Encounter : మహారాష్ట్రలో ఎన్కౌంటర్ జరిగిన ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బుధవారం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులు తారసపడటంతో ఎదరు కాల్పులు చోటు చేసుకున్నాయి.
Encounter : మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది మహారాష్ట్రలో. తాజా సమాచారం మేరకు గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎటపల్లి అటవీ ప్రాంతంలో కాల్పులు జరిఆయి. ఈ సమయంలో కూంబింగ్‌కు వెళ్లిన పోలీసులకు నక్సల్స్ ఎదురుపడ్డారు. అప్రమత్తమైన మావోయిస్టులు పోలీసులపై కాల్పులకు దిగారు. పోలీసులూ ఎదురు కాల్పులకు దిగారు. అయితే ఈ కాల్పుల్లో మావోయిస్టులకు ప్రాణనష్టం జరిగినట్టు గుర్తించామని, వారికి చెందిన సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని గడ్చిరోలి జిల్లా ఎస్పీ అంకిత్ గోయల్ వెల్లడించారు. రెండ్రోజుల కిందట గడ్చిరోలి జిల్లాలోని పెర్మిలి ప్రాంతంలో నక్సల్స్ 4 ట్రాక్టర్లు, 2 ట్యాంకర్లకు నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. మహారాష్ట్రలో గత నెలలో కూడా భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అదే గడ్చిరోలి జిల్లా ఖురుకేడ తాలూక కొబ్రామెండలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించినట్టు తెలిసింది. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్టు పోలీసులు ధృవీకరించారు. ఈ ఎన్కౌంటర్ తెల్లవారుజామున చోటు చేసుకుంది.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court