TTD Online tickets: అక్టోబర్ 2022 కు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆగష్టు 24న అగాన నేడు(బుధవారం) ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదే విధంగా, అక్టోబరు నెలకు సంబంధించిన మరికొన్ని ఆర్జితా సేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ నేటి మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది.
కాగా అక్టోబర్ 2022, సంబంధించి వర్చువల్ సేవలైన్ కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజాల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటా, వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోటా ఆగష్టు 24న నేడు సాయంత్రం 4 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. భక్తులు ఈ విషయాలను గుర్తించి శ్రీవారి ఆర్జిత సేవలను బుక్(TTD Online tickets) చేసుకోవాలని కోరడమైనది.
విజిలెన్స్ వైఫల్యం
తిరుపతిలో మరో మారు విజిలెన్స్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మద్యం బాటిళ్లతో ఏకంగా తిరుమల సప్తగిరి అతిథి గృహాల వద్ద ఓ వ్యక్తి ప్రత్యక్షమైయ్యాడు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులకు సమాచారం రావడంతో అదుపులోకి తీసుకున్నారు అధికారులు. దాదాపు 12 మద్యం బాటిళ్లను ఆ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నారు.