TV5 Chairman | ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరును ఆక్షేపిస్తూ హైకోర్టులో పిటిషన్ వేసినట్టు టివి5 ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) తెలిపారు. ఎటువంటి ఎఫ్ఐఆర్ వివరాలను వెల్లడించకుండా అరెస్టులు, రిమాండ్లు జరుగుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే బీఆర్ నాయుడు దాఖలు చేసిన పిటిషన్పై తమ వాదనలను న్యాయవాది ఉమేష్ చంద్ర వినిపించారు. 167 సీఆర్పీసీ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న ఉమేష్ చంద్ర వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.
పోలీసుల చర్యలను పరిగణలోకి తీసుకోకుండా రిమాండ్ విధించడం హక్కులను భంగపర్చడమేనని, అభియోగాల వివరాలు నిందితులను తెలియజేకపోవడం చట్ట ఉల్లంఘనే అవుతుందని హైకోర్టు తెలిపింది. ఏపీలో ఇష్టారీతిన రిమాండ్లు విధించడం కుదరదని తేల్చింది. దిగువ స్థాయి జడ్జిలు విచక్షణతో నిర్ణయం తీసుకోవాలని టివి5 ఛైర్మన్(TV5 Chairman) బీఆర్ నాయుడు పిటిషన్పై ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
ఎఫ్ఐఆర్ నమోదైన 24 గంటల్లో అప్లోడ్ చేయాలని ఆదేశం జారీచేసింది. ఎలా పడితే అలా కేసులు పెడితే కుదరదని వార్నింగ్ ఇచ్చింది. విచక్షణ లేకుండా రిమాండ్కు ఆదేశిస్తే బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తే మెజిస్ట్రేట్లపై శాఖాపరమైన చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!