UK Covid Cases: యూకేలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 54,674 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో జనవరి నెల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో అత్యధికంగా కేసులు నమోదు కావడం అక్కడి ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ విధంగా కేసులు నమోదు అవుతున్నా ఇంగ్లండ్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆంక్షలను ఎత్తేసింది.
UK Covid Cases: ఇంగ్లండ్‌లో ఆంక్షలు ఎత్తేయడంతో పాటు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను రద్దు చేసింది. మాస్క్‌లు తప్పనిసరి కాదని ప్రకటించింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఆంక్షలను ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకోవడం కొసమెరుపు. ఆంక్షల నుంచి దేశాన్ని బయట పడేసేందుకు ఇదే సరైన సమయమని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆంక్షలన్నింటినీ ఒకేసారి ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అక్కడ లేబర్ పార్టీ నేత సర్ కీర్ స్టార్మర్ తీవ్రంగా తప్పు బట్టారు. ప్రధాని బోరిస్ జాన్సన్ తీసుకుంఉటన్న ఇలాంటి ప్రమాదకర నిర్ణయాల వల్ల ప్రజలు విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన చెప్పారు.
జాన్సన్ నాయకత్వ లోపాల వల్ల ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి ప్రభావానికి చాలా మంది ప్రజలు బలయ్యారని, మరింత మంది చనిపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆంక్షలు ఎత్తేయడంతో ఇంగ్లండ్‌లో నైట్ క్లబ్‌లు తిరిగి ప్రారంభమయ్యాయి. ఒక మీటరు భౌతిక దూరం పాటించాలన్న నిబంధన గాల్లో కలిసిపోయింది. థియేటర్లు, స్టోర్ట్స్ స్టేడియమ్స్ ఎప్పటిలాగానే ప్రేక్షకులతో కళకళలాడనున్నాయి. అయితే ఆంక్షలు ఎత్తివేయడంపై ఇంపీరియల్ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ నీల్ ఫెర్గ్యూసన్ బ్రిటన్ ను హెచ్చరించారు. డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువుగా నమోదువుతున్న ఈ తరుణంలో ఆంక్షలను ఎత్తివేయడం తొందరపాటు చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు.
డెల్టా వేరియంట్ కారణంగా కొద్ది రోజుల్లోనే రోజుకు లక్ష కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వైరస్ మరింత విజృంభిస్తే రోజుకు రెండు లక్షల కేసులు నమోదయ్యినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య నిపుణులు కూడా ఆంక్షలు ఎత్తివేత నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ ఆరోగ్య కార్యదర్శి జెరెమి హంట్ ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇజ్రాయెల్, నెదర్లాండ్స్ ఆంక్షలను ఎత్తేసి మళ్లీ అమల్లోకి తెచ్చాయని, ఈ దేశాలను చూసైనా ప్రభుత్వం ఆంక్షల ఎత్తివేతపై పునరాలోచించాలని ఆయన చెప్పారు. వ్యాక్సినేషన్ విషయంలో కాస్త యూకే మెరుగ్గానే ఉందని చెప్పక తప్పదు. యూకేలో దాదాపు 87.9 శాతం మంది పౌరులు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. 68.3 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ థైర్యంతోనే ఆంక్షల ఎత్తివేత నిర్ణయానికి ప్రధాని బోరిస్ జాన్సన్ పూనుకున్నట్టు సమాచారం.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!