tuglaq story:తుగ్ల‌క్ అంటే ఎవ‌రు? అస‌లు అత‌ని పాల‌న ఎలా ఉండేది?

tuglaq story ప్ర‌స్తుతం దేశ రాజ‌కీయాల్లో ట్రెండింగ్‌లో ఉన్న ప‌దం తుగ్ల‌క్ పాల‌న. ఇది ప్ర‌తి రాజ‌కీయ నాయకుడు ప్ర‌భుత్వాలు ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న చేస్తున్న‌ప్పుడు సంబోధించే ప‌దం. తుగ్ల‌క్ గురించి అంత‌ర్గ‌తంగా ఎక్కువుగా తెలియ‌క‌పోయినా అత‌ని పాల‌న అంటే ప్ర‌జ‌లకు న‌చ్చ‌దా? అనే ఆలోచ‌న మాత్రం ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌కు తెలిసింది. కానీ తుగ్ల‌క్ చేసిన ఆ ప‌నులు ఏమిటి, త‌న రాజ్యానికి ఎన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టాడు, అత‌ని రాజ్యాధికారం ఎలా ఉండేదో ఇప్పుడు(tuglaq story) తెలుసుకుందాం.

మ‌ధ్య‌యుగ‌పు భార‌త‌దేశ చ‌రిత్ర‌లోనే కాదు ఢిల్లీ సుల్తానుల చ‌రిత్ర‌లోనే వివాదాస్ప‌ద‌మైన సుల్తాన్ మ‌హ్మ‌ద్ బీన్ తుగ్ల‌క్‌. త‌న సువిశాల సామ్రాజ్యాన్ని ప‌రిపాలించ‌డానికి ఎన్నో సంస్క‌ర‌ణ‌ల‌ను చేప‌ట్టిన తుగ్ల‌క్ విద్యావంతుడు, దూర దృష్టి క‌ల‌వాడ‌ని పేరు. అయినా అత‌ని ప‌ద్ధ‌తులు, చ‌ర్య‌లూ కాలానికి త‌గిన‌ట్టుగా లేక‌పోవ‌డం వ‌ల్ల అంద‌రూ అత‌న్ని పిచ్చివాడ‌ని, విరుద్ధ‌మైన భావాలు క‌ల‌వాడ‌ని అంటారు.

తుగ్ల‌క్ అవ‌లంభించిన అలాంటి వాటిల్లో రాజ‌ధాని మార్పు ఒక‌టి. త‌న రాజ్యం విశాలంగా ఉంద‌ని, రాజ‌ధాని రాజ్యం మ‌ధ్య‌లో ఉండాల‌ని, రాజ‌ధానిని ఢిల్లీ నుండి దేవ‌గిరికి మార్చాడు. అక్క‌డ వాతావ‌ర‌ణం బాగా లేద‌ని మ‌ళ్లీ రాజ‌ధానిని ఢిల్లీకి మార్చాడు. ఈ చ‌ర్య అటు ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లిగించింది. ఇటు ప్ర‌భుత్వ ఖ‌జానాలోని ధ‌నం త‌రిగిపోయింది. అంతే కాదు తుగ్ల‌క్ చేసిన అన‌వ‌స‌ర యుద్ధాలు కూడా ఒక ర‌కంగా ప్ర‌జ‌ల‌కు ఇత‌నిపై ద్వేష‌భావం ఏర్ప‌డ‌టానికి కార‌ణ‌మైంది.

ముందూ, వెనుకా చూసుకోకుండా త‌న రాజ్య స‌రిహ‌ద్దుకు అవ‌త‌లివైపులో ఉన్న చైనాపై యుద్ధానికి దిగాడు. అక్క‌డి వాతావ‌ర‌ణాన్ని, అధిక చ‌లిని త‌ట్టుకోలేక ఎంతో మంది సైనికులు మ‌ర‌ణించారు. ఇలాంటి చ‌ర్య‌ల‌తో ప్ర‌భుత్వ ఖ‌జానా దివాలా తీసింది. దీంతో లోహాల కొర‌త కార‌ణంగా రాగి నాణేల‌ను చ‌లామ‌ణికి పెట్టాడు. కానీ ప్ర‌త్యేక చిహ్నాల‌తో ముద్రించుకోవ‌డం మొద‌లెట్టారు. ఇది గ్ర‌హించి మ‌ళ్లీ బంగారం, వెండి నాణేలు ప్ర‌వేశ‌పెట్టాడు. దీంతో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిగా దెబ్బ‌తింది. అందుకే మ‌హ్మ‌ద్ బీన్ తుగ్ల‌క్‌ను పిచ్చివాడ‌ని అంటారు. ఇలా విరుద్ధ మైన ప‌నులు చేసే వారిని తుగ్ల‌క్ అని అన‌డ‌మూ ప‌రిపాటిగా మారింది.

Share link

Leave a Comment