Tv Actres Chetana Raj

Tv Actres Chetana Raj: ప్లాస్టిక్ స‌ర్జ‌రీ ఫెయిల‌వ్వ‌డంతో క‌న్న‌డ టీవీ న‌టి మృతి

Spread the love

Tv Actres Chetana Raj | ప్లాస్టిక్ స‌ర్జ‌రీ ఫెయిల‌వ్వ‌డంతో బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో క‌న్న‌డ టీవీ న‌టి చేత‌న రాజ్ మృతి చెందింది. 21 సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉన్న Tv Actres Chetana Raj మే 16న కొవ్వు త‌గ్గించుకునే శ‌స్త్ర చికిత్స చేయించుకుంది. బెంగ‌ళూరులోని రాజాజీన‌గ‌ర్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో ఈ Cosmotic surgery చేయించుకుంది. స‌ర్జ‌రీ త‌ర్వాత ఆమె శ్వాస తీసుకోవ‌డంలో కొంత ఇబ్బంది ఎదుర్కొంది. ఆమె ఊపిరితిత్తుల‌లో ద్ర‌వం పేరుకుపోయింద‌ని, దీంతో ఆమె ఊపిరి పీల్చుకోలేక చ‌నిపోయిన‌ట్టు స్థానిక మీడియ‌ నివేదిక‌లు సూచిస్తున్నాయి.

ఆమె surgery చేయించుకున్న ఆసుప‌త్రిలో క‌నీసం ICU కూడా అందుబాటులో లేదు. వెంట‌నే ఆమెను మంజునాథ్ న‌గ‌ర్లోని కాడే ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే న‌టి మృతి చెందిన‌ట్టు వైద్యులు నిర్థారించారు.కొన్ని వార్త‌ల స‌మాచారం మేర‌కు ఈ న‌టి త‌న త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌కుండా శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నార‌ని ఆమె ఆసుప‌త్రిలో స‌ర్జ‌రీ కోసం అడ్మిట్ అయిన‌ప్పుడు తెలియ‌జేయ‌లేద‌ని తెలిపాయి.అయితే న‌టి చేత‌న‌కు గుండెపోటు వ‌చ్చింద‌ని కాడే ఆసుప‌త్రి వైద్యులు పేర్కొంటున్నారు. ఆమె ఆసుప‌త్రికి చేరిన త‌ర్వాత ఆమెను ప‌రిశీలించారు. ఆమె స్పందించ‌క‌పోవ‌డంతో పాటు ప‌ల్స్ రేటు ప‌డిపోయింద‌ని వెంట‌నే CPRని ప్రారంభించి బ్ర‌తికించుదామ‌నుకునే లోపు అప్ప‌టికే మృతి చెందింది.

ప్ర‌స్తుతం చేత‌న మృత‌దేహం కాడే ఆసుప‌త్రిలో ఉంది, ఆమె మ‌ర‌ణానికి కార‌ణం నిర్థారించడానికి పోస్టుమార్టం నిర్వ‌హించేందుకు ఎంఎస్ దామ‌య్య ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే త‌మ కూతురు కాస్మోటిక్ Hospital క‌మిటీ నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే చ‌నిపోయింద‌ని త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.పోలీసులు ఫిర్యాదును స్వీక‌రించి రెండు ఆసుప‌త్రుల్లో కూడా విచార‌ణ చేప‌డుతున్నారు. ఆమె మ‌ర‌ణానికి కార‌ణం ఏమిట‌నేది నిజ నిర్థార‌ణను అన్వేషిస్తున్నారు.

Aruna Hospital: ప‌లుమార్లు ఆప‌రేష‌న్ బాలింత మృతి.. శిశువు ప‌రిస్థితి విష‌మం!

Aruna Hospital: హైద‌రాబాద్: ఎల్బీన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని అరుణ ఆస్ప‌త్రిలో దారుణం చోటు చేసుకుంది. అనేస్థీషియా అధికంగా ఇవ్వ‌డంతో కోమాలోకి వెళ్లిన గ‌ర్భిణీ ప్ర‌తిభ‌(27) హ‌డావిడిగా Read more

Tumor Surgery : ఖ‌మ్మంలో అరుదైన శ‌స్త్ర చికిత్స

సెయింట్ మేరీస్ హాస్పిట‌ల్‌లో 10 కేజీల గ‌డ్డ తొల‌గింపు Tumor Surgery : Khammam : ఖ‌మ్మం న‌గ‌రంలో స్థానిక సెయింట్ మేరీస్ హాస్పిట‌ల్ లో అరుదైన Read more

Tumour operation: బ్రింద‌లో అరుదైన శ‌స్త్ర చికిత్స‌ |Brinda hospital| khammam

Tumour operation: Khammam: న‌గ‌రంలోని భ‌క్త‌రామ‌దాసు క‌ళాక్షేత్రం ఎదురుగా ఉన్న ప్ర‌ముఖ బ్రింద ఆసుప‌త్రిలో శ‌నివారం అరుదైన శ‌స్త్ర చికిత్స చేశారు. ఖ‌మ్మం జిల్లా ఎర్రుపాలెంకు చెందిన Read more

Business News India: ఇండియా బిజినెస్ వార్త‌ల‌ను చ‌ద‌వండి

Business News India | శుక్ర‌వారానికి సంబంధించిన బిజినెస్ తాజా వార్త‌లు కింద ఇవ్వ‌డం జ‌రిగింది. ఇందులో భాగంగా ఆదానీ ప‌వ‌ర్ స్టాక్ విలువ‌, ఇన్సూరెన్స్ కొత్త Read more

Leave a Comment

Your email address will not be published.