Types of banking system in India: ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో డబ్బు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి డబ్బు ఒక్క చోటనే ఉంటే సరికాదు. అది భారత దేశం మొత్తం సర్కిలేట్ అవుతూ ఉండాలి. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. బాగుంటుంది. డబ్బు సర్కిలేషన్ కూడా ఒక క్రమ పద్దతిలో లేకుండా జరుగుతుంటే దానికి వ్యాల్యూ ఉండదు. కాబట్టి దానికి అంటూ ఒక సిస్ట్, ఒక ప్రొసెజర్ ఉండాలని Indian banking sysetm ను 1770లో ప్రారంభించారు.
అప్పటి నుంచి ఇండియాలో బ్యాంకులు రన్నింగ్‌లోకి వచ్చాయి. ప్రతి దేశానికి బ్యాంకులకు ఒక సెంట్రల్ వ్యవస్థ ఉన్నట్టే మన దేశానికి Reserve Bank of India సెంట్రల్ బ్యాంకుగా ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో రిజర్వు బ్యాంకు అన్ని బ్యాంకులను కంట్రోల్ చేస్తూ మన ఎకానమీని సరి చూస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం బ్యాంకుల గురించి తెలుసుకుందాం. Saving account, Current account గురించి వాటి విధి విధానాల గురించి అవగాహన చేసుకుందాం.


వాస్తవానికి ఏ బ్యాంకు అయినా దాని వెనుక ముఖ్య లక్ష్యం ఏమిటంటే దేశ ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడం. వారి ఆర్థిక అవసరాలను మెరుగు పర్చడం కోసమే పని చేస్తాయి. అంటే ప్రజల డబ్బులను deposits చేయడం, వారికి అవసరమైన loans ఇవ్వడం బ్యాంకుల యొక్క పని. ఈ బ్యాంకులన్నీంటికి వాటి వాటి విధి విధానాలను అనుసరిస్తూ ప్రజలకు సేవలు చేస్తుంటాయి. కొన్ని రూరల్ ఏరియాలకు, మరికొన్ని అర్బన్ ఏరియాలకు పనిచేస్తుంటాయి.
ఇండియాలో రిజర్వు బ్యాంకు కంట్రోల్ చేసే సిస్టం నాలుగు విభాగులగా విభజించ బడింది. వీటిని Scheduled Banks అని కూడా అంటారు. ఇందులో విభాగాలను పరిశీలిస్తే …
- Commercial Banks
- Small Finance Banks
- Payment Banks
- Co- operative Banks
1.కమర్షియల్ బ్యాంక్ (Commercial Banks)
ఈ బ్యాంకులు Banking regulation act 1949 కింద పనిచేస్తున్నాయి. పేరులో కమర్షియల్ ఉంది కాబట్టి. ఈ బ్యాంకు లాభాలు ఆర్జించడమే దీని ముఖ్య లక్షణం. ఇది మళ్లీ నాలుగు విభాగాలుగా విభజించబడింది.
- Public sector banks
- Private sector banks
- Foreign banks
- Regional rural banks
1.పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో ప్రభుత్వాల వాటా అధికంగా ఉంటుంది. అందుకనే వీటిని గవర్నమెంట్ బ్యాంకులు అని కూడా అంటారు. state bank of india, bank of india, punjab national bank, bank of baroda, ఇలాంటి బ్యాంకులన్నీ ప్రభుత్వ రంగ బ్యాంకులు. మన దేశంలో బ్యాంకు అకౌంట్లన్నీ ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లోనే ఉండటం విశేషం.
2.ప్రయివేటు సెక్టార్ బ్యాంకులో అధిక శాతం వాటా ప్రైవేటు వాళ్లకు ఉంటుంది. ఇండిపెండెంట్‌గా వారి కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. వారికి ఏదైనా సమస్య వస్తే నేరుగా ఆర్బిఐతోనే డీల్ చేసుకుంటారు. ప్రయివేటు రంగ బ్యాంకులు కాబట్టి టెక్నాలజీని వాడుకోవడంలో ముందుంటారు. ATM, Mobile banking సర్వీసులు వీరి దానిలో ఎక్కువుగా ఉంటాయి. వీరి మెయిన్గోల్ అధిక వడ్డీ లతో లాభాలను ఆర్జించడం. ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే సర్వీసు ఛార్జీలు ఎక్కువుగా వసూలు చేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రయివేటు బ్యాంకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.
ప్రసుత్తం ఇండియాలో 22 ప్రయివేటు బ్యాంకులు ఉన్నాయి. AXIS BANK, HDFC BANK, KOTAK MAHINDRA BANK, ING VYSYA BANK, ICICI BANK, J&K BANK, SOUTH INDIAN BANK, INDUSLAN BANK, CATHOLIC SYRIAN BANK, KARNATAKA BANK Ltd. FEDERAL BANK, RBL BANK, IDFC FIRST BANK, CITI BANK, IDBI BANK లాంటివి ఉన్నాయి.
3.ఫారిన్ బ్యాంక్ కు సంబంధించిన ప్రధాన కార్యాలయాల్లో వారి ఇతర దేశాల్లో ఉన్నా, కొన్ని బ్రాంచీలను మాత్రం ఇండియాలో నడుపుతున్నాయి. ఈ బ్యాంకులు ఇండియాలో ఉన్న మార్గదర్శకాలు, నిబంధనలను పాటించాలి. అదే విధంగా వారి దేశంలో ఉన్న నిబంధనలనూ పాటించాల్సి ఉంటుంది. ప్రస్తతం మన దేశంలో 46 ఫారిన్ బ్యాంకులు ఉన్నాయి. వాటిలో National Australia Bank, BBK, Industrial Bank of Korea, HSBC లాంటివి మొత్తం 46 బ్యాంకులు మన దేశంలో ఉన్నాయి.


