విషాదంగా ముగిసిన వివాహిత కథ!
Harassment : Hyderabad: భర్త వేధింపలు భరించలేక విడిపోయి దూరంగా ఉంటుందోది ఓ వివాహిత. అయినప్పటికీ ఆ మహిళకు ప్రశాంతత దొరకలేదు. ఒంటరిగా ఉంటున్న ఆమెపై పోకిరీల కళ్లు పడ్డాయి. నిత్యం వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. పెళ్లి చేసుకోమంటూ వెంటపడ్డాడు. తనకు ఇష్టం లేదని చెబుతున్నా వినిపించుకోకుండా నిత్యం వేధించడంతో తట్టుకోలేక పోయింది ఆ అభాగ్యురాలు. చివరకు ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోయింది. ఈ విషాద సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడకు చెందిన ఈశ్వరమ్మకు వివాహమైంది. నిత్యం భర్త వేధింపులకు గురిచేసేవాడు. రెండేళ్ల కిందట కత్తితో దాడి చేయడంతో అప్పటి నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. ఒంటరిగా ఉంటోన్న ఆమెపై అదే ప్రాంతానికి చెందిన ఉన్యానాయక్ కన్నేశాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను నిత్యం వేధింపులకు గురిచేశాడు. అతని వేధింపులు తట్టుకోలేక పోయిన వివాహిత అఘాయిత్యానికి ఒడిగట్టింది.
ఉరివేసుకొని ఆత్మహత్య
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ వివాహిత ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోకిరీల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చదవండి:కృష్ణా జిల్లా టిటిపిలో ముసలం
ఇది చదవండి:రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన చిన్నమ్మ(శశికళ)
ఇది చదవండి:10 life changing Principales
ఇది చదవండి: ఆ జంతువుకు నిజంగానే విముక్తి కలిగింది!