Ukraine Russia war

Ukraine Russia war: ఉక్రెయిన్ – ర‌ష్యా యుద్ధం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న ప్ర‌పంచ దేశాలు!

Special Stories

Ukraine Russia war: యుక్రెయిన్ పై ర‌ష్యా చేస్తున్న యుద్ధంపై ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి స్పందించింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచమే ప్రమాద‌క‌ర‌మైన క్ష‌ణాన్ని ఎదుర్కోబోతోంద‌ని ఐక్య‌రాజ్య స‌మితి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియా గుటె ర‌స్ అన్నారు. తూర్పు ఉక్రెయిన్‌పై కాల్పులు ఆపాల‌ని ఐక్య‌రాజ్య స‌మితి చెబుతోంది. ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల్లో యుద్ధానికి ముందు 200,000 మంది సైనికులును, వేల సంఖ్య‌లో సైనిక వాహ‌నాల‌ను ర‌ష్యా మోహ‌రించింది. అయితే ఉక్రెయిన ప్ర‌భుత్వం మాత్రం శాంతిని కోరుకుంది. మా దేశంపై యుద్దానికి రాకుండా మీ దేశ అధ్య‌క్షుడును ఆపండి అంటూ మంగ‌ళ‌వారం చివ‌రి అభ్య‌ర్థ‌న గా ఉక్రెయిన్ అధ్యక్షుడు(Ukraine Russia war) విన్న‌వించుకున్నాడు.

అయిన‌ప్ప‌టికీ గురువారం తెల్ల‌వారుజామున ఉక్రెయిన్‌పై ర‌ష్యా బ‌ల‌గాలు విరుచుకుప‌డ్డాయి. ఒక పెద్ద యుద్దానికి ఇది నాంది కావ‌చ్చ‌ని ప్ర‌పంచ దేశాల నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ర‌ష్యా బ‌ల‌గాల బాంబు దాడుల్లో ఇప్ప‌టికే వంద‌ల సంఖ్యలో సామాన్య పౌరులు ప్రాణాలు విడిచారు. ఎంతో మంది పౌరుల ఆచూకీ తెలియ‌డం లేదు. ర‌ష్యా చ‌ర్య‌ను యూర‌ప్ దేశాలు ఖండించ‌డంతో పాటు వేగంగా స్పందించాయి. ర‌ష్యా సైనిక బ‌ల‌గాలు ఉత్త‌రా చెర్నిహివ్‌, సుమీ ప్రాంతాల నుంచి తూర్పున లుహాన్క్‌, ఖార్కీవ్ ప్రాంతాల నుంచి స‌రిహ‌ద్దులు దాటి యుక్రెయిన్‌లోకి ప్ర‌వేశించాయని ఉక్రెయిన్ స‌రిహ‌ద్దు గ‌స్తీ విభాగం తెలిపింది.

ఉక్రెయిన్‌పై రష్యా బాంబు దాడి

అయితే ఉక్రెయిన్ సైన్యం ర‌ష్యా కు చెందిన 5 యుద్ధ విమానాల‌ను పాటు ఒక హెలికాప్ట‌ర్‌ను కూడా కూల్చివేశాయి. శాంతంగా ఉండాల‌ని, త‌మ దేశ సైనికుల‌పై న‌మ్మ‌కం ఉంచాల‌ని ఉక్రెయిన్ ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అయితే మా విమానాల‌ను ఉక్రెయిన్ కూల్చి వేయ‌లేద‌ని ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ తిర‌స్క‌రించింది.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *