Turkana: కెన్యా(Kenya) ఉత్తర భాగాన అల్కాలైన్ నది (Alkaline Lake) ఒడ్డున తుర్కానా (Turkana) అనే తెగ సమూహం గల స్త్రీలు తన మగవాళ్లతో జీవిస్తుంటారు. వారు నదిలో చేపలు పట్టుకొని వాటిని ఆహారంగా తీసుకుంటూ జీవిస్తుంటారు. అయితే ఆ నది ఒడ్డన ఎటు చూసినా నిర్మాణుష్యమైన ప్రదేశమే కనిపిస్తుంటుంది. అక్కడ వారి జీవించడానికి సొంతగా ఇళ్లు నిర్మించుకుంటుంటారు.
Turkana: కేవలం ఆకులతోనే ఇల్లు!
తుర్కనా స్త్రీలు నిర్మించే ఇంటి నిర్మాణం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తోంది. మన దేశంలోని, సాధారణంగా ప్రతి దేశంలోనూ ఇల్లు నిర్మించాలంటే మగవారు ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. ఆడవాళ్లు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం మగవారితో నిర్మితమైన ఇళ్లల్లోనే మనం జీవిస్తుంటాం.కానీ ఇక్కడ కేవలం ఆడవారి సమూహం మాత్రమే శ్రమపడి ఇల్లు (house) నిర్మించుకుంటారు. దానికి గల కారణాలు ఏమిటనేది తెలియనప్పటికీ వారు నిర్మించిన ఇల్లు విధానం చూస్తే షాక్ అవ్వాల్సిందే.
తుర్కానా తెగ నివసిస్తున్న నది తీరానికి కాస్త కాలినడక దూరంలో డౌమ్ పామ్ అనే పేరుగల చెట్లు పొదలు ఉన్నాయి. ఇవి చూడటానికి మన ఖర్జూరపు చెట్లను లేదా తాటి చెట్లను పోలి ఉంటాయి. కానీ ఇవి కేవలం పొదలుగా ఏర్పడి దట్టంగా ఉండే చెట్లు మాత్రమే. ఈ చెట్టు ఆకులతోనే కేవలం ఇల్లు అంతా నిర్మిస్తారు తుర్కానా స్త్రీలు (Turkana Women).


ముందుగా అక్కడ స్త్రీలు పొడవాటి కత్తిని తీసుకొని వెళ్లి డౌమ్ పామ్ ఆకులను నరుకుతారు. వాటి మట్టలను ముళ్లు లేకుండా చెలుగుతారు. అలా మట్టలను, ఎండిన ఆకులను మోసుకొని కొందరు స్త్రీలు వారు నివాసం ఉంటున్న ప్రదేశానికి వస్తారు. వారు ఉంటున్న స్థలంలో తుర్కానా స్త్రీలు కొందరు ఒక రౌండ్‌గా గీత భూమి మీద గీసి ఆ రౌండులో లోతుగా ఒక అడుగు మట్టిని తీస్తాను. వారు తీసుకొచ్చిన doum palm చెట్టు మట్టలను చుట్టూ పాతుతారు.


అలా పాతి పచ్చి ఆకులతో కట్టు కడతారు. ఇలా మధ్య మధ్యలో గట్టి కర్రలను కూడా వేసి చుట్టూ ఒక ఆకారం వచ్చేలా కడతారు. మట్టలతోనూ, కర్రలతో అలా కట్టిన తర్వాత ఇంటి నిర్మాణం ఆకారం వస్తుంది. ప్రతి స్త్రీ ఈ పనుల్లో పాలు పంచుకుంటారు. ఒకరు ఆకులు సరిచేస్తుంటే, మరొకరు ఆ ఇంటి నిర్మాణం గొయ్యిలో పేర్చుతుంటారు. అలా చుట్టూ పేర్చి వాటిని లేత ఆకులను కట్టులుగా ఉపయోగిస్తారు. ఇలా ఇల్లు నిర్మాణం జరుగుతుండగానే మరికొందరు ఆకులను మోపులుగా తెస్తుంటారు.


గుడిసెలను పోలిన ఇల్లు!
ఇలా వారు ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు పదునైన రాళ్ళతో మట్టల నుండి నారను తీస్తారు. అచ్చం మన ప్రాంతంలో ఉండే వారి గుడిసెలను పోలి ఉన్నాయి వారి ఇళ్లు. ఇల్లు పూర్తియ్యే టప్పుడు ఒక స్త్రీ లోపల నుండి రంధ్రాలు లేకుండా కట్లు కడుతుంటారు. మరొక స్త్రీ ఇంటి పై కప్పును పేర్చుతుంటారు. ఇంకొక స్త్రీ ఇంటి మొత్త కోసం ఆకులను ఒక ఆకారంలో నరికి తల మొత్త తడికను తయారు చేస్తుంది. తయారు చేసిన తడికను లోపలికి వెళ్లే ద్వారంలో అమర్చుతుంది.


ఇలా ఆ ఇల్లు నిర్మాణం పూర్తయ్యే దాక తుర్కానా స్త్రీలు మాత్రమే పని చేస్తారు తప్ప. వారిలో ఏ మగవారూ పనిలో చేయ పెట్టరు. ఇలా గుడిసె నిర్మాణం పూర్తయ్యాక అందులో నివసిస్తుంటారు. ఈ తెగ కలిసి మెలిసి జీవిస్తూ నది లో దొరికే చేపలను ఆహారంగా తీసుకుంటూ ఆటపాటలతో నృత్యాలు చేస్తూ జీవిస్తుంటారు.
వీడియో కోసం లింక్ నొక్కండి: Fisherman’s House Made from Nothing But Leaves! The Turkana of Northern Kenya