Types of Bail | తెలిసో తెలియకో కొంత మంది Police caseల్లో ఇరుక్కుంటారు. ఆ సమయంలో వెంటనే గుర్తుకు వచ్చేది, మదిలో మెదిలేది బెయిల్. బెయిల్ పొందడం ఎలా అని ఆలోచిస్తుంటారు. ఏదైనా కేసులో పోలీసులు అరెస్టు చేస్తే బెయిల్ ఎలా పొందాలనేది చాలా మందికి తెలియకపోవచ్చు. ఏదైనా కేసులో అరెస్టు అయితే వారిని నిందితులుగా భావించి పోలీసులు Courtలో హాజరుపరుస్తారు. సదరు వ్యక్తులను జడ్జి Remandకు పంపుతారు. రిమాండ్ నుండి నిందితులకు మినహాయింపు కల్పించే సదుపాయాన్నే బెయిల్ అంటారు. CRP Section 436,437,438,439 సెక్షలను ఉపయోగించి నిందితులకు కోర్టు బెయిల్ ఇస్తుంది.
బెయిల్ నాలుగు రకాలు(Types of Bail)-
1)Bail-in bailable offense
2)Bailable and Non-Bailable Offences
3) Anticipatory Bail
4)Station Bail
Bail in bailable offence
నేరం చేసిన వ్యక్తికి స్థానిక న్యాయస్థానంలో సులభంగా ఈ బెయిల్‌ను పొందవచ్చు. ఎవరినైనా కొట్టి గాయపర్చడం, వరకట్న వేధింపులు, చిన్నపాటి తగువులు, ప్రమాదాలు, మహిళలపై వేధింపులు, జూదాలు, ఆస్తి తగాదాలు ఇటువంటి నేరాల్లో నిందితులకు బెయిలబుల్ అఫెన్సీ ద్వారా బెయిల్ వస్తుంది. ఈ నేరాల కింద అరెస్టు కాబడిన వ్యక్తులు న్యాయవాది సహాయంతో కోర్టులో ఫిటిషన్ వేసుకోవచ్చు. దీనిపై కోర్టులో వాదనలు విన్నతర్వాత న్యాయమూర్తి సంతృప్తి చెందితే బెయిల్ మంజూరు చేస్తారు. ఇద్దరు జామీనుదారులు తమ ఇల్లు, స్థలం, పొలం హామీగా పెట్టాల్సి ఉంటుంది. నిందితుడు కోర్టు వాయిదాలకు హాజరు కాకపోతే జామీనుదారులు బెయిల్ ఇచ్చే సమయంలో పూచికత్తు చెల్లించాల్సి ఉంటుంది.
Bailable and Non-Bailable Offences
బెయిల్ ఇవ్వదగని నేరాలలో అరెస్టు కాబడి రిమాండ్ తర్వాత స్థానిక కోర్టులో బెయిల్ ఇవ్వకపోవడమే నాన్ బెయిలబుల్ అఫెన్సెస్(నాన్ బెయిల్) అంటారు. హత్యలు, హత్యాయత్నం, వరకట్న వేధింపుల్లో చనిపోవడం,దోపిడీ, చంపి దోచుకోవడం, దొంగతనం, మోసం వంటి నేరాలు దీని కిందకు వస్తాయి. ఈ తరహా నేరాలకు పాల్పడినప్పుడు నేర తీవ్రతను బట్టి స్థానిక న్యాయస్థానాలు, మరీ నేర తీవ్రత అయితే జిల్లా కోర్టుల్లో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నిందితులకు బెయిల్ వచ్చే వరకు రిమాండ్‌లో ఉంటారు. నిందితుడు తరపు న్యాయవాదులు జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ వేసి తమ వాదనలను వినిపిస్తారు. Victim పెట్టిన కేసు, తనకు జరిగిన అన్యాయాన్ని పరిగణలోకి తీసుకొని నిందితుడికి షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయమూర్తి మంజూరు చేస్తారు. ఈ బెయిల్‌కు కూడా ఇద్దరు జామిందారులు హామీగా ఉండటంతో పాటు ఇల్లు, స్థలం కోర్టుకు హామీలో సమర్పించాలి.
Anticipatory Bail
యాంటిసిపెటరీ బెయిల్ అంటే ఏదైనా నేరం చేసిన వారు పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పర్చేలోగా అరెస్టు కాకుండా ఉండేదుకు కోర్టు ద్వారా పొందే బెయిల్‌ను ముందస్తు బెయిల్(Section 438 of CR.P.C) అంటారు. నేరం చేయడం లేదా నేరంలో ఇరుకునే సమయంలో జామీనుదారుడ్ని ఏర్పాటు చేసుకొని కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందవచ్చు. అయితే అన్ని నేరాల్లో ముందస్తు బెయిల్ రాదు. జడ్జి గారు నేరం తీవ్రతను బట్టి ముందస్తు బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటారు. ఒక్కొక్కసారి నేరస్థుడు ముందస్తుగా కోర్టులో గానీ, పోలీసుల ఎదుట గాని లొంగిపోయి అరెస్టు కాబడితే వారి ద్వారా బెయిల్ ఇచ్చే నిబంధనలు కూడా ఉంటాయి.

Station Bail
జూదాలు(పేకాట), ప్రమాదాల సమయంలో కేసుల్లో అదుపులోకి తీసుకున్న వ్యక్తులకు పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇచ్చే బెయిల్‌ను స్టేషన్ బెయిల్ అంటారు. CR.P.C లో చేసిన సవరణల ప్రకారం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలకు స్టేషన్ బెయిల్ ఇవ్వవచ్చు. అయితే దొంగతనం, దోపిడీ వంటి తీవ్ర నేరాల్లో నిందితుడు సాక్షులను బెదిరిస్తాడని లేదా తప్పించుకు పోతాడని పోలీసులు భావిస్తే వారికి న్యాయస్థానాల్లో రిమాండ్ విధిస్తారు. ఈ బెయిల్ పొందిన వారికి పోలీసులు నోటీసులు ఇచ్చి కోర్టుకు హాజరు కావాలని సూచిస్తారు. ఏదైనా నేరంలో పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పర్చిన తర్వాత రిమాండ్ విధించబడి బెయిల్ పొందడానికి స్థోమత లేనివారు Public Prosecutor (ప్రభుత్వ న్యాయవాది) సహాయంతో కోర్టులో వాదనలు వినిపించి బెయిల్ పొందే అవకాశం ఉంది.
బెయిల్ అంటే రిలీజ్ చేయడం. ఎవరిపైనైనా కేసు నమోదు చేసిన తర్వాత ఆ కేసులో అరెస్టు కాబడినప్పుడు ఆ వ్యక్తి బయటకు రావడానికి బెయిల్ ప్రొసెస్‌ను అనుసరిస్తుంటాడు. ముందుగా బెయిల్ అప్లికేషన్ పూర్తి చేయడం దాని ప్రాసెస్, నిబంధనలు అనుసరించడం తర్వాత బయటకు రావడం జరుగుతుంది.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!