Chemical bond

Types of Chemical bond: వివిధ ర‌కాల ర‌సాయ బంధాలు

Education

Types of Chemical bond | అణువులోని ప‌ర‌మాణువు మ‌ధ్య ఆకర్ష‌ణ బ‌లాలుంటాయి. ఈ ఆక‌ర్ష‌ణ బ‌లాల‌నే ర‌సాయ‌న బంధం అంటారు. ప‌ర‌మాణువులు బాహ్య క‌ర్ప‌రంలో 8 ఎల‌క్ట్రానుల‌ను ఉంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నించే ప్ర‌వృత్తి వ‌ల్ల ర‌సాయ‌న సంయోగ మ‌రియు ర‌సాయ‌న బంధాలు(Types of Chemical bond) ఏర్ప‌డ‌తాయి. అన్నిటికంటే బ‌హిర్గ‌త క‌క్ష్య‌లోని ఎల‌క్ట్రానుల సంఖ్య‌ను వాలేన్సీ ఎల‌క్ట్రానులు అంటారు. ర‌సాయ‌న బంధం ఏర్ప‌డ‌టంలో వాలెన్సీ ఎల‌క్ట్రానులు పాల్గొంటాయి.

ఎల‌క్ట్రానులు కోల్పోయే ప‌ర‌మాణువు ధ‌నావేశ పూరిత‌మ‌వుతుంది. ఎల‌క్ట్రానుల‌ను గ్ర‌హించే ప‌ర‌మాణువు ఋణావేష పూరిత‌మ‌వుతుంది. ఎల‌క్ట్రాన్ బ‌దిలీ వ‌ల్ల ఏ్ప‌డిన బంధం విరుద్ధ విద్యుదావేశం గ‌ల అయానుల మ‌ధ్య ఉండే స్థిర విద్యుత్ ఆక‌ర్ష‌ణ బ‌ల‌మే యానిక బంధం లేక ఎలెక్ట్రోవాలెంట్ బంధం అంటారు. ఎల‌క్ట్రాను ల‌ను తీసివేయ‌డం ఆక్సిక‌ర‌ణం, ఎల‌క్ట్రాను చేర్చ‌డం క్ష‌య‌క‌ర‌ణం. ఎల‌క్ట్రాను స్వీక‌రించే ప‌ర‌మాణువు ఆక్సీక‌ర‌ణ‌, ఎల‌క్ట్రానుల‌ను ఇచ్చే ప‌ర‌మాణువు క్ష‌య‌క‌ర‌ణి.

ఒక చ‌ర్య‌లో ఆక్సిక‌ర‌ణం, క్ష‌య‌క‌ర‌ణం ఏకంగా కాలంలో జ‌రుగుతుంటాయి. అయానికి ప‌దార్థాల ధ‌ర్మాలుః పెలుసుగాను, గ‌ట్టిగానూ, ధృఢంగా ఉంటాయి. ద్ర‌వీభ‌వ‌న‌, భాష్ఫీభ‌వ‌న ఉష్ణోగ్ర‌త‌లు ఎక్కువ‌గా ఉండే ప‌దార్థాలు, నీరు వంటి ధృవ ద్ర‌వ‌నిల‌లో ఎక్కువుగా క‌రుగుతాయి. రెండు ప‌ర‌మాణువులు మ‌ధ్య ఎల‌క్ట్రాను జంట‌ను పంచుకోవ‌డం వ‌ల్ల ఏర్ప‌డిన బంధాలు స‌మ‌యోజ‌నీయ బంధాలు అంటారు.

స‌మ‌యోజ‌నీయ ప‌దార్థాలు మృదువుగా ఉంటాయి.ఈ ప‌దార్థాల ధృవీభ‌వ‌న‌, బాష్ఫీభ‌వ‌న స్థానాలు త‌క్కువ‌గా ఉంటాయి. సాధార‌ణంగా ఇవి విద్యుత్‌ను ప్ర‌స‌రింప జేయ‌వు. ఎల‌క్ట్రాను జంట రెండు ప‌ర‌మాణువులు మ‌ధ్య అస‌మానంగా పంచుకోబ‌డితే ఆ విధంగా ఏర్ప‌డిన స‌మ‌యోజ‌నీయ బంధంను ధ్రువ‌శిల స‌మ‌యోజ‌నీయ బంధం అంటారు. విరుద్ధ ఆవేశాలున్న అణువుల‌ను ధృవాణువులు అంటారు.

ఆ ధృవ అణువుల‌లోని అణువుల మ‌ధ్య బ‌ల‌హీన ఆక‌ర్ష‌ణ బ‌లాల‌ను వండ‌ర్ వాల్ బలాలు అంటారు. స‌మ‌ యోజ‌నీయ ప‌దార్థాలు నీరు వంటి ధృవ‌శిల ద్ర‌వానిలో క‌రుగ‌వు. ఇవి సేంద్రియ ద్రావ‌ణాలు లేదా ఆ ధ్రువ ద్ర‌వ‌నాలైన బెంజీన్‌, క్లోరోఫాం, కార్బ‌న్ టెట్రాక్లోరైడ్ వంటి ద్రావ‌ణిలో క‌రుగుతాయి. ఆర్బిటాళ్ళ అంత్య అతి పాతం వ‌ల్ల సిగ్మా బంధం, పార్శ్వ అతిపాతం వ‌ల్ల‌పై 𝛑 బంధం ఏర్ప‌డుతుంది. సిగ్మా బంధం స్వ‌తంత్రంగా ఏర్ప‌డ‌గ‌ల‌దు.

𝛑 స్వ‌తంత్రంగా ఏర్ప‌డ‌దు. సిగ్మా బంధం ఉన్న‌పుడే పై బంధం ఏర్ప‌డుతుంది. ఏక బంధం ఉన్న అణువుల‌లో 𝛔 బంధాలు మాత్ర‌మే ఉంటాయి. H2,F2,CL2, BR2, BECL2, HCL వంటి అణువుల‌లో ఏక బంధాలుంటాయి. ఇథిలీన్ (C2H2),O2,CO2 వంటి అణువుల‌లో ద్విబంధాలు ఉంటాయి.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *