Types of Phobias: గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు సయితం కొన్ని కొన్ని విషయాలంటే భయం భయంగా ఉండేవారు. పైకి చెప్పుకోకపోయినా చాలా మందిలో ఏదో ఒక విషయం అంటే భయం ఉంటుంది. ఈ భయాలకు అందమైన ఆంగ్లనామం ఫోబియా. ఫాస్కల్ గొప్ప శాస్త్రవేత్త. అతనికి ఖాళీ ప్రదేశం అంటే గొప్ప భయం. అదే విధంగా సిగ్మండ్ ఫ్రాయిడ్కు ప్రయాణం అంటే ఎడతెగని భయం.
కొన్ని వస్తువులు లేదా కొన్ని పరిస్థితులు పట్ల వివేకరహితమైన భయాలు ఉండటాన్ని ఫోబియాలు అంటారు. మానసిక తత్త్వ శాస్త్రవేత్తలు ఈ ఫోబియాలను ఒక రకమైన క్రమ రహిత ఆవేశంగా వర్గీకరిస్తారు. న్యూరోసిస్గా కూడా దీనిని చెబుతారు. కొన్ని రకాల ఫోబియాలు వాటి అర్థాలు (Types of Phobias)చూడండి. అవి ఎంత తమాషాగా ఉంటాయో!


- యాంక్రోఫోబియా
ఎత్తుకి వెళ్లడం అంటే ఈ ఫోబియా ఉన్న వారికి భయం. ఇటువంటి వారు నిచ్చెన మెట్లు లేదా మేడ మెట్లు ఎక్కడానికి చాలా భయపడతారు. కొంత మంది నేలమీద నుండి కొద్ది ఎత్తుకు వెళ్లేసరికి కళ్లు తిరిగినట్టు ఫీలవుతారు. మరికొంత మంది నిచ్చెనపై సబబుగా కొంతవరకూ వెళ్లి అక్కడ నుండి విపరీతమైన భయానికి లోనవుతారు.
- బెలోనో ఫోబియా
ఏమైనా సూదిగా ఉండే వస్తువులంటే ఈ ఫోబియా ఉన్నవారికి భయం. కత్తి, చాకు, కత్తెర, రేజర్లు, బాకు వంటి వాటిని చూస్తే వీరికి హడల్. బిలోన్ అనే గ్రీకు పదం నుండి ఇది రూపొందించబడింది. దీని అర్థం సూది అని.
- ఎగోర ఫోబియా
ఖాళీ ప్రదేశాలంటే ఈ ఫోబియా ఉన్నవారికి భయం. గ్రీకు పదం ఎగోర నుండి దీనిని రూపొందించారు. అంటే దుకాణాలుండే స్థలం లేదా పదిమంది సమావేశం అయ్యే స్థలం అని అర్థం.
- హెర్ సెటో ఫోబియా
బల్లిని చూసినా లేదా పాకే జంతువులను చూసినా ఈ ఫోబియా గలవారికి భయం. హెర్ పెటోస్ అనే గ్రీకు
పదం నుండి ఈ పదాన్ని తయారు చేశారు. అంటే ప్రాకడం అని అర్థం. పాముతో సహా పాకే అన్ని జంతువుల వల్ల ఈ ఫోబియా ఉన్నవారికి భయం ఉంటుంది. కేవలం పాములంటే భయపడే వారి భయాన్ని ఓఫిడియో ఫోబిక్స్ అంఆరు. ఈ ఓఫిడియో ఫోబిక్సు కూడా హెర్ పెటో ఫోబియాలో ఉంటుందన్నమాట.
- ఆటో ఫోబియా
ఒంటరిగా ఉండటం అంటే భయపడేవారికి ఉండే ఫోబియాను ఆటో ఫోబియా అంటారు. దీనిని మోనోఫోబియా అని కూడా అంటారు.
- మ్యుసోఫోబియా
ఎలుకలంటే ఈ ఫోబియా ఉన్నవారికి భయం. అసలు జంతువులంటే భయం ఉండటం సాదారణంగా ఉండే ఒక రకం ఫోబియా. ఇటువంటి ఫోబియా గల వారికి ఎలుకను చూసేటప్పటికీ ముచ్చెమటలు పోస్తాయి. ఒళ్లంతా వణికిపోతుంది. ఒక్కొక్కప్పుడు స్పృత తప్పి పడిపోతారు. మ్యూపోఫోబియా గల వారికి, జంతువులంటే భయంగల వారికి ధైర్యం చెబుతూ ఉండాలి.


- ఎరక్రోఫోబియా
సాలీడంటే భయపడేవారికి ఎరక్నోఫోబియా ఉందంటారు. ఎరచ్నిడా అనే పదం సాలీళ్లు, తేళ్లు, తవుటి పురుగులు వంటివన్నీ ఉండే ఆర్ధ్రోఫోడాను తెలియజేస్తుంది. సాలీడంటే ఆ హేతుకమైన భయాన్ని కలిగి ఉంటారు. సాలీడును చూసేసరికి ఈ ఫోబియాకలవారు కొంత మందికి కళ్లు, ఒళ్లు, తల తిరిగి స్పృహ తప్పే స్థితికి వెళ్లేవారు కూడా బహుకొద్ది మంది ఉంటారు.
- నోసోఫోబియా
అనారోగ్యం లేదా రోగం అంటే భయంగలవారికి ఈ ఫోబియా ఉంటుంది. దీనిని పాథోఫోబియా అని కూడా అంటారు. కొంత మందికి రోగం వచ్చిందని తెలిస్తే ఊహకందని విధంగా భయపడతారు. ఉదహారణకు కాన్సర్, లేదా సిఫిలిస్ వ్యాధులు ఉన్నట్టు తెలిస్తే అమితమైన భయానికి లోనవుతారు. లేదా తమ ఆరోగ్యం గురించి అసాధారణమైన రీతిలో స్పందిస్తూ ఉంటారు. ఈ ఫోబియాకు కారణం మానసిక వికారమని లేదా అనారోగ్యం వల్ల వచ్చే నిరుత్సాహమని నమ్ముతారు.


10.ఆక్ణోఫోబియా
సమూహం, గుంపు అంటే భయపడేవారికి ఈ ఫోబియా ఉందని అంటారు. ఇటువంటి వ్యక్తులు జనసాంద్రత హెచ్చుగా ఉన్న ప్రదేశాలలోకి వెళ్లడానికి ఇష్టపడరు. ఇవిగాక ఇంకా హైడ్రోఫోబియా (వీళ్లంటే భయం) , సోషల్ ఫోబియా(ఫంక్షన్స్ అంటే భయం), సింపుల్ ఫోబియా (ఉపన్యాసం ఇవ్వడం, తినడం, పాయిఖానాను ఉపయోగించడం కూడా భయం) వంటివి మనకు ఎన్నో తెలుసు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!