Ukraine Indian embassy | ఉక్రెయిన్‌పై Russia యుద్ధం గంట గంటకూ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కీవ్‌ను తక్షణమే వదిలి పెట్టాలని భారతీయులను ఆ నగరంలోని ఇండియన్ ఎంబసీ మంగళవారం కోరింది. ఉపగ్రహ ఛాయా చిత్రాలను పరిశీలిం చిన పిమ్మట 64 కిలోమీటర్ల మేరకు రష్యా సైన్యాలు ఉక్రెయిన్ వైపు కదులుతున్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో అడ్వయిజరీని ఇండియన్ ఎంబసీ ప్రకటన(Ukraine Indian embassy) చేసింది.
ఇప్పటి వరకూ ఇండియన్ ఎంబసీ జారీ చేసిన అడ్వయిజరీలలో ప్రశాంతంగా, సురక్షితంగా ఉండండి అని కోరుతూ వచ్చింది. మంగళవారం జారీ చేసిన అడ్వయిజరీలో విద్యార్థులు సహా భారతీయులంతా నేడు అత్యవసరంగా కీవ్ నగరాన్ని విడిచిపెట్టాలని ప్రకటన చేసింది. ఇప్పటికే భారతీయుడు కర్ణాటక వాసి ఉక్రెయిన్‌లో రష్యా బాంబు దాడుల్లో చనిపోయినట్టు వార్తలు వచ్చాయి.
దీంతో ఉలిక్కిపడ్డ ఇండియన్ ఎంబసీ ఈ ప్రకటన చేయడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధ తీవ్రత ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. అందుబాటులో ఉన్న రైళ్లు లేదా ఏదైనా ఇతర రవాణా సాధనాల ద్వారా కీవ్ నగరాన్ని వదిలి వెళ్లండి అని పేర్కొంది. ఆపరేషన్ గంగ పేరుతో ఉక్రెయిన్ నుంచి భారతీయులను విమానాల ద్వారా రప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కృషిలో భారత వాయు సేన కూడా పాలు పంచుకోవాలని మోదీ పిలుపునిచ్చినట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ మంగళవారం తెలిపింది.
వాయు సేన రంగంలోకి దిగితే తక్కువ సమయంలోనే ఎక్కువ మందిని తీసుకురావడానికి వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోందని తెలిపింది. మరోవైపు మానవతావాద సాయాన్ని మరింత సమర్థవంతంగా అందజేయ డానికి కూడా వీలవుతుందని భావిస్తున్నట్టు పేర్కొంది. ఆపరేషన్ గంగ కోసం మంగళవారం నుంచే సీ-17 విమానాలను వాయుసేన నడిపే అవకాశం ఉందని తెలిపింది.
ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు స్పైస్‌జెట్ ఓ ప్రత్యేక విమానాన్ని స్లోవేకియాకు మంగళవారం నడుపుతుంది. ఈ తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్లోవేకియాకు వెళ్తారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!