Swimming Pond

Swimming Pond : కొత్త సైకిళ్ల‌తో వెళ్లి విగ‌త‌జీవులుగా మారి!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

Swimming Pond : కొత్త సైకిళ్ల‌తో వెళ్లి విగ‌త‌జీవులుగా మారి!

Swimming Pond : ఈత‌కెళ్లి ఇద్ద‌రు చిన్నారులు గ‌ల్లంతైన సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ప‌రిధిలోని డీకే ప‌ల్లెలో బుధ‌వారం చోటుచేసుకుది. చెరువు వ‌ద్ద విద్యార్థుల‌కు సంబంధించిన సైకిళ్లు, బ‌ట్ట‌లు ఉండ‌టంతో చిన్నారుల కోసం చెరువులో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు పోలీసులు.

చిన్నారులు గ‌ల్లంతైన చెరువు

కుప్పం ప‌ట్ట‌ణం కొత్త‌పేటకు చెందిన శ్రీ‌ప‌తి కుమారుడు మురారి, జ‌య‌ప్ర‌కాష్ రోడ్డుకు చెందిన కుమార్ కుమారుడు జ‌య‌సూర్య స్థానిక ఎస్‌.బి.ఎం స్కూల్లో 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నారు. కాగా మంగ‌ళ‌వారం ఇద్ద‌రి చిన్నారుల‌కు సైకిళ్ల‌ను కొనిచ్చారు. ఇంటికొచ్చిన చిన్నారులు కంప్యూట‌ర్ సెంట‌ర్ కు వెళ్లి వ‌స్తా మ‌ని సైకిళ్లు తీసుకొని డీకేప‌ల్లి చెరువు గ‌ట్టుపై సైకిళ్లు ఉంచి చెరువులో నీళ్లు పోసుకునేందుకు దిగి మునిగిపోయారు.

మృతిచెందిన చిన్నారులు

చెరువు గ‌ట్టుపై రెండు సైకిళ్ల‌తో పాటు చిన్నారుల‌కు చెందిన బ‌ట్ట‌లు, చెప్పులు ఉండ‌టాన్ని గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చారు. ఫైర్ సిబ్బంది చెరువులోకి దిగి చిన్నారుల మృత‌దేహాల‌ను వెలికితీశారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *