సెయింట్ మేరీస్ హాస్పిటల్లో 10 కేజీల గడ్డ తొలగింపు
Tumor Surgery : Khammam : ఖమ్మం నగరంలో స్థానిక సెయింట్ మేరీస్ హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. ఇల్లందు రైటర్ బస్తీకి చెందిన కర్ణ జయమ్మ గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. చికిత్స కోసం ఇల్లందు, ఖమ్మంలోని పలు ఆసుపత్రులను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేదని జయమ్మ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలోని సెయింట్ మేరీస్ మిషన్ ఆసుపత్రిని ఆశ్రయించారు. అక్కడ వైద్యులు కర్ణ జయమ్మకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలో కడుపులో గడ్డ(Tumor) ఉన్నట్టు నిర్థారించారు. డాక్టర్ మోర్తాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స ద్వారా దాదాపు 10 కేజీల బరువున్న గడ్డను తొలగించారు.

ఆపరేషన్ అనంతరం జయమ్మ కోలుకుంటూ సెయింట్ మేరీస్ మిషన్ ఆసుపత్రి వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపింది. గతంలో కూడా ఖమ్మం అగ్రహారం కాలనీకి చెందిన షేక్ సాఫియాకు 6 కేజీల బరువు గల గడ్డ(Tumor)ను తొలగించినట్టు వైద్యులు పేర్కొన్నారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!