Ukraine Nuclear Power: పుట్టకతోనే 5,000 వేల అణ్వాయుధాలతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అణుశక్తి ఉక్రెయిన్. కానీ ప్రపంచ దేశాల మాటలు నమ్మి, అణ్వాయుధాలు వదులుకొని జాతీయ భద్రతను వారి చేతిలో పెట్టినందుకు ఫలితం అనుభవిస్తోంది. దీనికి తోడు అవినీతి మర్రివూడల్లా వేళ్లూనుకోవడం పరాయి దేశాలకు అడుగులకు మడుగులొత్తే వారు అధికారంలోకి రావడం దానికి శాపంగా మారింది. ఫలితంగా దేశ రక్షణ కోసం నిస్సహాయంగా ఆర్తనాదాలు చేస్తోంది. నాడు ముచ్చట్లు చెప్పిన దేశాలు ఒక్కటి కూడా పూర్తి సాయానికి రావడం లేదు. దీంతో మౌనంగా తమకు జరిగిన అన్యాయానికి ఉక్రెయిన్ వాసులు కుమిలిపోయే పరిస్థితి (Ukraine Nuclear Power) వచ్చింది.
మూడో అతిపెద్ద అణుశక్తి గా ఉక్రెయిన్
కోల్డ్ వార్ ముగిసే సమాయనికి బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల కంటే అత్యధిక అణ్వాయుధాలు ఉన్న దేశం ఉక్రెయిన్. ఈ దేశం ఆవిర్భవించే నాటికి రష్యా నుంచి వారసత్వంగా వచ్చిన దాదాపు 5,000 వేలకు పైగా అణ్వస్త్రాలు దీనికి ఉన్నాయి. సోవియట్‌కు చెందిన 43 రాకెట్ ఆర్మీ, 19వ రాకెట్ డివిజన్, 37వ గార్డ్స్ రాకెట్ డివిజన్, 46వ రాకెట్ డివిజన్, 50 రాకెట్ డివిజన్లు ఉక్రెయిన్‌లో ఉన్నాయి. వీటి వద్ద ఉన్న 175 ఖండాంతర క్షిపణులను ఉక్రెయిన్‌లో పలు ప్రాంతాల్లో భూగర్భ బొరియల్లో భద్ర పరిచింది.

ఎస్ఎస్ 24 క్షిపణులు కూడా ఉన్నాయి. ఈ క్షిపణులు ఒక్కోటి 10 థర్మోన్యూక్లియర్ అణ్వాయుధాలను ప్రయోగించగలదు. ఉక్రెయిన్ కంటే రష్యా, అమెరికా వద్ద మాత్రమే అత్యధిక అణ్వాయుధాలు ఉన్నాయి. 33 హెవీ బాంబర్లు కూడా ఉక్రెయిన్‌లో ఉన్నాయి. కొత్త పాలకులు వీటిని నిర్వహించే సైనికులు, కమాండర్లను దేశానికి విశ్వాసంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయమని కోరగా కొందరు నిరాకరించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!