two wheeler driving: ట్యాంకులో పెట్రోలుంది కదా అని మోటారు సైకిలో, స్కూటరో ఎక్కి రోడ్డు మీద రయ్‌మంటూ ఇష్టానుసారం చక్కర్లు కొట్టాలనుకుంటే కుదరదండోయ్!. రోడ్డు మీద బండి నడపాలంటే కొన్ని డాక్యుమెంట్లు తప్పనిసరిగా వెంట ఉండాల్సిందే. లేకపోతే ట్రాఫిక్ పోలీసులకో, రవాణా అధికారులకో అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తుంది. ఒక్కోసారి వాహనం సీజ్ చేసినా చేస్తారు. అందుకే మోటారు సైకిల్(two wheeler driving) నడిపేటప్పుడు కిందివాటిని వెంట ఉంచుకోండి.
Driving License
మోటారు వాహన చట్టం ప్రకారం వాహనం నడపడానికి లైసెన్స్ తప్పనిసరి. అది లేకుండా వాహనం నడిపితే ట్రాఫిక్ పోలీసులు రూ.500 నుంచి రూ.1500 వరకూ జరిమానా విధించవచ్చు. లైసెన్స్ లేకుండా నడిపిన వ్యక్తికి రూ.500, లైసెన్స్ లేని వ్యక్తికి వాహనాన్ని ఇచ్చినందుకు వాహన యజమానికి రూ.1000 జరిమానా విధించవచ్చు.
L board ఉంటే!
లెర్నింగ్ లైసెన్స్ ఉంది కదా అని వాహనానికి ఎల్ బోర్డు తగిలించి, సింగిల్‌గా బండి నడిపితే కుదరదు. వెనుక పర్మినెంట్ లైసెన్స్ ఉన్న వ్యక్తి ఉండి తీరాల్సిందే. లేకుంటే లెర్నింగ్ లైసెన్స్ ఉన్నా, లైసెన్స్ లేనట్టుగా పరిగణించి, జరిమానా వేయవచ్చు.
Insurance
వాహనానికి ఇన్సూరెన్స్ చేయించడం తప్పనిసరి. ఇది లేకుండా బండి నడిపితే రూ.1000 వరకూ జరిమానా తప్పదు. ఇన్సూరెన్స్కు కాలపరిమితి ముగిసినా ఫైన్ విధిస్తారు.
RC
బండి నడిపేటప్పుడు వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) ఉండితీరాలి. ఇది లేకుండా బండి నడిపితే రూ.100 నుంచి రూ.200 వరకూ ఫైన్ వేస్తారు. పోలీసులకు అనుమానం వస్తే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు కూడా. మళ్లీ ఒరిజనల్ ఆర్‌సీ తీసుకెళ్లి చూపిస్తేనే బండిని అప్పగిస్తారు.
Pollution Certificate
వాహనం నుంచి కాలుష్య ఉద్గారాలు పరిమితికి మించి విడుదల కాకూడదు. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ తీసుకుని కూడా ఉంచుకోవడం తప్పనిసరి. ఇది లేకుండా వాహనం నడిపితే రూ.1000 ఫైన్ వేస్తారు.


Helmet
ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. ఊహించని విధంగా ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు శిరస్సుకు హెల్మెట్ రక్షణనిస్తుంది. హెల్మెట్ లేకుంటే జరిమానా తప్పదు. తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హెల్మెంట్ ధరించడం తప్పనిసరి.
గమనిక (two wheeler driving) : నిబంధనల ప్రకారం జిరాక్స్ ప్రతులు చెల్లవు. బండి నడిపే సమయంలో ఒరిజినల్ డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధనలన్నీ మన రక్షణ కోసమేనన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. వీటిని తప్పనిసరిగా పాటించాలి.