Bijapur Encounter : విషాదం పెళ్లి ముచ్చట తీరకుండానే అమరులైన జవాన్లు
Bijapur Encounter : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. విజయనగరం పట్టణానికి చెందిన సీఆర్ఫీఎఫ్ జవాన్ రౌతు జగదీశ్ (27) కు పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలలో జీవిత భాగస్వామితో ఏడడుగులు నడిచేందుకు సిద్ధమయ్యారు. వచ్చే నెలలో వివాహం కానుండటంతో ఒకటి రెండ్రోజుల్లో ఇంటికి రావాలనుకున్నారు. అంతలోనే నక్సల్ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం అలుముకుంది.

గాజులరేగ ఎగువ వీధికి చెందిన రౌతు సింహాచలం, రమణమ్మ దంపతుల కుమారుడైన జగదీశ్ డిగ్రీ వరకు చదువుకున్నారు. దేశ సేవలో తరలించాలని తలించారు. అదే స్ఫూర్తితో 2010లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా ఎంపికయ్యారు. మంచి శరీర సౌష్టవం, చురుకుగా కదిలే నైజంతో కోబ్రాదలం లీడర్ గా నియమితులయ్యారు. వచ్చే నెలలో పెళ్లికి కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 22న వివాహం నిర్ణయించారు. పెళ్లి పనులు చూసు కునేందుకు ఈ నెల 5న ఇంటికి వస్తానని జగదీశ్ రెండ్రోజుల కిందటే తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. ఈ లోగా ఘోరం జరిగిపోవడం విచారకరం.
గత శనివారం బీజాపూర్ లో సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్ జీ భద్రతా దళాలతో కలిసి కూంబింగ్ చేస్తున్న సమయంలో మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. రౌతు జగదీశ్ మృతి చెందాడనే వార్తతో విజయనగరం జిల్లా గాజుల రేగ, మక్కువ మండలం కంచేడు వలసలో విషాదం అలుముకుంది. కుమారుడు మరణ వార్త విన్న తల్లిదండ్రులిద్దరూ కన్నీరుమున్నీరువుతున్నారు. వారి రోదనతో ఆ ప్రాంత వాసులు కన్నీరు పెట్టుకున్నారు.

ఇదే ఘటనలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన కోబ్రా కమాండర్ శాఖమూరి మురళీ కృష్ణ (34) మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో అమరుడయ్యారు. శాకమూరి రవి, విజయ దంపతులకు వెంకటమోహన్, మురళీకృష్ణ సంతానం. మురళీ కృష్ణ 2010 లో సీఆర్పీఎఫ్ కు ఎంపికయ్యాడు. ఆయనకు పెళ్లి చేయాలనే ఉద్ధేశంతో ఇటీవలే ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. ఈ వేసవిలో వివాహం జరిపించేందుకు కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. 2 నెలల కిందట ఇంటికి వచ్చిన మురళీ కృష్ణ ఈ సారి పెళ్లి చేసుకునేందుకు వస్తానని బంధువులు, స్నేహితులకు చెప్పాడు. ఇంతలోనే ఛత్తీస్‌గఢ్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో మురళీకృష్ణ మృతి చెందినట్టు సీఆర్పీఎఫ్ అధికార వర్గాలు ధ్రువీకరించాయి.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి