Turmeric powder skin | పసుపులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో యాంటి సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలున్నాయి. ఈ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తెగిన చిన్న గాయాలు, కాలిన గాయాలపై వెంటనే పసుపు చల్లడం వల్ల తక్షణం ఉపశమనం కలుగుతుంది. సాధారణంగా వచ్చే జలుబు, కీళ్ల నొప్పులు, కాలిన గాయాలు, మొటిమలు, మచ్చలు, చర్మానికి సంబంధించిన వివిధ రకాల సమస్యలను (Turmeric powder skin)నివారిస్తుంది. ఇది ఆల్జీమర్స్‌కు, ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల లేదా రెగ్యులర్‌గా వేసుకునే పెయిన్ కిల్లర్స్ వల్ల వచ్చే కాలేయ సమస్య లక్షణాలను నివారిస్తుంది.కాబట్టి పసుపు వంటింట్లోనే కాకుండా చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పసుపు ప్రతి ఒక్కరూ వాడాల్సిన ఒక ఆయర్వేద మందు. పసుపు గురించి మరిన్ని ఉపయోగాలను ఈ క్రింద తెలుసుకుందాం.
పసుపుతో ఆరోగ్యం-అందం!
-పసుపు, చందన పొడి, రోజ్ వాటర్ తో కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పూసి, కొంతసేపటి తర్వాత కడగాలి. దీని వల్ల ముఖంపై వచ్చే పింపుల్స్, చిన్న పొక్కులు, ఇతర వ్యర్థ మలినాలు తగ్గుతాయి.
-దానిమ్మ, బత్తాయి, నిమ్మ తొక్కలు ఎండబెట్టి పొడిచేసి స్నానం చేసే ముందు పసుపుతో కలిపి శరీరంపై రుద్దుకుంటే చర్మరంధ్రాల్లో మురికిపోయి శరీరానికి నిగారింపు వస్తుంది.
-వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్టును రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి.
-పసుపు, గంధం సమపాళ్లలో తీసుకొని పేస్టులా చేసి పెరుగు వేసి కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
-మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి, దానినే టూత్ పౌడర్‌గా వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన, పుప్పిపళ్లు నివారింపబడతాయి.
-నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తున్నట్లయితే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది.
-పసుపు కొమ్ములను నూరి, నీళ్లలో అరగదీసి లేదా పసుపు పొడిని పేస్టులా నీళ్లతో చాది గానీ కడితే సెగగడ్డలు, కురుపులు మెత్తబడతాయి పుళ్లు మానుతాయి.
-పసుపును స్నానానికి ముందు కొబ్బరి నూనెతో కలిపి ముఖానికి రాసుకుని మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ రోగాలు రావు, ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

-వేడి చేసిన నీటిలో తేయాకు, మినప పిండి, సెనగ పిండి, పసుపు వేసి బాగా కలియతిప్పి, ఈ మిశ్రమాన్ని పొయ్యిమీద పెట్టి, రెండున్నర గ్లాసుల నీరు పోసి బాగా మరుగుతుండగా అట్టి ఆవిరిని పీలిస్తే ఉబ్బసం, ఇస్నోఫీలియా మటుమాయం అవుతుంది.
-రోజూ సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణి, దిరిసెన ఆకులు కలిపి ఇంట్లో ధూపం వేసి దోమలనూ, కీటకాలను నిరోధించవచ్చు.
-పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!