్రలో ఆ పెద్దాయన ఆరాటం, తపన చూస్తే మనలో మార్పు రాక తప్పదు. అతని కొడుకు ఏమీ పట్టించుకోకుండా డబ్బే సర్వసం అనుకుంటూ ఉంటాడు. కానీ ఆయన తండ్రి మాత్రం ఎక్కడ గొడవ జరిగినా, ఎక్కడ ఆపద వచ్చినా క్షణాల్లో వారి వద్దకు వెళ్లి వారికి పరిష్కారం చూపడం నిజంగా గొప్ప లక్షణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో పక్కన కళ్లు తిరిగి పడినా కూడా ఎవరూ పట్టించుకోలేని సొసైటీలో మనం జీవిస్తున్నాం. ఇవాళ నాకు, రేపు నీకు, ఎల్లుండి మరొకరికి అన్నట్టుగా ఈ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కూడా లేకపోలేదు.
కాబట్టి ఉన్న సమయంలో సాధ్యమైనంత వరకు మనం తోటి వారికి సాయం చేయడానికి ఏమాత్రం సంకోచించవద్దని ఈ పాట ద్వారా మనందరం తెలుసుకున్నాం. మన సహాయం ఏదో ఒక నాటికి మనకో, మన పిల్లలకో ఆపద నుండి రక్షిస్తుందనేది పాట ద్వారా నిరూపించారు. ఈ పాట ఇప్పటికే అనేక సామాజిక మార్గాల ద్వారా ప్రజలకు చేరువ అవుతుంది. మీరు కూడా ఈ పాటను వీడియో చూడాలన్నా, పాటను వినాలన్నా కింద లింక్ ఇస్తాము. తప్పుకుండా పాటను చూడండి.
Song Name: Unnado Ledo Teliyadu devudu
Music-Lyrics-Singer: Charan Arjun
Director of Photography: Chikku Nandi
Editing & Di: Xavier allusions
Director: SS Sudhakar
Producer: Mallesh Kondeti
Publicity Designer: Novel Nisar
Camera Dept: Teja
Kashif Kreation’s Manager: Pavan Kumar Mekala
Special Thank’s: Krish & Kashif Kreations
Key’s Rhythm’s: Sharath Ravi
Flute: Lalith Taller
Violin: Srinivasan
Chorus Singers: Sanjay Mahesh Varma & Vamshi
Recorded at GMC by Sharath Ravi
Audio Mixed and Mastered by: Bob Phukan
Actors: GV Rao, Mulavirat, Novel Nisar, Vasanth Ramadugu, Sanjay Mahesh Varma, Teja, Sricharan.
ఈ పాట వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి!