Ugadi Pachadi 2022: ఉగాది పండుగ నాడు అభ్యంగన స్నానం చేసి ఏ ఇతర ఆహారం తీసుకోకుండా, ఆరు రుచులచే కూర్చబడిన ఉగాది పచ్చడిని ఆరగిస్తారు. ఈ ఆరగింపులో ఎన్నో ఆరోగ్య విశేషాలున్నట్లుగా విజ్ఞలైన మన పెద్దలు పలుకుతారు. సంవత్సరాది పండుగ ఆరుదెంచే గ్రీష్మ వాతావరణపు ఈతి బాధల నుండి శరీరాన్ని(Ugadi Pachadi 2022) సంరక్షిస్తుంది.
ఉగాది పచ్చడి ఉపయోగాలు!
ఉగాది పచ్చడినే గొజ్జు అని కొన్ని ప్రాంతాల్లో అంటారు. ఇందులో ఆరు రకాల రుచులతో గూడిన వస్తువులు కలపబడతాయి. తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పదనం అనే ఈ రుచులు కలిగిన నూతన సంవత్సరం 2022లో కొత్తగా లభించిన బెల్లం, చింతపండు, వేపపూత, పచ్చిమామిడి, పచ్చి మిర్చి, ఉప్పు కలపబడతాయి. కొన్ని ప్రాంతాల్లో చెరకు ముక్కలు, గసగసాలు కూడా కలుపుతారు. ఈ పచ్చడిలో ఉన్న వేరు వేరు ద్రవ్యాల ఆరోగ్య విశేషాలనిప్పుడు తెలుసుకుందాం.
వేప పూవు అన్నింటికన్నా ప్రధానమైనది. వేప పూత ఫాల్గుణ మాసంలోనే ప్రారంభమవుతుంది. వేప ఆకు దుష్టక్రిమి సంహారిణి. వేప పూవు నోటి ఆరుచిని పోగొడ్తుంది. వేపచెట్టు నీడలో శయనిస్తే అందుండి వచ్చే గాలి చాలా ఆరోగ్య హేతువుగా ఉంటుంది. గ్రామీణులు వేప చెట్లను గ్రామ దేవతగా ఆరాధిస్తారు. మశూచి, ఆటలమ్మ మొదలైన ఉష్ణ రోగాలు వచ్చినప్పుడు వేప ఆకులతో విసిరితాపాన్ని తగ్గిస్తారు. వేప నూనె అభ్యంగనస్నానానికి అనువైనది. ఇన్ని ఆరోగ్య విలువులున్న వేప పూత సేవనం మనకు చక్కని ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.
పచ్చి మామిడి ముక్కలు పులుపు, వగరు అనే రెండు రుచులకు చిహ్నాలు. ఇది రక్త దోషాన్ని హరిస్తుంది. దంత పటుత్వం పెంచుతుంది. శరీరానికి పుష్టినిచ్చే సి విటమిన్లు పచ్చి మామిడిలో ఉన్నాయి. కొత్త బెల్లం వాతాన్ని పోగొడ్తుంది. ధాతువృద్ది కలిగించి, కఫాన్ని ధ్వంసం చేస్తుంది. మూత్ర వ్యాధులను హరిస్తుంది. బెల్లాన్ని అల్లపు రసంతో మేళవించి తీసుకుంటే కఫరోగాలు, కరక్కాయ చూర్ణంతో కలిపితే పైత్యం, శొంఠితో కలిపి తింటే చలవ. ఇంతటి వైద్య ప్రయోజనంగం బెల్లం ఉగాది పచ్చడిలోని ఉండటం విశేషం.

చింతపండుకు కూడా ఆరోగ్య విలువలు కలిగే సాధనమే. చింతపండు కూడా శరీరంలోని మలబద్దకాన్ని, పైత్యాన్ని అరికడ్తుంది. చింత చెట్టు ఎక్కువ కాలం జీవించే మహా వృక్షాలలో ఒకటి. చింత చిగురు, చింత కాయ సథ్యపు కూరల్లో రోగులకు సర్వదా పనికి వస్తాయి. ఉప్పు లేనిదే ఏ పదార్థానికి రుచి లేదు. ఆహార పదార్థాలలో అది అత్యవసరం. పచ్చిమిర్చి కారాన్ని కలిగించి మనలో తేజస్సును, చైతన్యాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా ఈ ఆరు రుచుల రసాయన్నాన్ని ప్రతి వారూ తప్పక స్వీకరించాలి.
అన్ని రుచులనూ సమదృష్టితో భుజించగలినవాడు జీవితంలో యేర్పాటుగా వచ్చే సుఖ దుఖఃఖాలనూ, సంతోష విషాదాలనూ అనేగానంచాను భూతులను కూడా సమదృష్టితో స్వీకరించగల స్థితప్రజ్ఞత డవుతాడు. ఉగాది పచ్చడి స్వీకారంలోని విజ్ఞాన దృష్టి ఇది. ఈ విధంగా ఉగాది పచ్చడిలో ఎన్నో ఆరోగ్య, విజ్ఞాన విశేషాలున్నాయనేది నిర్వివాదాంశం. అట్టి అవకాశం మనకు సంవత్సరంలో తొలిసారిగా సంవత్సరాది దినం ప్రసాదిస్తుంది. మన పండుగల్లో నిర్ణయించబడిన అన్ని ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు విజ్ఞులైన మన పూర్వీకులు ఎంతో దూర దృష్టితో, ఇహసరసాధకంగా ఏర్పరచారన్నది నిత్య సత్యం.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!