cooking oil price : ఒక ప్రక్క కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో ఆయిల్ ధరలు పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కరోనా వల్ల లాక్డౌన్, కర్ఫ్యూ లతో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు వంట నూనె ధరలు పెరగడంతో ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న వంట నూనె ధరలపై కేంద్రం దృష్టి పెట్టింది.
cooking oil price : న్యూఢిల్లీ: దేశంలో పదకొండేళ్ల తర్వాత వంట నూనె ధరలు రికార్డు స్థాయిలో పెరిగి సామాన్యుడి నడ్డి విరగొడుతున్నాయి. అయితే ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖల లెక్కలు ధృవీకరి స్తున్నాయి. దశాబ్ధకాలంగా ఎన్నడూ లేనంత వ్యత్యాసాలతో వంట నూనె అధిక ధరకు చేరుకుంది. కరోనా, లాక్డౌన్ ఎఫెక్ట్ తో వంట నూనె ధరలు మరింత పెరగడానికి కారణాలని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఎక్కువుగా వాడుతున్న ఎడిబుల్ ఆయిల్ ప్యాకెట్స్ ధర సగటున మే నెలలో బాగా పెరిగిందని, గత పదకొండేళ్లలో ఇదే ఎక్కువని తెలుస్తోంది. పల్లీ, ఆవాలు, వనస్పతి, సోయా, సన్‌ప్లవర్, ఫామ్ ఆయిల్ ఇలా దాదాపు ప్రతీ ఆయిల్ మీద ప్రభావం పడిందని లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా కరోనా మధ్య కాలంలో లాక్డౌన్ల వల్ల రాష్ట్రాల మధ్య ఆర్థిక లావాదేవీలకు విఘాతం కలగడం కూడా వంట నూనె ధరలు పెరగడానికి ఒక కారణంగా ఆ డేటా వెల్లడించింది.
ధరలు పెరుగుదల ఇలా..!
రాష్ట్రాల పౌర సరఫరా విభాగాలు సమర్పించిన డేటా ఆధారంగా ఆయిల్ ధరలు జనవరి 2010 తర్వాత ఇప్పుడు అధిక వ్యత్యాసాలతో పెరిగాయని తెలుస్తోంది. సాధారణ నూనె 2010లో రూ.63 కేజీ ఉండగా, ఇప్పుడది రూ.155 లకు చేరుకుంది. ఆవ నూనె కేజీకి పోయిన సంవత్సరం ఇదే సమయానిఇక రూ.118 ఉండగా, 39 శాతం పెరిగి రూ.164 లకు చేరుకుంది. ఇక మన దేశంలో ఎక్కువుగా ఉపయోగించే పామ్ ఆయిల్ పిరం అయ్యింది. గతేడాది కేజీ పామ్ ఆయిల్ ధర రూ.88 ఉండగా, ఇప్పుడు అది 131కు చేరుకుంది. అంటే 49 శాతం పెరిగిందన్నమాట. ఇక ఇదే పామ్ అయిల్ ధర 2010 లో రూ.49 ఉంది. మిగిలిన ఎడిబుల్ ఆయిల్స్ ప్రస్తుత పౌర సరఫరా శాఖల లెక్కల ప్రకారం వేరు శనగ నూనె (పల్లీ) కేజీ రూ.175.50, వనస్పతి రూ.127 , సోయా రూ.148, సన్‌ప్లవర్ రూ.170 చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ నాలుగు ఆయిల్స్ ధరలు 19 నుంచి 52 శాతం పెరిగినట్టు తెలుస్తోంది.
కేంద్రం చర్యలు!

ప్రస్తుతం ఎడిబుల్ నూనెల ధరలు పెరుగుదలను పదకొండేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ధరలు తగ్గించేందుకు అవసరమైన చర్యల కోసం ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ సోమవారం స్టేక్ హోల్డర్స్ అందరితో ఒక సమావేశమైంది. ఆయిల్ ధరలు తగ్గే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని ఈ మీటింగ్‌లో రాష్ట్రాలను కోరింది. అంతే కాదు కేంద్రం కూడా నిల్వలకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి