TTD Fake Webistes చిత్తూరు: పోలీసుల దృష్టి వెంకన్న స్వామి భక్తుల పరిరక్షణపై పడింది. ఫలితంగా తిరుమల స్వామివారి దర్శనానికి టికెట్లను అమ్ముతాం అంటున్న 39 ఫేక్ వెబ్సైట్లను(మోసపూరిత) గూగుల్ నుంచి తొలగింప చేశారు. జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపించడం సాధ్యపడిందన్నారు.Google యాజమాన్యంతో మాట్లాడి, ఫేక్ వెబ్సైట్ల(TTD Fake Webistes) వివరాలు తెలుసుకుని వాటిని గూగుల్ నుంచి తొలగించారు.
భక్తులు మోసానికి గురికావొద్దు!
కేవలం వెంకన్న స్వామి మీద ఉన్న అపార విశ్వాసంతో దేశం నలుమూలల నుంచి స్వామి దర్శనానికి వచ్చే భక్తుల మోసానికి గురికాకుండా ఉండేందుకు అర్బన్ పోలీసు విభాగం ప్రత్యేక చర్యలకు పూనుకుంది. దీని ఫలితంగా ఫేక్ వెబ్సైట్లను గూగుల్ నుంచి తొలగించడమే కాకుండా 17 మంది దళారులను అరెస్టు చేసి వారిపై సస్పెక్ట్ షీటలను ఓపెన్ చేశామని తెలిపారు. ఇకపై తిరుమలలో ఎలాంటి మోసపూర్తి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యల తీసుకొని కేసు నమోదు చేశామని, త్వరగా దర్యాప్తు చేసి శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.


రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం.!
ఇకపై దళారులు పట్టుబడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ అప్పల నాయుడు హెచ్చరించారు. భక్తులకు సూచనలు ఇస్తూ, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, టిటిడి అధికారిక వెబ్సైట్ ద్వారానే సేవా టికెట్లు ఇతరత్రా కొనుగోలు చేయాలని కోరారు. స్వామి వారి సేవకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల సంక్షేమం వారి భద్రతే ప్రధామని భావించి పోలీసు విభాగం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. తిరుమల వెంకన్న స్వామి పేరుతో ఇటీవల మోసాలు పెరుగుతుండటంతో పోలీసు విభాగం వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించడం జరుగుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ ప్రభాకర్ బాబు, సిఐలు టౌన్ జగన్ మోహన్ రెడ్డి, డిసిఆర్బి రాఘవన్, ఈస్ట్ శివ ప్రసాద్ రెడ్డి, టౌన్ చంద్రశేఖర్, ఎస్సైలు రమేష్, వెంకట చిన్న, ప్రకాష్ పాల్గొన్నారు.
- Company IPO: కంపెనీ ఐపిఓలను ఎందుకు జారీ చేస్తుంది?
- Technical Analysis: స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ అంటే ఏమిటి?
- trailing stop loss:ట్రైలింగ్ స్టాప్‌లాస్ ఎలా ఉపయోగించాలి? | stock market
- stock market cycle: స్టాక్ మార్కెట్ సైకిల్, స్టేజెస్
- Munugode By Elections 2022: నా త్యాగం మునగోడు అభివృద్ధికి శ్రీకారమంటున్న రాజగోపాల్ రెడ్డి!