Khammam : తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో కరోనా మహమ్మారి భయాందోళన కలిగిస్తోంది. నగరంలోని ఇద్దరు యువ జర్నలిస్టులు కరోనాతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
Khammam : ఖమ్మంలో జర్నలిస్టులపై కరోనా పగ బట్టినట్టనిపిస్తుంది. అందరితో కలిసి మెలిసి ఉండి వార్తలు రాసిన సహచర జర్నలిస్టుల మిత్రులు ఒక్కొక్కరిగా కరోనా కాటుకు బలవ్వడం కలవరపాటుకు గురిచేస్తుంది. శనివారం ఒక్కరోజే ఖమ్మం పట్టణంలో ఇద్దరు యువ జర్నలిస్టులు కరోనాతో చనిపోవడం తోటి జర్నలిస్టుల్లో విషాదం అలుముకుంది. ఖమ్మం నగరానికి చెందిన యువ జర్నలిస్టు తలారి శ్యామ్ ప్రాణాలు కోల్పోయాడు. వారం రోజుల కిందట కరోనా లక్షణాలు కనిపించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నారు. టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. గతంలో ఊపిరితిత్తుల సమస్య ఉండటంతో కరోనా వల్ల అది తీవ్రమై శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో శనివారం కన్ను మూశారు. శ్యామ్ గతంలో సూర్య, మనం పత్రికల్లో విలేకరిగా పనిచేశారు.
మరో జర్నలిస్టు అయిన అర్వపల్లి వెంకటేశ్వర్లు కూడా కరోనాతో శనివారమే మృతి చెందారు. వెంకటేశ్వర్లు ఇటీవల కరోనా బారిన పడ్డారు. చికిత్స తీసుకుంటున్న క్రమంలో శనివారం ప్రాణాలు వదిలారు. అతనిది కూసుమంచి గ్రామం కాగా, భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తతుం ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గతంలో ఆంధ్రజ్యోతి తో పాటు పలు పత్రికల్లో పనిచేశారు.
సంతాపం తెలిపిన టీయూడబ్ల్యూజే
ఖమ్మంలో జర్నలిస్టుల మృతి పట్ల టీయూడబ్ల్యూజే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యువ జర్నలిస్టులు కరోనాతో చనిపోవడంతో తీవ్ర సంతాపం ప్రకటించింది. తలారి శ్యామ్ చిన్నవయసులోనే మృత్యువు కబళించడంతో యూనియన్ నేతలు ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబాన్ని ప్రెస్ అకాడమీ ద్వారా అన్ని విధాలుగా ఆదుకుంటామని యూనియన్ అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ప్రకటించారు. శ్యామ్, వెంకటేశ్వర్లు మృతి పట్ల టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇస్మాయిల్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, అడపాల నాగేందర్ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!