Unemployment In India: భారతదేశం ఒక ప్రక్క అభివృద్ధిలో దూసుకుపోతుందని ప్రగల్భాలు పలుకుతున్న పాలకులకు మరో ప్రక్క నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరుగుతున్నది కంటికి కనిపించడం లేదనేది స్పష్టమవుతోంది. కేవలం రాజకీయాలు చేయడం తప్ప దేశంలోని పౌరుల భద్రత, ఉపాధి కల్పన లాంటి అంశాలపై దృష్టి సారించడం లేదు ప్రభుత్వాలు. దీంతో పలు రకాలుగా నిరుద్యోగం పెరిగి యువత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే దేశంలో నిరుద్యోగం(Unemployment In India) ఎన్ని రకాలుగా ఉంటుందో ఇప్పుడు చూద్ధాం!.
Unemployment In India
ప్రచ్ఛన్న నిరుద్యోగం(Disguised unemployment): ఒక రంగంలో అవసరమైన దాని కంటే ఎక్కువ మంది పని చేస్తున్న పరిస్థితిని ప్రచ్ఛన్న నిరుద్యోగం అని నిర్వచిస్తారు. ఉదాహరణకు వ్యవసాయం, అసంఘటిత రంగాలు.
కాలానుగుణ నిరుద్యోగం(Seasonal employment): ఏడాదిలో కొన్ని సమయాలలో ఉండే నిరుద్యోగాన్ని కాలానుగుణ నిరుద్యోగంగా పిలుస్తారు. మన దేశంలో వ్యవసాయ రంగంలో పనిచేసే కార్మికులకు ఏడాది పొడుగునా పని దొరకదు. కేవలం పంట నాట్లు, కోతలు వంటి కొన్ని సమయాల్లో మాత్రమే పని దొరుకుతుంది. మిగిలిన సమయాల్లో వారు నిరుద్యోగులుగా ఉంటారు.


నిర్మాణాత్మక నిరుద్యోగం(Structural employment): అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు, అందుబాటులో ఉన్న నిరుద్యోగుల నైపుణ్యాలకు పొంతన లేని పరిస్థితిని నిర్మాణాత్మక నిరుద్యోగంగా నిర్వచిస్తారు. మన దేశంలో అనేక మంది నిరుద్యోగులకు సరైన విద్య, నైపుణ్యాలు లేకపోవడం వల్ల ఉద్యోగాలు లభించక సుదీర్ఘ కాలం పాటు నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు.
చక్రీయ నిరుద్యోగం(Cyclical unemployment): వ్యాపార రంగంలో ఎగుడుదిగుళ్ల కారణంగా ఏర్పడే నిరుద్యోగం. ఆర్థిక మాంద్యం సమయంలో పెరిగే నిరుద్యోగంగా కూడా చెప్పుకోవచ్చు. ఇది ఎక్కువుగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో కనిపిస్తుంది. మన దేశంలో ఈ తరహా నిరుద్యోగం తక్కువ.
సాంకేతిక నిరుద్యోగం(Technological Unemployment): సాంకేతిక పద్ధతులలో మార్పులు రావడం, కొత్త సాంకేతికతల వాడంక పెరగడం వంటి వాటి వల్ల కలిగే నిరుద్యోగం. మన దేశంలో అత్యాధునిక సాంకేతికతల వాడకం పెరుగుతూ పోవడం వల్ల ప్రతీ ఏటా 69 శాతం ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయని 2016వ సంవత్సరంలో విడుదల చేసిన ప్రపంచ బ్యాంకు సమాచారం అంచనా వేసింది.
ఘర్షణాత్మక నిరుద్యోగం(Frictional unemployment): దీన్ని శోధనాత్మక నిరుద్యోగం అని కూడా అంటారు. ఒక వ్యక్తి కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలి పెట్టడం వల్ల ఏర్పడే నిరుద్యోగాన్ని ఘర్షణాత్మక లేదా శోధనాత్మక నిరుద్యోగం అని నిర్వచిస్తారు. ఉద్యోగాలు మారుతూ మధ్యలో ఖాళీగా ఉండే పరిస్థితి ఇది. అందువల్ల దీన్ని స్వచ్ఛంద నిరుద్యోగం(Unemployment In India) అని కూడా అంటారు.
దుర్భల నిరుద్యోగం(Vulnerable employment): కొన్ని రంగాల్లో ఉద్యోగులు లేదా కార్మికులు చేసిన/ చేస్తున్న ఉద్యోగాల గురించిన సమాచారం ఎక్కడా నమోదై ఉండదు. అందువల్ల వీరిని నిరుద్యోగులుగా పరిగణించడం జరుగుతుంది. మన దేశంలో ప్రధానమైన నిరుద్యోగాల(Unemployment In India)లో ఇది ఒకటి.


నిరుద్యోగాన్ని ఎదుర్కోవడానికి ఇటీవల ప్రారంభించిన కార్యక్రమాలు
- అణగారిన వ్యక్తులకు జీవనోపాధి, వ్యాపారాలకు మద్ధతు (సపోర్టు ఫర్ మార్జనలైజ్డ్ ఇండివిడ్యువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ లేదా స్మయిల్)
- పీఎం- దక్ష్ (ప్రధాన మంత్రి దక్షతా ఔర్ కుశలతా సంపన్న హితగ్రాహి)
- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)
- ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై)
- స్టార్టప్ ఇండియా పథకం