types of Income

types of Income: మీలో ఎవ‌రు కాబోయే కోటేశ్వరుడు తెలుసుకోండి!

Bank Impramation
Share link

types of Income: ప్ర‌పంచంలో ఎక్క‌డైనా, ఎవ‌రైనా, చ‌ట్ట‌బ‌ద్ధంగా, న్యాయ‌బ‌ద్ధంగా సంపాదించేవారు ఏడు ర‌కాలుగా సంపాదిస్తారు. కొంత మంది ఒకే ర‌కంగా సంపాదిస్తే, కొంత మంది రెండు, మూడు ర‌కాలుగా సంపాదిస్తూ ఉంటారు. అయితే ఎవ‌రు ఎలా సంపాదించినా ఈ ఏడింట్లో ఏదో ఒక మార్గం ద్వారానో, రెండు మూడు మార్గాల్లోనో సంపాదిస్తారు. ముఖ్యంగా ధ‌న‌వంతులు ఒక‌టి క‌న్నా ఎక్కువ ఆధాయం (Multiple Income Sources) మార్గాల్లో సంపాదిస్తూ ఉంటారు. అవి ఏమిటో ఇప్పుడూ కింద క‌థ‌నం(types of Income)లో చూద్ధాం.

Earned Income(సంపాదించిన‌ ఆదాయం)

ఒక సాధార‌ణ కార్మికుడు నుండి ఒక కంపెనీ సిఇఓ వ‌ర‌కు ఉద్యోగ‌స్తులా ప‌నిచేస్తూ జీతం తీసుకునే ప్ర‌తి ఒక్క‌రూ ఈ కేట‌గిరిలోకి వ‌స్తారు. వృత్తి నిపుణులైన డాక్ట‌ర్లు, న‌ర్సులు, లాయ‌ర్లు ఈ కోవాలోకే వ‌స్తారు. ఈ ఆధాయాన్ని క్రియాశీల ఆదాయం (Active Income) అని అంటారు. ప్ర‌పంచంలో ఎక్కువ మంది ఆదాయం పొందేది, బిలియ‌నీర్లు త‌మ ప్ర‌యాణాన్ని ప్రారంభించిది ఈ ఆదాయం మార్గంలోనే. దుర‌దృష్ట‌వ‌శాత్తు, ఎక్కువ ఆదాయం ప‌న్ను క‌ట్టేది కూడా ఈ కేట‌గిరి వాళ్లే. సంవ‌త్స‌రాదాయం ఎక్కువ ఉన్న కొంత మంది దాదాపు 30 శాతం దాకా ప్ర‌భుత్వానికి ప‌న్నుల రూపంలో స‌మ‌ర్పించుకుంటారు.

లాభాల ద్వారా వ‌చ్చే ఆదాయం (Profit Income)

మ‌నం ఏదైనా వ‌స్తువును త‌యారు చేసి, త‌యారీ ఖ‌ర్చు కంటే ఎక్కువ ధ‌ర‌లో అమ్మిదే వ‌చ్చే ఆదాయాన్ని ప్రాఫిట్ ఇన్‌కం అంటారు. ఒక ఇడ్లి బండి వాడు ఇడ్లీలు అమ్మినా, ఒక బిర్లా సిమెంట్ బ‌స్తాలు అమ్మినా లాభాల కోస‌మే. ఈ కేట‌గిరిలో భౌతికంగా క‌న‌ప‌డే వ‌స్తువులు లేదా డిజిట‌ల్ రూపం (Digital Form) క‌ల వ‌స్తువులు (కంప్యూట‌ర్ ప్రోగ్రాములు, సాఫ్ట్ వేర్ మొద‌లైన‌వి) కూడా ఉండ‌వ‌చ్చు. ఈ స్టేజీని కొంత మంది Employee to enterpreneur stage అని కూడా అంటారు.

వ‌డ్డీ ద్వారా వ‌చ్చే ఆదాయం (Interest Income)

మ‌నం బ్యాంక్‌లో కానీ, ఏదైనా సంస్థ‌లో కానీ డిపాజిట్ చేస్తే వ‌చ్చే వ‌డ్డీ, బాండ్ల‌లో పెట్టుబ‌డి మీద వ‌చ్చే వ‌డ్డీ, ఎవ‌రికైనా ఇచ్చిన అప్పుపై నెలా నెలా వ‌చ్చే వ‌డ్డీ ఈ కేట‌గిరిలోకి వ‌స్తాయి.

