Tummala Nageswara rao | రాజకీయంగా శత్రువులను నమ్మొచ్చు కానీ రాజకీయ ద్రోహులను మాత్రం నమ్మొద్దని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. టిఆర్ఎస్లోని అసమ్మతి సెగలు బయటకొచ్చాయి. ఈ సందర్భంగా తుమ్మల అభిమానులు, సన్నిహితులు ఇటీవల సమావేశాలు కూడా పెట్టారు. ఈ క్రమంలో తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara rao) నిన్ని ఓ సమావేశంలో రాజకీయాలపై పై విధంగా స్పందించారు.
శత్రువులు వాళ్ల పార్టీకి ఓటు వేసుకుంటారు. కానీ రాజకీయద్రోహులు మాత్రం ఉన్న పార్టీనే ఓడించే వారుంటారన్నారు. ద్రోహులను కనిపెట్టే బాధ్యత మీదేనని నేను తప్పకుండా మిముందుకు వస్తానని అభిమానులకు భరోసా కల్పించారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం చెరువు మాధారం గ్రామంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆయన వస్తున్న విషయం తెలుసుకున్న మండట టిఆర్ఎస్ శ్రేణులు తుమ్మల అభిమానులు తుమ్మలకు ఘన స్వాగతం పలికారు. ద్విచక్ర వాహనాలు కార్లతో భారీ కాన్వాయ్ తో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో ఉంచేందుకు అన్ని పథకాలను అమలు చేసి అగ్రగామిగా నిలిపానన్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు డొంకలకు బీటీ రోడ్డు గ్రామాలను కలుపుతూ రింగ్ రోడ్డు తెచ్చానన్నారు. ఖమ్మం-కోదాడ హైవే రాకతో రైతుల పంట పొలాలకు డిమాండ్ పెరిగిందన్నారు. నేలకొండపల్లిలో రోడ్డు వెడల్పు డివైజర్లు చెరువు మాధారంలో మినీ స్టేడియం ఏర్పాటు అన్ని తన హయాంలోనే చేశానని గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్ ఉదార స్వభావంతో పాలేరు నియోజకవర్గంతో పాటు ఖమ్మం జిల్లాకు ఇచ్చిన అభివృద్ధి పథకాలను పూర్తి చేసే బాధ్యత నాదేనన్నారు. మిగిలి ఉన్న అభివృద్ధి పనులను కూడా సీఎం కేసీఆర్తో మాట్లాడి పూర్తి చేయిస్తానన్నారు. ఈ సందర్భంగా మీరు నాకు ఇచ్చిన ఈ అపూర్వ స్వాగతానికి జన్మ జన్మల రుణపడి ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు సాధు రమేశ్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శాఖమూరి రమేష్, మాజీ మండల అధ్యక్షులు వెన్నపూసల సీతారాములు, బండి జగదీష్, తమ్మినేని కృష్ణయ్య, యడవల్లి సైదులు, పత్తి శ్రీనివాస్, సర్పంచ్లు వల్లాల రాధాకృష్ణ, షేక్ మస్తాన్, యూత్ నాయకులు కడియాల నరేష్, కొమ్మూరి నరేష్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!