Types of Thyroid: ఈ రోజుల్లో మహిళల్లో అత్యంత వేగంగా విస్తరిస్తున్నది థైరాయిడ్ వ్యాధి. వాతావరణ కాలుష్యాల వల్ల కావచ్చు. మారిన జీవన శైలి వల్ల కావచ్చు. ఈ థైరాయిడ్ సమస్యలు అత్యధికుల్ని వ్యాధిగ్రస్తం చేస్తున్నాయి. థైరాయిడ్ (Types of Thyroid)సమస్య రావడానికి నానాటికి పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లు, సమస్యలు కూడా కారణమవుతున్నాయి. పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ మంది ఈ సమస్యల బారిన పడుతుంటారు.
సకాలంలో వైద్య చికిత్సలు తీసుకుంటే ఈ సమస్య సమూలంగానే తొలిగిపోతుంది. నిర్లక్ష్యం చేస్తే ఇది జీవితాన్నే నిర్జీవంగా మార్చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి మానవుని కంఠం భాగంలో కాలర్ ఎముక పైభాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది ఒక అతఃస్రావ గ్రంధి. ఇది టి-3, టి-4 , టిఎస్హెచ్ కాల్సిటోనిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది మానవుని జీవరసాయన క్రిములను నియంత్రిస్తుంది.
థైరాయిడ్ హార్మోన్ల – పరిమాణం
టి-3 (ట్రై అయిడో థేరోననిన్) 80-180 ఎంజీ/ డిఎల్
టి- 4 (థైరాక్సిన్) 4.5 – 12.5 ఎంజీ/ డిఎల్
టిఎస్హెచ్ (థైరాయిడ్ స్టిమ్యూలేటింగ్ హార్మోన్) 0.5 – 5.5 ఎంఐయు/ ఎల్


రెండు రకాలు: హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయి డిజం అంటూ ఈ సమస్య రెండు రకాలు. అయితే, హైపో థైరాయిడిజంలో థైరాయిడ్ గ్రంథి తగిన మోతాదులో టి-3 లేదా టి-4 హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.
హాషిమోటోస్ థైరాయిడైటిస్
ఇది ఒక ఆటో ఇమ్యూని వ్యాధి. రక్షణ వ్యవస్థ సొంత థైరాయిడ్ గ్రంథిపై దాడి చేయడమే ఇక్కడ సమస్య.
దీని వల్ల థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరుగుతుంది. అలా పెరగడాన్ని గాయిటర్ సమస్య అంటారు. ఈ సమస్య చివరకి గ్రంథి నాశనానికి దారి తీస్తుంది.
సబ్ – ఎక్యూట్ థైరాయిడైటిస్
ఇది సాధారణంగా థైరాయిడ్ గ్రంధిలో వాపు ఏర్పడటం వల్ల గానీ, గర్భధారణ సమయంలో గానీ వస్తుంది. ఇది స్వల్పకాలమే ఉంటుంది కాబట్టి థైరాయిడ్ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఇవే కాకుండా, ఏ కారణంగానైనా థైరాయిడ్ గ్రంథిని తొలగించడం, డ్రగ్స్ వాడకం, హైపో థలామస్, పిట్యూటరీ గ్రంథి వ్యాధులు, అయోడిన్ లోపాల వంటి సమస్యల కారణంగా కూడా థైరాయిడ్ సమస్యలు రావచ్చు.
థైపోథైరాయిడిజం లక్షణాలు
నీరసం, చలికి తట్టుకోలేకపోవడం, మలబద్ధకం, కండరాల నొప్పులు, బరువు పెరగడం లేదా తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. వీటితో పాటు, థైరాయిడ్ వాపు (గాయిటర్) ఛర్మం పొడిబారడం, జుట్టు బిరుసుగా తయారవ్వడం లేదా జుట్టు రాలిపోవడం, కళ్లు, ముఖాల్లో వాపు, బొంగురు గొంతు, నెలసరి సమస్యలు / అధిక రక్తస్రావం, మానసికంగా కుంగిపోవడం, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం వంటి లక్షణాలు ఈ హైపో థైరాయిడిజంలో కనిపిస్తాయి.


హైపర్ థైరాయిడిజం లక్షణాలు
మానసిక ఆందోళన, చిరాకు, గుండెదడ, గుండె వేగంగా కొట్టుకోవడం, వేడి తట్టుకోలేక పోవడం లేదా చెమటలు ఎక్కువుగా రావడం, వణుకు, బరువు తగ్గడం, ఆకలి పెరగడం, విరేచనాల వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిలో పాటు కాలికింది భాగంలో వాపు, పక్షవాతం రావడం, ఊపిరి అందకపోవడం, రుతుస్రావం తగ్గడం, సంతానలేమి, నిద్ర పట్టకపోవడం, కంటి చూపులో ఇబ్బందులు నీరసం, థైరాయిడ్ గ్రంథిలో వాపు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!