డివిడెండ్ల (Dividend) ద్వారా వ‌చ్చే ఆదాయం

types of Income: కొంత మంది షేర్ మార్కెట్‌లో పెట్టుబ‌డి పెడుతుంటారు. అంటే స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన ఏదైనా కంపెనీ యొక్క షేర్లు కొనుక్కుంటారు. షేరు కొన‌డ‌మంటే ఆ కంపెనీలో ఒక భాగ‌స్వామి క్రిందే లెక్క‌. రిల‌య‌న్స్‌, మారుతి లాంటి కంపెనీలు సంవ‌త్స‌రాంతంలో లేదా త్రైమాసికంలో త‌మ ఆర్థిక ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తూ త‌మ లాభాల్లో కొంత భాగాన్ని షేర్ హోల్డ‌ర్స్‌కు పంచుతుంటారు డివిడెండ్ల రూపంలో. ఇక్క‌డ కూడా ఎటువంటి ప్ర‌త్య‌క్ష ప‌ర్య‌వేక్ష‌ణ (Direct Monitoring) అవ‌స‌రం లేదు. అందుక‌ని ఇది కూడా Passive ఇన్‌కంగా చెప్ప‌బ‌డుతుంది.

See also  e-RUPI అంటే ఏమిటి? మొబైల్ ఫోన్ అవ‌స‌రం లేకుండా ప‌నిచేస్తుందా! నిజ‌మెంత‌?

అద్దెల (Rent House) ద్వారా వ‌చ్చే ఆదాయం

మ‌న‌కున్న ఏదైనా ప్రాప‌ర్టీ (ఇల్లు, ఫ్లాటు, షాపు లేదా ఖాళీ స్థ‌లం) ని అద్దెకివ్వ‌డం లేదా లీజుకివ్వ‌డం ద్వారా వ‌చ్చే ఆదాయాన్ని ఈ కేట‌రిలోకి చేర్చ‌వ‌చ్చు. అయితే రియ‌ల్ ఎస్టేట్ కాకుండా వాహ‌నాలు లేదా ఏవైనా వ‌స్తువులు అద్దెకివ్వ‌డం ద్వారా కూడా చాలా మంది ఆదాయం పొంద‌డం మ‌న‌కు తెలిసిందే.

క్యాపిట‌ల్ గెయిన్స్ (Capital Gains)

మ‌నం సంవ‌త్స‌రం క్రితం 10 ల‌క్ష‌లు పెట్టి ఒక ప్లాటు కొన్నాం. ఇప్పుడు దాన్ని 16 ల‌క్ష‌ల‌కు అమ్మ‌డం జ‌రిగింది. అంటే 6 ల‌క్ష‌లు లాభం. కొన్నాళ్ల క్రితం రిల‌య‌న్స్ 100 షేర్లు 900 రూపాయ‌ల‌కు అంటే మొత్తం 90000 రూపాయ‌లు పెట్టి కొన‌డం జ‌రిగింది. పోయిన నెల‌లో(అప్పుడు) ఒక్కో షేర్ రూ.1200 చొప్పున మొత్తం 100 షేర్లు 1,20,000 రూపాయ‌ల‌కు అమ్మ‌డం జ‌రిగింది. అంటే 30000 రూపాయ‌ల లాభం. ఇలా వ‌చ్చే లాభాల్ని క్యాపిట‌ల్ గెయిన్స్ అని అంటారు. వీటి మీద విధించే ప‌న్ను శాతం చాలా త‌క్కువ‌.

types of Income: రాయ‌ల్టీ ద్వారా వ‌చ్చే ఆదాయం లేదా అవ‌శేష ఆదాయం

ఏవైనా వ‌స్తువులు కానీ, సేవ‌లు కానీ, ఐడియాలు కానీ ఇత‌రులు ఉప‌యోగించుకుంటే చెల్లించే డ‌బ్బును రాయ‌ల్టీ ఇన్క‌మ్ అంటారు. ఇది నిరంత‌రాయంగా జ‌రిగే ప్ర‌క్రియ‌. యండ‌మూరి వీరేంధ్ర‌నాథ్ పుస్త‌కాలు మీరు చ‌దివే ఉంటారు.ప్ర‌పంచంలో మీరు ఎక్క‌డినుండైనా ఆయ‌న పుస్త‌కం డైరెక్టుగా కొన్నా, ఆన్‌లైన్‌లో కొన్నా ఆయ‌న‌కి డ‌బ్బులు వ‌స్తాయి. ఆయ‌న‌కే కాదు, ఏ ర‌చ‌యిత పుస్త‌కాల‌కైనా. అలాగే మ‌నం Youtubeలో చూసే ప్ర‌తి ప్రోగ్రాం ద్వారా దాన్ని సృష్టించిన ఆ Youtuber కు ప్ర‌తీ సారి (జీవితాంతం) రెవెన్యూ చెల్లిస్తూ ఉంటారు. ఆ మాట కొస్తే మ‌రణించిన త‌ర్వాత కూడా వారి వార‌సుల‌కు చెల్లిస్తారు. అదే విధంగా సంగీతం. ఆ సంగీతాన్ని ఎవ‌రైనా విన్నా, లేదా ఎక్క‌డైనా ఉప‌యోగించుకున్నా ఆ సంగీత క‌ళాకారుడికి డ‌బ్బు చెల్లిం చ‌డం జ‌రుగుతుంది. ఇలా నిరంత‌రాయంగా జ‌రిపే చెల్లింపుల‌ను రాయ‌ల్టీ ఇన్క‌మ్ అంటారు.

Leave a Reply

Your email address will not be published.