Twitter Employees: ప్రపంచ వ్యాప్తంగా పలువురు సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు నిత్యం వాడే సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్విట్టర్‌ను ప్రపంచ కుబేరుడు Elon Musk భారీ డీల్‌తో కొనుగోలు చేసి సొంతం చేసుకున్న విషయం విధితమే. ట్విట్టర్‌ను మస్క్ 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేశాడంట. అయితే అది కొన్నప్పటి నుంచి వింత పోకడలతో, షరతులతో నెటిజన్లను కాస్త ఇబ్బందులకూ గురిచేస్తున్నాడనేది తెలుస్తూనే ఉంది. ఎప్పుడైతే ఎలాన్ ట్విట్టర్‌ను కొన్నాడో CEO పరాగ్ అగర్వాల్ అనే ఇండియా వ్యక్తిని తొలగించాడు. అతని తో పాటు మరో ముగ్గురును కూడా తొలగించాడు.
ఇక ఇప్పుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ ను రద్దు చేసి తానే ఒకే ఒక్క డైరెక్టర్‌గా మారారు. ట్విట్టర్‌ను రోజురోజుకూ ప్రక్షాళన చేస్తున్నారు. అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్‌లో పనిచేసే ఉద్యోగుల్లో సగం మందిని తొలగించనున్నట్టు బాంబ్ పేల్చాడు. దీనిని అనుసరిస్తూ శుక్రవారం ఉదయం పలువురి ఉద్యోగులకు ఈ-మెయిల్‌లు ద్వారా నోటీసులు వెళ్లినట్టు సమాచారం. ఈ #ట్విట్టర్ కంపెనీలో పనిచేసే 3700 మంది ఉద్యోగుల (Twitter Employees)ను తొలగించాలని మస్క్ కంకణం కట్టుకున్నారట. పనిలో పనిగా ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ చర్యలను చేపడుతున్నారట.
Twitter Employees: ఇక్కడే వచ్చింది చిక్కు!
ఎలాన్ మస్క్‌కు ఇక్కడే వచ్చాయి ఇప్పుడు చిక్కులు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగం నుండి డైరెక్ట్‌గా తొలగించడాన్ని కార్మిక చట్టాలను ఉల్లంఘించడమేనని భావిస్తూ గురువారం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు అయినాయట. ఫెడరల్ వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ #యాక్ట్ ప్రకారం కనీసం 60 రోజుల ముందస్తు న ఓటీసులు లేకుండా ఉద్యోగాలను తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కార్మిక చట్టాలను కట్టుబడి ఉండాలని ట్విట్టర్‌ను ఆదేశించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని న్యాయవాది షానన్ లిస్ రియోర్డాన్ పేర్కొన్నారు. అయితే Musk కంపెనీ అయిన టెస్లా నుండి కూడా గత జూన్‌లో 10 శాతం ఉద్యోగులను తొలగించినప్పుడు కూడా ఇదే విధంగా పిటిషన్ దాఖలైందంట.


ఇప్పటి వరకు ఉచితంగా సేవలు అందించిన Twitter ఇప్పుడు డబ్బులు వసూలు చేసే పనిలో పడింది. ట్విట్టర్‌లో బ్లూ టిక్ (Blue Tick) ఉంటే నెలకు 8 డాలర్లు చెల్లించాలని ఎలాన్ స్పష్టం చేశారు. ట్విట్టర్‌లో ఉన్న ఉద్యోగులను తొలగించి ఆ స్థానాల్ని టెస్లా, న్యూరాలింక్ నుంచి వచ్చే ఉద్యోగులతో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.