unemployed suicide in khammam ఖమ్మం: ఉద్యోగం కోసం వేచి చూసి మరో విద్యార్థి తనువు చాలించాడు. నా చావుకు సీఎం కేసీఆరే కారణమని ఆరోపిస్తూ మహబూబ్‌నగర్ జిల్లా బయ్యారం మండలానికి చెందిన నిరుద్యోగి ముత్యాల సాగర్(25) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆత్మహత్యకు ముందు తన వాట్సాప్ స్టేటస్‌లో నా చావుకు కేసీఆరే కారణమంటూ.. ఖమ్మం రైల్వే స్టేషన్లో రైలు కింద పడి బలవన్మరణానికి (unemployed suicide in khammam) పాల్పడ్డాడు.
మానసికంగా కుంగిపోయాను!
నిరుద్యోగం వల్ల తాను మానసికంగా కుంగిపోతున్నట్టు ఆవేదన వ్యక్తపరిచిన సాగర్ కరోనా మహమ్మారి కూడా తన చావుకు కారణమని పేర్కొన్నాడు. రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు. 2019లో డిగ్రీ పూర్తి చేసిన సాగర్ పోలీసు ఉద్యోగం కోసం కొన్ని సంవత్సరాలుగా కోచింగ్ తీసుకున్నట్టు మృతుని తల్లిదండ్రులు తెలిపారు. సాగర్, భద్రమ్మ, కలమ్మ దంపతులకు ఒక్కడే కుమారుడు కావడంతో కార్పొరేట్ కాలేజీలో చదివించారు. చేతికి అందిన కుమారుడు ప్రభుత్వ ఉద్యోగం చేసి తమను సాకుతాడని ఎదురు చూస్తున్న సమయంలో ఇలా మరణ వార్త తెలియడంతో వారు బోరున విలపించారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!