4.రిజినల్ రూరల్ బ్యాంకులు.. ఇవి కూడా కమర్షియల్ బ్యాంకులే. కాకపోతే వీటి సౌకర్యాలు రూరల్, అర్భన్ ఏరియాల సెగ్మెంట్లలో ఉంటాయి. ముఖ్యంగా వ్యవసాయం చేసుకునే రైతులకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి, డబ్బులు దాచుకునే వారికి వీరు లోన్స్ ఇస్తుంటారు. అంతేకాకుండా ప్రభుత్వ పనుల్లో కూడా పాలుపంచుకుంటారు. పెన్షన్లు అందిస్తుంటారు. Andhra Pragathi Grameena Bank, Kaveri Grameena Bank, kerala Gramin Bank ఇలాంటి గ్రామీణ బ్యాంకులు మన దేశంలో ప్రస్తుతం 43 ఉన్నాయి.
2.స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(Small Finance Banks)
చిన్న చిన్న పరిశ్రమలకు, ఒక మాదిరిగా ఉన్న పరిశ్రమలకు ఆర్థిక సాయం అందించడానికి సహాయపడేందుకు ఇలాంటి బ్యాంకులు ఇండియాలో ఏర్పాటయ్యాయి. Capital small finance bank, Au small finance bank, ఇలా మన దేశంలో 10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఉన్నాయి.
3.పేమెంట్ బ్యాంక్(Payment Banks)
ఈ పేమెంట్ బ్యాంక్స్ మన బ్యాంకింగ్ సిస్టమ్‌లో కొత్తగా వచ్చి చేరింది. 2004లో ఆర్బిఐ ఈ బ్యాంక్ యొక్క గైడ్‌లైన్స్‌ను ఇష్యూ చేసింది. ఆర్బిఐ సర్వే ప్రకారం మన దేశంలో ఇప్పటికీ 40% మందికి ఏ బ్యాంకు అకౌంటూ లేదంట. అయితే వలస కూలీలు, చిన్న రైతులు, కూలీలు, తక్కువ ఆదాయం వచ్చే ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలని రిజర్వు బ్యాంకు పేమెంట్ బ్యాంక్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కాకపోతే కొన్ని చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. ప్రజలు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ ఈ బ్యాంకుల్లో ఎవరికీ లోన్స్ ఇవ్వకూడదు. ప్రస్తుతానికి ఒక లక్ష రూపాయలు మాత్రమే ఈ బ్యాంకులో డిపాజిట్ చేసుకునే వీలుంటుంది. అలాగే ఇవి డెబిట్(debit card) కార్డులను మాత్రే ఇష్యూ చేయగలవు. బ్యాంకులు గురించి ఒక లైన్లో చెప్పాలంటే, మన డబ్బులని ఆ బ్యాంకులో ఉన్నవరికి మాత్రమే వాడుకోవాలి. ఎలాంటి లోన్సు ఇవ్వరు. ప్రస్తుతానికి మన దేశంలో ఆరు పేమెంట్ బ్యాంకులు ఉన్నాయి. airtel payments bank, fino payments bank, paytm payments bank ఇలా ఆరు ఉన్నాయి.


4.కో-ఆపరేటివ్ బ్యాంక్(Co- operative Banks)
ఈ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లు పైన తెలిపిన బ్యాంకులకు కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ బ్యాంకులు ఎలా ఏర్పడతాయి అంటే? ఒక సెక్టార్ పీపుల్స్ కలిసి వీటిని స్టార్ట్ చేస్తారు. ఇందులో డిపాజిట్ చేసిన వారే ఈ బ్యాంకులకు మెంబర్స్‌గా ఉంటారు. విచిత్రమేమిటంటే ఈ బ్యాంకులకు ఆ మెంబర్సే ఓనర్లు కూడా అవుతారు. పరస్పర సహకారంతో ఈ బ్యాంకులు నడుస్తాయి. ఈ మెంబర్స్ ఓటింగ్ సిస్ట్ం ద్వారా వాళ్ల బోర్డు మెంబర్‌ను ఎన్నుకుంటారు. అలా ఎన్నికోబడిన బోర్డు మెంబర్సే ఈ బ్యాంకులను నిర్వహిస్తుంటారు. అంటే మెంబర్షిప్ రూపంలో వ్యాపారులకు, రైతులకు లోన్స్ రూపంలో ఇస్తుంటారు. ఈ బ్యాంకులు ఇంతముందు వరకు డ్యూవల్ కంట్రోల్ లో ఉండేవి. RBI, Registr of co-operative societies ఈ రెండు బ్యాంకుల ఆధ్వర్యంలో నడిచేవి. కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో కొన్ని మోసాలు జరగడంతో ఇప్పుడు ఆర్‌బిఐనే చూసుకుంటుంది. ప్రస్తుతం స్టేట్ & అర్బన్ కలిపి 80కిపైగా బ్యాంకులు కలిగి ఉంది.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!